అన్వేషించండి

ఈ లక్షణాలు కనిపిస్తే మీకు సీఫుడ్ అలెర్జీ ఉన్నట్టే - చేపలు, రొయ్యలు పక్కన పెట్టాల్సిందే

సీఫుడ్ మంచిదే కానీ అందరికీ ఇది పడాలని లేదు.

చికెన్, మటన్‌తో పోలిస్తే చేపలు, రొయ్యలు, పీతలు చాలా ఆరోగ్యకరమైనవి. కానీ కొందరికి పడవు. తమకు పడతాయో పడవో తెలియక కొంతమంది వాటిని తిని తరువాత ఆరోగ్యసమస్యలు తెచ్చుకుంటారు. సీఫుడ్ తిన్నాక కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వాటిని తినకూడదు. ఈ లక్షణాలు దాదాపు వెంటనే కనిపిస్తాయి. కొన్ని మాత్రం ఆలస్యంగా బయటపెడతాయి. సరిగా వండని సీఫుడ్ తినడం వల్ల మాత్రం తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరాన్నజీవులు రక్తంలో చేరి అనారోగ్యాలకు కారణం కావచ్చు. అందుకే చేపలు, రొయ్యలు, పీతలు వంటివి బాగా వండాకే తినాలి. 

సీఫుడ్ అలెర్జీ అంటే ఏమిటి?
చాలా మందికి సీఫుడ్ అలెర్జీ అంటే ఏమిటో అర్థం కాదు. సముద్ర జీవులైన చేపలు, రొయ్యలు, పీతల్లాంటివి తినడం వల్ల అందులోని ప్రోటీన్లు మన శరీరంలో చేరాక రోగనిరోధక వ్యవస్థ వైవిధ్యంగా స్పందిస్తుంది. అప్పుడు శరీరం ఆ లక్షణాలను ఏదో ఒక రూపంలో బయటపెడుతంది. అందరికీ ఇలా జరగాలని లేదు. చాలా మందికి సముద్రపు చేపలు పడతాయి. కానీ కొందరిలో రోగనిరోధక వ్యవస్థ తట్టుకోలేదు. దీన్నే అలెర్జీ అంటారు. 

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే...
ఈ లక్షణాలు సీఫుడ్ తిన్న నిమిషాల్లోనే కనిపిస్తాయి.  
1.శరీరం దురద పెడుతుంది. 
2. చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. 
3. ముక్కు దిబ్బడ కడుతుంది. 
4. పెదవులు, ముఖం, నాలుక, గొంతుపై వాపు వస్తుంది.
5. గురక, శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. 
6. దగ్గు రావడం, ఉక్కిరిబిక్కిరి అవ్వడం జరుగుతుంది. 
7. పొత్తికడుపులో నొప్పి వస్తుంది. 
8. వికారం, వాంతులు, విరేచనాలు అవుతాయి. 
9.తల తిరగడం మూర్ఛపోవడం కూడా జరుగుతుంది. 
అన్నింట్లోకి ప్రాణాంతకమైనది అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలెర్జీ. ఇది వస్తే వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేయాలి. 

ఎక్కువగా షెల్ఫిష్ లు ఇలా అలెర్జీలకు కారణం అవుతాయి. అంటే పీతలు, రొయ్యలు వంటి షెల్ ఉన్న జీవులు. ఎక్కువగా ఇవే అలెర్జీలను కలుగజేస్తాయి.ఈ  అలెర్జీకి ఎటువంటి నివారణ లేదు. కాబట్టి ఈ అలెర్జీలు మీకుంటే రొయ్యలు, పీతలు  ఆహారాలను తినకూడదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

సీఫుడ్ తిన్నాక మీకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే వాటిని హ్యాపీగా తినవచ్చు. కచ్చితంగా తినాలి కూడా. ఎందుకంటే చేపలు, రొయ్యలు, పీతల్లాంటివి ఎంత తిన్నా పెద్దగా బరువు పెరగరు. పైగా అందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు లభిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. 

Also read: ప్రపంచంలో భయపెట్టే బొమ్మ ఇదే - దీని గురించి తెలిస్తే బొమ్మలు కొనడానికే భయపడతారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget