Marriage Advice : పెళ్లి ఇష్టం లేకపోతే నో చెప్పండి.. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే వీటిని బ్రేక్ చేయకండి
Marriage Commitment : రీసెంట్గా జరుగుతున్న సంఘటనలు చూస్తే పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్‌గా ఉండడమే బెటర్ అనే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలా? వద్దా?

Importance of Compatibility in Marriage : ఓ వయసు వచ్చే సరికి ఇష్టమున్నా లేకున్నా తల్లిదండ్రులు, పెద్దలు కలిసి అమ్మాయి లేదా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసేస్తారు. ఒకప్పుడు లవ్ మ్యారేజ్ కంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు బెటర్‌గా ఉండేవి అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా ఇప్పుడు ఫ్యామిలీల్లో విషాదాన్ని నింపుతున్నాయి.
ప్రేమ పెళ్లిల్లు ఒప్పుకోవడానికి ఇష్టపడరు కానీ.. ఎవరో బయటి వ్యక్తి(అమ్మాయి లేదా అబ్బాయి)కి ఇచ్చి జీవితాలను మాత్రం బలిచేసేస్తారు. తాము కుదిర్చిన పెళ్లి సంబంధంతోనే కొడుకు లేదా కూతురు సంతోషంగా ఉంటారనే భ్రమలో ఉంటారు. బయట జరుగుతున్న పరిస్థితులు చూసినా వారు మీకు పెళ్లి చేయకుండా ఉంటారా అంటే ఉండరు. కచ్చితంగా చేస్తారు. కాబట్టి పెళ్లి చేసుకునే వారికి అయినా పెళ్లి గురించిన అవగాహన పెంచుకోవాలి.
ఇష్టం లేకుంటే నో చెప్పేయండి
ఇంట్లో మీకు నచ్చిన పెళ్లి చేయకుంటే ముందే నో చెప్పేయండి. మీరు కుదిర్చిన పెళ్లి చేసుకోలేనని చెప్పండి. లేదా మీకు కుదిర్చిన సంబంధంలో ఉన్న అబ్బాయికి లేదా అమ్మాయికి ఈ విషయం చెప్పేయండి. కనీసం వాళ్లు అయినా మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అంతేకానీ ఏమి చెప్పకుండా పెళ్లి చేసుకుని మీ జీవితంతో పాటు అవతలి వాళ్ల లైఫ్‌ని నాశనం చేసుకోవడం వేస్ట్.
ఇద్దరికీ ఓకే అనుకుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అప్పుడే పెళ్లి తర్వాత లైఫ్ బాగుంటుంది. లేదంటే ఆ తర్వాత ఇతర సంబంధాలు పెట్టుకోవడం మళ్లీ ఆ మ్యారేజ్ లైఫ్‌ని బ్రేక్ చేసుకోవడం వంటివి చేయకుండా ఉండాలంటే.. కొన్ని విషయాలు మైండ్‌లో పెట్టుకుని వాటికి ఓకే అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.
కమిట్మెంట్..
పెళ్లి అనేది లైఫ్‌లాంగ్ కమిట్మెంట్. కాబట్టి ఎవరో చెప్పారని లేదా ఏదో ఆశించి పెళ్లి చేసుకోకూడదు. మీరు పెళ్లి చేసుకునే వ్యక్తితో జీవితాంతం ఉండగలను అనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా అపార్థాలకు తావు ఇవ్వకుండా ఆ బంధాన్ని కాపాడుకోగలను అనే కమిట్మెంట్ ఉండాలి.
రెస్పెక్ట్
మీ భర్త లేదా భార్య ఆలోచనలకు కచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. విభిన్న ఆలోచనలతో కూడిన ఇద్దరు వ్యక్తులు కలిసి బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు.. ఒకరినొకరు గౌరవించుకుని వారి ఆలోచనలు రెస్పెక్ట్ ఇవ్వాలి. వారి నిర్ణయాలకు సలహాలు ఇస్తే చాలు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు.
తల్లిదండ్రులు..
మీ పేరెంట్స్‌ని సంతోషపరచడానికి లేదా ఇతరుల సంతోషం కోసం పెళ్లి చేసుకోకూడదు. మీరు ఓకే అనుకున్నప్పుడు.. అన్ని రకాలుగా సిద్ధం అనుకున్నప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి.
మానసికంగా..
భార్యభర్తల బంధం శారీరకంగానే ఉంటుంది. కానీ దానిని మానసికంగా బలపడేందుకు మీరు కృషి చేయాలి. ఎమోషనల్‌గా వారికి కనెక్ట్ అయితే బంధం కలకాలం ఉంటుందని గుర్తించుకోవాలి.
మీరు పెళ్లి చేసుకున్న వ్యక్తికి ప్రేమ ఇవ్వడం, నమ్మకాన్ని అందించడం, సపోర్ట్ చేయడం వంటివి చేయగలిగితేనే ఆ రిలేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వెంత అంటే నువ్వేంత అనుకుంటే ఆ మ్యారేజ్ చిక్కులతోనే నిండిపోతుంది. లేదా మరో పర్సన్ ఎంట్రీ ఉంటుంది. ఈ కమిట్మెంట్ మీకు ఓకే అనుకున్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. లేదంటే సింగిల్‌గా ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ పెళ్లి చేసుకుని అవతలి వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. వద్దు అనుకుంటే మీ పార్టనర్ అంగీకారంతో, పెద్దల సమక్షంలో విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేయడం ఉత్తమం.






















