News
News
X

Heart Attack: రక్తనాళాల్లో కొవ్వు చేరకూడదనుకుంటే సజ్జలను మెనూలో చేర్చుకోండి

చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒక భాగం. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

FOLLOW US: 
Share:

ఆధునిక ప్రపంచంలో బియ్యం ప్రధాన ఆహారంగా మారిపోయింది. కానీ ఒకప్పుడు పూర్వీకులు చిరుధాన్యాలనే తినేవారు. అందులో ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, రాగులను అధికంగా తినేవాళ్లు. ఎప్పుడైతే బియ్యం పంట ఎక్కువైందో ఆ రుచికి అలవాటు పడి, చిరుధాన్యాలను పక్కన పెట్టారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయి. చిరుధాన్యాల వాడకం తగ్గడం, బియ్యం వాడకం పెరగడం ఒకేసారి జరిగింది. అలాగే మానవాళి అనారోగ్యాల బారిన పడటం కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా గుండె సమస్యలు ఎక్కువైపోయాయి. గుండెకు ఆక్సిజన్ అందక కార్డియాక్ అరెస్టులు, గుండెపోటుతో మరణించే వారి శాతం పెరిగిపోయింది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్లే ఎక్కువగా గుండె వైఫల్యం చెందుతున్నట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉండాలంటే, సజ్జలతో వండిన ఆహారాలు తినడం ముఖ్యం. సజ్జలతో చేసిన అన్నం, రొట్టెలు, అల్పాహారాలు తినడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు బయటికి పోతుంది. 

సజ్జల్లో ఉండే ఫైటో కెమికల్ రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోనివ్వదు. ఒకవేళ పేరుకుపోయినా కూడా దానిని బయటికి పంపించేందుకు సహకరిస్తుంది. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సజ్జలను ఆహారంలో చేర్చుకుంటే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించవచ్చు. ఈ సజ్జల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణం ఉంది. అలాగే సజ్జల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగేలా చూస్తుంది. శరీరంలో ఎక్కడా కొవ్వు చేరకుండా కాపాడే గుణం సజ్జలకు ఉంది. కాబట్టి అధిక బరువు బారిన పడే అవకాశం తగ్గిపోతుంది. అధిక బరువుతో ముడిపడి ఉన్న అనారోగ్యాలు అంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊబకాయం వంటివన్నీ కూడా దూరంగా ఉంటాయి.

సజ్జలను తినడం కష్టం అనుకుంటారు చాలామంది, వీటిని రవ్వగా చేసి ఇంట్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా వాటితో సంగటి, అన్నం చేసుకొని తినవచ్చు. అలాగే పిల్లలకు అల్పాహారాలు, చిరుతిళ్లు కూడా వీటితో చేసుకోవచ్చు. సజ్జలతో చేసిన రొట్టెలు టేస్టీగా ఉంటాయి. వీటిని నాన్ వెజ్ కర్రీలతో తింటే వదలకుండా లాగించేస్తారు. ఒక నెలపాటు సజ్జలతో అన్నం వండుకుని తిని చూడండి. ఆరోగ్యంలో మార్పు మీకే కనిపిస్తుంది. చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. మధుమేహం బారిన పడిన వాళ్ళు ఆ వ్యాధి లక్షణాలు కనిపించకుండా ఆరోగ్యంగా ఉంటారు.  కాబట్టి సజ్జలు తినడం ఈరోజు నుంచే ప్రారంభించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Also read: ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఛాతీలోని కఫం, దగ్గు త్వరగా తగ్గిపోతాయి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 08 Feb 2023 09:27 AM (IST) Tags: blood circulation Pearl millets Pearl millets benefits

సంబంధిత కథనాలు

Cholesterol: ఈ మూడు పానీయాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేస్తాయ్

Cholesterol: ఈ మూడు పానీయాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేస్తాయ్

Hungry: అతిగా ఆకలి వేస్తుందా? అందుకు ఈ ఐదు సమస్యలే కారణం

Hungry: అతిగా ఆకలి వేస్తుందా? అందుకు ఈ ఐదు సమస్యలే కారణం

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

Mango: మామిడిపండుతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీలు - వీటితో ఈజీగా బరువు తగ్గొచ్చు

Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో

Salt: సాధారణ ఉప్పుకు బదులు రాతి ఉప్పు వాడి చూడండి, ఎన్ని ప్రయోజనాలో

Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?

Milk: పాలు తాగిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళితే అరిష్టమా? సైన్సు ఏం చెబుతోంది?

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Ram Pothineni: దసరా రేసులో అయిన రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!