Aluminum Foil: అల్యూమినియం ఫాయిల్‌లో ఆహారాన్ని ప్యాక్ చేస్తున్నారా? గుండె దడ పుట్టించే ఈ విషయాలు తెలుసా?
ఆహారాన్ని వెచ్చగా ఉండంతో పాటు ఈజీగా ప్యాక్ చేసే అవకాశం ఉండటంతో చాలా మంది అల్యూమినియం ఫాయిల్స్ ఉపయోగిస్తున్నారు. అయితే, వీటి ద్వారా ఆరోగ్యానికి చాలా ముప్పు కలుగుతుందంటున్నారు నిపుణులు.
Aluminum Foil: ఫుడ్ ను అనుకున్నట్లుగా ప్యాక్ చేయడంతో పాటు ఈజీగా క్యారీ చేసేందుకు గత కొంతకాలంగా అల్యూమినియం ఫాయిల్స్ ను బాగా వినియోగిస్తున్నారు. ఇళ్లలో వీటి వినియోగం కాస్త తక్కువే అయినా, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ ఫాయిల్స్ లో ఫుడ్ ను తీసుకెళ్లడం వల్ల కొన్ని గంటల పాటు తాజాగా ఉంటుంది. ఏమాత్రం వేడి తగ్గకుండా అప్పుడే తయారు చేసిన ఆహారాన్ని తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే, అల్యూమినియం ఫాయిల్స్ తయారీలో నాణ్యమైన అల్యూమినియం వాడరు. మిక్స్ డ్ మెటల్ తో తయారు చేస్తారు. దీంతో ఆరోగ్యానికి చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
అల్యూమినియం ఫాయిల్స్ లో నష్టాలేంటి?
అల్యూమినియం ఫాయిల్స్ లో ఉంచి ఫుడ్ 5 గంటలకు మించి ఉంచకూడదట. ఒకవేళ ఉంచితే, లోపల బాక్టీరియా పెరిగేలా చేస్తుంది. నెమ్మదిగా ఫుడ్ చెడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అల్యూమినియం ఫాయిల్ లో ఎక్కువ వేడి పదార్థాలు ఉంచినప్పుడు, అల్యూమినియం కరిగి ఆహారంలో కలిసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు అల్యూమినియం ఫాయిల్ కంటెయినర్ లో ఫుడ్ ఉంచడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఫుడ్ చుట్టూ అల్యూమినియం ఫాయిల్స్ ను గట్టిగా చుట్టడం వల్ల అందులో గాలి ఉండదు. ఫలితంగా ఆహారం త్వరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, బ్యాక్టీరియా, వైరస్ కారకాలు పెరిగిందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
అల్యూమినియంలో స్టోర్ చేసిన ఫుడ్ తింటే ఏమవుతుంది?
అల్యూమినియం ఫాయిల్స్ లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అల్జీమర్స్ సహా పలు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పార్కిన్సన్స్, కిడ్నీ సమస్యలు, ఎముకల సంబంధ సమస్యలు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ లాంటి సమస్యలు ఏర్పడుతాయి. అల్యూమినియం ఎక్కువగా ఫుడ్ లో కలవడం వల్ల మెదడు సంబంధ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. మానవ మెదడు కణాల పెరుగుదల రేటును కూడా అల్యూమినియం తగ్గిస్తుంది. అందుకే వీలైనంత వరకు అల్యూమినియం ఫాయిల్స్ వినియోగించడం సరికాదంటున్నారు నిపుణలు.
అల్యూమినియం ఫాయిల్స్ కు బదులుగా వీటిని వాడండి!
మిగిలిన ఆహారాన్ని అల్యుమినియం ఫాయిల్స్ కంటే టప్పర్ వేర్, గాజు పాత్రలను వినియోగించడం మంచిది. ఇవి ఆహారాన్ని చెడిపోకుండా కాపాడంతో పాటు వేడి కారణంగా కరిగి ఆహారంలో చేరే అవకాశం ఉండదు. ఫుడ్ రుచిని కోల్పోకుండా ఉంటుంది. అందుకే, వీటిని సురక్షిమైన స్టోరేజ్ కంటైనర్లుగా పిలుస్తారు. అయితే, టమాటలు, మసాలాలు, కూరలు, పచ్చళ్లు, పాల పదార్థాలు అల్యుమినియం ఫాయిల్స్ లో వీలైనంత వరకు ఉంచకూడదంటున్నారు నిపుణులు. శాండ్ విచ్‌లు, బ్రెడ్, కేకులు, మఫిన్‌లు, కాల్చిన కూరగాయలు, చికెన్ లాంటి పదార్థాలు అల్యుమినియం ఫాయిల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు అంటున్నారు. వీలైనంత వరకు తక్కువ సమయం పాటు నిల్వ ఉంచుకునేందుకు ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. ఎక్కువ సేపు స్టోర్ చేయడం మంచిది కాదంటున్నారు.
Read Also: మొసలి మాంసం తిన్న మహిళ - ఆమె కంటికి ఏమైందో తెలిస్తే.. కడుపులో తిప్పడం ఖాయం