Gym Tips: జిమ్‌కు వెళ్తే జ్వరమొస్తాది, వ్యాయామం వల్ల కాదు.. ఇవిగో ఈ కారణాల వల్ల, జర భద్రం!
రోజూ జిమ్‌కు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జిమ్ ఎక్విప్మెంట్స్ (పరికరాలు) ద్వారా ప్రమాదకర వైరస్‌లు శరీరంలోకి చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
Be Careful With Dangerous Germs In Gym: పొద్దున్నే లేవగానే చాలా మంది జిమ్ కు వెళ్తుంటారు. కనీసం గంట పాటు జిమ్ లో రకరకాలు వ్యాయామాలు చేస్తుంటారు. జిమ్, యోగా స్టూడియో, క్లైంబింగ్ జిమ్ లో ఆరోగ్యం కోసం కష్టపడుతుంటారు. అయితే, జిమ్ ద్వారా ప్రమాదకర వైరస్ లు జిమ్ చేసే వారికి వ్యాపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. జిమ్ చేసేందుకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.
జిమ్ లో వైరస్ లు ఎలా వ్యాపిస్తాయంటే?
జిమ్‌లు ప్రమాదకర సూక్ష్మక్రిములకు నిలయాలుగా ఉంటాయి. ఇండోర్ సైక్లింగ్ స్టూడియోలో సైకిల్ సీటు ద్వారా గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు కారణమయ్యే సూక్ష్మజీవులు విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. బూట్లు క్లైంబింగ్ లాంటి పరికరాల ద్వారా ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ అంటున్నారు. జీర్ణక్రియకు ముప్పు కలిగించే ఫర్మిక్యూట్‌లు, సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్, క్లేబ్సిల్లా, మైక్రోకాకస్ లాంటి సూక్ష్మ జీవులు సులభంగా వ్యాప్తి చెందుతాయి. జిమ్ లలో ఉపయోగించే వాష్ రూమ్ ల ద్వారా కూడా ప్రమాదకర వైరస్ లు ఆరోగ్య వంతులకు చేరే అవకాశం ఉందన్నారు నిపుణులు.
జిమ్ ల ద్వారా శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి ఎక్కువ
జిమ్ లోని పరికరాలను శుభ్రంగా ఉంచేందుకు జిమ్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ, పూర్తి స్థాయిలో సాధ్యంకాదని నిపుణులు వెల్లడించారు. యాంటీ బాక్టీరియల్ వైప్స్, స్ప్రేలు మాత్రమే బ్యాక్టీరియాను అరికడుతాయని తెలిపారు. రింగ్‌వార్మ్, టోనెయిల్ ఫంగస్ లాంటి ఇన్ఫెక్షన్లు ఏర్పడితే నయం కావడం చాలా కష్టమని డాక్టర్లు వెల్లడించారు. "ఫంగస్ సాధారణంగా గోరు లోపల పెరుగుతుంది. మందులు ఫంగస్‌లోకి ప్రవేశించడానికి చాలా సమయం పడుతుంది. ఫంగస్ పూర్తిగా నిర్మూలించడానికి నెలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది’ అని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 తర్వాత వైరస్ వ్యాప్తి విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఫ్లూ లాంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జిమ్ నుంచే వ్యాప్తి చెందుతాయని చెప్పారు. ఎక్కువ మంది బలంగా శ్వాస తీసుకోవడం వల్ల వైరస్ లు మరింతగా వ్యాప్తి చెందుతాయన్నారు.
జిమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?
జిమ్ లో పరికరాలను ఉపయోగించే ముందు వైరస్ లను నిర్మూలించే వైప్స్ ద్వారా శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. సూక్ష్మక్రిములు, వైరస్‌లు, శిలీంధ్రాలను అరికట్టే స్ప్రే వాడటం మంచిదంటున్నారు. వర్కౌట్స్ కోసం ఉపయోగించే ఎక్యుప్ మెంట్స్ పొడిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు. జిమ్ లో వీలైనంత వరకు సాక్స్ ధరించడం మంచిదంటున్నారు. సాక్సుల కారణంగా వ్యాధికారక క్రిములు నేరుగా బాడీలోకి చేరే అవకాశం లేదంటున్నారు. జిమ్ చేసే వాళ్లు వీలైనంత వరకు గోళ్లను కట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గోళ్ల ద్వారా క్రిములు వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది. జిమ్ చేసిన తర్వాత చేతులు కడుక్కునే వరకు కళ్లు, ముక్కు, ముఖాన్ని టచ్ చేయకపోవడం మంచిదంటున్నారు.
Read Also : స్నేహితులతో ఎంజాయ్ చేసే రాత్రి ఇది, ఈ స్లీప్ ఓవర్ డే కేవలం ఆడవారికి మాత్రమే.. ఎందుకంటే ?