అన్వేషించండి

AC Condensate Water Harvesting: ఏసీ ద్వారా వచ్చే నీటిని తాగొచ్చా? మొక్కలకు ఉపయోగించవచ్చా?

AC Condensate Water Harvesting: మీ ఏసీ నుంచి రోజూ గ్యాలన్ల నీరు వృథాగా పోతుంది. ఆ వ్యర్థ నీటిని ఎలా ఉపయోగించుకుంటే పర్యావరణానికి మంచిది? ఆ వాటర్‌ తాగేందుకు వీలుగా ఉంటుందా? 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఏసీ నీటిని మొక్కలకు, పక్షులకు, ఇంటి పనులకు వాడవచ్చు.

AC Condensate Water Harvesting: వేసవి వచ్చింది అంటే చాలు ఉక్కపోతతో జనం అల్లాడిపోతారు. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు వాడుతుంటారు. అయితే ఏసీ నడుస్తున్నప్పుడు దాని నుంచి నీరు వస్తుంది. చాలా మంది ఈ నీటిని వృథాగా పడేస్తుంటారు. కానీ ఈ ఏసీ కండెన్సేట్ వాటర్ చాలా విధాలుగా వాడుకోవచ్చు. 

ఏసీలో నీరు ఎలా తయారవుతుంది?

ఎయిర్ కంటినషనర్లు కేవలం గాలిని చల్లబరచడమే కాకుండా, గాలిలోని తేమను తొలగిస్తాయి. ఏసీ లోపల ఉండే ఎవాపరేటర్ కాయిల్స్‌ చాలా చల్లగా ఉంటాయి. గదిలోని వెచ్చని గాలి ఈ కాయిల్స్ మీదుగా వెళ్లినప్పుడు గాలిలోని తేమ నీటి బిందువులుగా మారుతుంది. దీనినే కండెన్సేషన్ అంటారు. ఒక గ్లాసు ఐస్ నీళ్ల చుట్టూ ఏర్పడిన నీటి బిందువులులా ఏసీలో నీరు తయారవుతుంది. ఈ నీరు ఒక డ్రెయిన్ పైపు ద్వారా బయటకు వస్తుంది. 

ఎంత నీరు వృథా అవుతుంది?

సాధారణ ఇళ్లలో సగటు ఏసీ యూనిట్‌ రోజుకు సుమారు 30 గ్యాలన్ల నీటిని ఉత్పత్తి చేయగలదు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఇది నెలకు 200 నుంచి వెయ్యి గ్యాలన్ల వరకు ఉంటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, లేదా ఆఫీస్‌లు ఏడాదికి కోటి గ్యాలన్ల కంటే ఎక్కువ నీటిని ఉత్పత్తి చేయగలవు.  ఆధునిక ప్రపంచానికి వెన్నుముకగా నిలిచే డేటా సెంటర్లు భారీగా నీటిని వినియోగిస్తాయి. ఒక మధ్యతరహా డేటా సెంటర్‌ ఏడాదికి 110 మిలియన్ గ్యాలన్ల నీటిని కేవలం కూలింగ్ కోసం వాడుతుంది. కొన్ని పెద్ద డేటా సెంటర్లు రోజుకు 5 మిలియన్ గ్యాలన్ల వరకు వినియోగిస్తారు. 

ఏసీ నుంచి వచ్చే నీటి నాణ్యత ఎంత?

ఏసీ నుంచి వచ్చే నీరు దాదాపు డిస్టిల్డ్‌ వాటర్ లాగా ఉంటుంది. ఇందులో క్లోరిన్ ఉండదు. మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది ఆమ్మ గుణాన్ని కలిగి ఉంటుంది. పీహెచ్ సుమారు 5.82గా ఉంటుంది. ఇది చూటడానికి స్వచ్ఛంగా ఉన్నప్పటికీ తాగడానికి పనికిరాదు. ఇందులో గాలిలోని ధూళి, బ్యాక్టీరియా, కాయిల్స్ నుంచి వచ్చే కణాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇన్వర్టర్ బ్యాటరీలలో కూడా వాడకపోతే మంచిది.             

ఏసీ నీటిని ఎలా ఉపయోగించాలి?

అమ్ల గుణాన్ని ఇష్టపడే మొక్కలకు ఏసీ నుంచి వచ్చిన నీరు వాడుకోవచ్చు. అయితే ఇందులో పోషకాలు ఉండవు కాబట్టి ఎరువులు వాడాల్సి ఉంటుంది. వేసవిలో పక్షులు, చిన్న జంతువుల కోసం ఏసీ డ్రెయిన్ కింద ఒక చిన్న పాత్ర ఉంచడం ద్వారా వాటి దాహార్తి తీర్చివచ్చు. ఇల్లు తుడవడానికి, కిటీకీలు క్లీన్ చేయడానికి, కారు కడగడానికి వాడుకోవచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు కూలింగ్ టవర్ల కోసం ఈ ఏసీ నీటిని వాడి లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఏసీ నీటిని సేకరించే వాణిజ్య భవనాలకు రాయితీలు ఇస్తున్నారు.                        

Frequently Asked Questions

ఏసీ నీటిని ఎలా ఉపయోగించవచ్చు?

ఏసీ నీటిని మొక్కలకు, పక్షులకు, ఇల్లు తుడవడానికి, కిటికీలు శుభ్రం చేయడానికి, కారు కడగడానికి ఉపయోగించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 17 సినిమాలు స్ట్రీమింగ్... 9 తెలుగు మూవీస్ డోంట్ మిస్
Embed widget