అన్వేషించండి

Veg Omelette Recipe : టేస్టీ, హెల్తీ వెజ్ ఆమ్లెట్.. బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ ఆప్షన్, గుడ్లు లేకుండా ఎలా చేసుకోవచ్చంటే

Omelette Recipe : ఆమ్లెట్ ఇష్టపడే శాఖాహారులకు గుడ్లు లేకుండా వెజ్ ఆమ్లెట్ అందుబాటులో ఉంది. ఇది రుచిలో, అనుభూతిలో అచ్చం గుడ్డు ఆమ్లెట్ మాదిరిగానే ఉంటుంది. దీనిని ఎలా చేసుకోవచ్చంటే..

Eggless Omelette Recipe : ఆమ్లెట్ పేరు వినగానే.. మొదటగా గుడ్డు గుర్తుకు వస్తుంది. కానీ కొందరు గుడ్డు తినరు. మరి ఎగ్ లేకుండా ఆమ్లెట్ చేసుకోవచ్చా? అంటే కచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వెజ్ ఆమ్లెట్ రుచిలో ఏమాత్రం తీసిపోదు. గుడ్లు తినని వారి నుంచి.. గుడ్లు తినేవారు కూడా ఈ టేస్టీ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. పైగా ఇది హెల్తీ కూడా. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా తీసుకునేందుకు మంచి ఆప్షన్ కూడా అవుతుంది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వెజ్ ఆమ్లెట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

వెజ్ ఆమ్లెట్ చూసేందుకు, రుచిలో కూడా గుడ్డు ఆమ్లెట్​లాగే ఉంటుంది. కానీ అందులో గుడ్డు ఉండదు. పైగా దీనిలో వెజిటెబుల్స్ కూడా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో ఉపయోగించే పదార్థాలు అన్నీ.. వంటగదిలో సులభంగా దొరికేవే. ఇది ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఎంపిక కూడా అవుతుంది. మరి ఈ వెజ్ ఆమ్లెట్​ని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 

వెజ్ ఆమ్లెట్ రెసిపీ

  • ఒక కప్పు శనగపిండి
  • చిన్న ముక్కలుగా తరిగిన టమోటా
  • చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ
  • పచ్చిమిరపకాయ
  • రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర
  • 1/4 టీస్పూన్ పసుపు
  • రుచికి సరిపడా ఉప్పు
  • నీరు అవసరమైనంత
  • వేయించడానికి నూనె

వెజ్ ఆమ్లెట్ రెసిపీ

వెజ్ ఆమ్లెట్ తయారు చేయడానికి.. ముందుగా ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీరను చిన్న ముక్కలుగా కోసి.. మీకు నచ్చిన కూరగాయలను కూడా ఇందులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసి.. అందులో పసుపు, ఉప్పు, చిన్న ముక్కలుగా తరిగిన కూరగాయలను వేసి బాగా కలపాలి. కూరగాయలను కలిపిన తర్వాత.. శనగపిండిలో నీరు పోసి మెత్తటి మిశ్రమంలా తయారు చేసుకోండి.

మిశ్రమం మరీ చిక్కగా లేదా పలుచగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం వేడి చేసి.. కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా మిశ్రమాన్ని పెనం మీద వేసి ఆమ్లెట్​లాగా వేసుకోవాలి. ఇప్పుడు తక్కువ మంట మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత చట్నీ లేదా సాస్‌తో వేడిగా తినవచ్చు.

వెజ్ ఆమ్లెట్ బెనిఫిట్స్

గుడ్లు తినని వారికి కూరగాయల ఆమ్లెట్.. ప్రోటీన్​కి మంచి ఎంపిక అవుతుంది. ఇది లైట్​ ఫీలింగ్ ఇవ్వడమే కాకుండా.. తినడానికి రుచికరంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget