Paracetamol: పారాసెటమాల్ పని చేయడానికి ఎంత సమయం పడుతుంది? మాత్ర వేసుకున్నాక మద్యం తాగొచ్చా?
పారాసెటమాల్ తీసుకున్న తర్వాత అది పనిచేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా?
జ్వరం వస్తే మనం పారాసెటమాల్ మాత్రను తీసుకుంటాం. అయితే, మాత్రను తీసుకున్న వెంటనే జ్వరం తగ్గిపోదు. ఇందుకు కాస్త సమయం పడుతుంది. అది ఒకసారి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత జ్వరం కూడా క్రమేనా తగ్గుముఖం పడుతుంది. దాని ప్రభావం కూడా ఎక్కువసేపే ఉంటుంది. మీరు ఒక ప్రామాణిక మోతాదులో పారాసెటమాల్ తీసుకున్నప్పుడు అది పనిచేయడానికి ఒక గంట సమయం పట్టవచ్చని, చాలా కొద్దిమందికి అరగంటలోనే పనిచేస్తుంది.
ఆ మాత్ర జీర్ణమైన తర్వాత సుమారు రెండు గంటల వరకు వ్యాధి కారకాలతో పోరాడుతుంది. కొందరిలో 2 గంటలు కంటే ఎక్కువసేపే ఈ మాత్ర ప్రభావం ఉంటుంది. 500 మిల్లీగ్రాముల పారాసెటమాల్ వల్ల ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండబోదట. అలాగే, పెయిన్ కిల్లర్ తీసుకున్న కొన్ని గంటల తర్వాత మద్యం తాగొచ్చని కూడా వైద్యులు చెప్పారు. అయితే, ఆల్కహాల్ మితంగా మాత్రమే తీసుకోవాలని పేర్కొన్నారు.
మాత్రలు ఎలా పనిచేస్తాయి?: మనం మాత్రను మింగిన తర్వాత అది కాలేయం గుండా వెళ్లి రక్తప్రవాహంలోకి ప్రవేశించే ముందు కడుపు ఆమ్లాల ద్వారా విచ్ఛిన్నమవుతుంది. ఆహారం లేకుండా తీసుకుంటే జీర్ణమయ్యేందుకు 15 నిమిషాలు పడుతుంది. నారింజ రసం, కోకా-కోలా వంటి పానీయాలతో మాత్రను తీసుకున్నట్లయితే మాత్రలు నెమ్మదిగా జీర్ణమవుతాయని ఓ ప్రయోగంలో తేలిందని సౌదీ ఫార్మాస్యూటికల్ జర్నల్ వెల్లడించింది.
పారాసెటమాల్ లేదా ఇబుప్రోఫెన్ వంటి మందులు చక్కగా పనిచేయాలంటే మీరు ఒక గ్లాసు నీటితో మాత్రమే వాటిని మింగాలని నిపుణులు తెలిపారు. ఒక రోజంతా పారాసెటమాల్ తీసుకోవాలంటే.. మాత్రకు మాత్రకు మధ్య కనీసం నాలుగు గంటల గ్యాప్ ఉండాలి. 24 గంటల్లో మీరు 500 మిల్లీ గ్రాముల మోతాదు మాత్రలను మాత్రమే తీసుకోవాలి. అంటే, 500 మిల్లీగ్రాములను నాలుగు మోతాదులుగా మింగాలి.
పారాసెటమాల్‌ను అధిక మోతాదులో తీసుకుంటే తీవ్రమైన దుష్ప్రభావాలకు గురవ్వుతారు. నొప్పి లేదా జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు.. ఎక్కువ మోతాదు తీసుకోవాలనే ఆలోచన అస్సలు వద్దు. పారాసెటమాల్‌తో జ్వరం తగ్గకపోతే.. మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. పారాసెటమాల్ అనేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఎన్నిరోజులైనా జ్వరం తగ్గకపోతున్నట్లయితే హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి.. సొంత వైద్యం అస్సలు వద్దు.
Also Read: ప్రియురాలి చనుబాలు, పచ్చిమాంసం - ఇవే ఇతడి హెల్త్ సీక్రెట్
Also Read: పిల్లులను పెంచితే ‘బెడ్ రూమ్’లో రెచ్చిపోతారట, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.