Happy Holi 2024 : డ్రెస్‌లు పాడవ్వకుండా.. హోలీ కలర్స్‌ను వదిలించుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Removing Holi colors from the Clothes :హోలీ సమయంలో అంతా బాగానే ఉంటుంది కానీ.. దుస్తులకు అంటుకున్న రంగులు వదిలించుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్‌తో వాటిని దూరం చేసుకోవచ్చు.
Holi Colour Stains : హోలీ సమయంలో రంగులతో ఆడుకుంటాం. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి మస్త్ ఎంజాయ్ చేస్తాము. కానీ ఇంటికి వెళ్లాక మూడు సమస్యలు ఎదురవుతాయి. వాటిలో ఒకటి దుస్తులకు అంటుకున్న రంగులు వదిలించుకోవడం. పౌడర్ రూపంలో రంగులు అంటుకుంటే.. వాటిని వదిలించుకోవడం సులభమే. కానీ నీటితో కలిసిన కలర్స్‌ని వదిలించుకోవడం చాలా కష్టం. ఎంత ఉతికినా.. పాతరంగుల మరకలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో ఈ మరకలన్ని వదిలించుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో.. డ్రెస్‌లు పాడవ్వకుండా రంగుల్ని ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మరసం..
మీ దుస్తులకు అంటుకున్న రంగులను వదిలించుకోవడంలో నిమ్మరసం బాగా హెల్ప్ చేస్తుంది. వీటిలో ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇది దుస్తులపై ఏర్పడిన రంగుల మరకలను సమర్థవంతంగా తొలగిస్తుంది. రంగులు అంటుకున్న దుస్తులను నిమ్మరసం కలిపిన నీటిలో పదిహేను నిమిషాలు నానబెట్టి.. అనంతరం చేతులతో వాటిని రుద్దండి. తర్వాత రెగ్యూలర్ వాష్ చేయండి. మరకలు తొలగిపోతాయి. మరకల మొండితనం బట్టి మీరు నిమ్మరసం వేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అరగంట నుంచి గంటవరకు నానబెట్టాల్సి ఉంటుంది.
వెనిగర్
బకెట్లో చల్లని నీరు నింపండి. దానిలో అరకప్పు వైట్ వెనిగర్, మీకు నచ్చిన వాషింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. హోలీ రంగులతో నిండిన దుస్తులను తీసుకోచ్చి దీనిలో ముంచండి. దుస్తుల నుంచి హోలీ కలర్స్‌ను తీయడంలో వెనిగర్ బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా తెల్ల రంగు దుస్తులకు ఈ చిట్కా మంచి ఫలితాలు ఇస్తుంది.
గ్లాస్ క్లీనర్ స్ప్రే
మీ ఇంట్లో గ్లాస్ క్లీనర్ స్ప్రే ఉందా? అయితే మీరు అమ్మోనియా ఆధారితమైన గ్లాస్ క్లీనర్‌తో మరకలను వదిలించుకోవచ్చు. ఇవి దుస్తులపై ఉన్న రంగుల మరకలను ఈజీగా శుభ్రం చేస్తాయి. ఈ స్ప్రే బాటిల్ తీసుకుని.. రంగులన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. దానిని కొన్ని నిమిషాలు అలాగే ఉంచి.. టవల్ లేదా టిష్యూతో మరకను తుడిచివేయాలి. అనంతరం దుస్తులను రెగ్యూలర్ వాష్ చేయాలి. ఈ టిప్ మీకు మంచిగా పనికొస్తుంది.
ఈ మిస్టేక్స్ చేయవద్దు..
మీరు హోలీ ఆడిన సమయంలో దుస్తులు తడిస్తే.. వాటిని ఎక్కువసేపు ఉంచకండి. వెంటనే వాటిని వాష్ చేయండి. మరకలు ఎక్కువసేపు అలాగే ఉంచేస్తే.. రంగులను డ్రెస్ అబ్జార్వ్ చేసేసుకుంటుంది. దీనివల్ల రంగులను వదిలించుకోవడం కష్టమవుతుంది. అంతేకాకుండా తడిసిన బట్టలు ఉతకడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు మీ చర్మానికి హానికరం. అంటే కొన్ని రకాల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. కాబట్టి వాటిని ఉపయోగిస్తున్నప్పుడు మీరు గ్లౌవ్ తొడుగుకుంటే మంచిది. రసాయానాలతో మరకను శుభ్రపరిచిన తర్వాత మీరు రెగ్యూలర్ వాష్ చేసుకోవాలి. అప్పుడు దుస్తులనుంచి కెమికల్స్ పూర్తిగా తొలగిపోతాయి.
రెగ్యూలర్ డ్రెస్‌లతో కలపకండి..
కొందరు రంగులతో నిండిన డ్రెస్‌లను రెగ్యూలర్ దుస్తులతో కలిపి ఉతికేస్తారు. ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దీనివల్ల రంగులు మిగిలిన డ్రెస్‌లకు కూడా అంటుకుంటాయి. దీనివల్ల మీ పని మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి హోలీ దుస్తులను ఎప్పుడూ మీరు వేరుగా ఉతికితేనే మంచిది. తడిసిన దుస్తులను ఎప్పుడూ ఆరిపోవనివ్వవద్దు. అలాగే పొడిగా ఉన్న దుస్తులకు రంగులు అంటుకుంటే వాటిని తడవనివ్వకండి. ముందుగా రంగులను దులిపి.. అప్పుడు మీరు వాష్ చేసుకోవడం సులభంగా ఉంటుంది.
బ్లీచ్ అస్సలు వద్దు.. ఎందుకంటే..
దుస్తలపై మరకలను వదిలించుకునేందుకు కొందరు బ్లీచ్ ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల రంగులు వదలడం కాదు.. దుస్తుల సహజమైన రంగు పోతుంది. ఈ టిప్స్ మీరు వాషింగ్ మెషిన్లో లేదా చేతులతో ఉతకడంలో హెల్ప్ చేస్తాయి. డ్రై క్లీనర్లకు ఇచ్చే దుస్తులు ఏవైనా ఉంటే వెంటనే వాటిని వారి దగ్గరికి తీసుకెళ్లండి. ఈ టిప్స్‌తో మీ అందమైన దుస్తులను రంగుల మరకల నుంచి కాపాడుకోండి. హ్యాపీ హోలీ.
Also Read : హోలీలో ప్రతి రంగుకి ఓ ప్రత్యేకత ఉంది.. ఆ రంగులైతే అస్సలు వాడొద్దు