అన్వేషించండి

Benefits of Honey for Men : తేనెను ఇలా తీసుకుంటే హెల్త్​కి ఎన్నో బెనిఫిట్స్.. స్పెర్మ్ కౌంట్, అంగస్తంభన సమస్యలుంటే మగవారు అలా తీసుకోవాలి

Advantages of Honey : తేనెను చాలా మంది వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం తీసుకుంటూ ఉంటారు. అయితే దీనిని వివిధ పదార్థాలతో కలిపి తీసుకుంటే మరెన్నో బెనిఫిట్స్ పొందవచ్చు అంటున్నారు. అవేంటంటే..

Health Benefits of Honey for Men : చక్కెరకు ప్రత్యామ్నాయంగా హెల్త్ బెనిఫిట్స్ కోసం చాలామంది తేనెను ఉపయోగిస్తారు. ఇది మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. తేనెలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ స్వీటెనర్​గా పనిచేయడంతో పాటు.. వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు, వివిధ బ్యాక్టీరియాను దూరం చేసి శరీరాన్ని రక్షిస్తుంది. అందుకే దీనిని రెగ్యూలర్​గా తీసుకుంటారు. దీని ఆరోగ్యప్రయోజనాలు రెట్టింపు చేసేందుకు వివిధ పదార్థాలతో దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పురుషుల్లో వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇది హెల్ప్ చేస్తుందంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటంటే..

తేనెను వేడి నీటితో కలిపి తీసుకుంటే..

చాలామంది ఉదయాన్నే వేడినీళ్లలో కాస్త తేనె వేసుకుని కలిపి తాగుతారు. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి పరగడుపునే తాగితే.. మెటబాలీజం పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గుతారు. మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. డిటాక్స్ చేస్తుంది. మెరిసే స్కిన్​ని అందించడంతో పాటు.. అలెర్జీలను కంట్రోల్ చేస్తుంది. 

వెల్లుల్లితో తేనె కలిపి తింటే.. 

వెల్లుల్లిపై పొరను తీసి.. వాటిని తేనెలో నానబెట్టి రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. వెల్లుల్లిలోని రసాయనాలు శరీరంలోని మంటను, వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వ్యాధులు రాకుండా నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, విరేచనాలు వంటివాటిని తగ్గిస్తుంది. ఉబ్బసం, గుండె జబ్బులు, అధికరక్తపోటు, కీళ్లనొప్పులు, పంటి నొప్పి, మలబద్ధకం వంటివాటిని తగ్గిస్తుంది. 

దాల్చినచెక్కతో తేనె కలిపితే..

తేనె, దాల్చిన చెక్క కలిపి తింటే మంచి రుచి మీ సొంతమవుతుంది. అందుకే వీటిని ఓట్​మీల్, టీ, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో కలిపి ఉపయోగిస్తారు. ఈ రెండూ గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. గుండె సమస్యలు.. ముఖ్యంగా స్ట్రోక్​ వచ్చే ప్రమాదాన్ని దూరం చేస్తుంది. అంతేకాకుండా ఈ కాంబినేషన్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. 

అంగస్తంభన, స్పెర్మ్ హెల్త్ కోసం..

నపుంసకత్వ సమస్యలను తగ్గించుకోవడంలో తేనె మెరుగైన ప్రభావాలు చూపిస్తుంది. అంగస్తంభనను తగ్గించే లక్షణాలను తేనె కలిగి ఉంటుంది. పాలల్లో తేనె కలిపి తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అంతేకాకుండా టెస్టోస్టెరాన్​ను కూడా గణనీయంగా పెంచి.. సంతానోత్పత్తి సమస్యలను దూరం చేస్తుంది. కేవలం పురుషులకే కాకుండా.. మహిళలకు యోని, గర్భాశయ సమస్యలను దూరం చేస్తుంది. ఎగ్ క్వాలిటీని పెంచుతుంది. 

మితంగానే తీసుకోవాలి..

తేనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా.. దానిని మితంగా తీసుకుంటేనే మంచిదంటున్నారు. రోజుకు ఓ స్పూన్ తేనె తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. రక్తపోటు, కొలెస్ట్రాల్, దగ్గు, జలుబు, గాయాలు తగ్గించుకోవడం కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. జీర్ణక్రియ సమస్యలను ఇది దూరం చేస్తుంది కాబట్టి.. హాయిగా దీనిని వినియోగించవచ్చు. అయితే మీరు దీనిని తీసుకోవాలనుకుంటే వైద్యుల సలహా తీసుకుని తర్వాత ప్రారంభిస్తే మంచిది. 

Also Read : నిద్రలో హార్ట్ ఎటాక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. నలభై ఏళ్లు దాటితే మగవారు ఇవి కచ్చితంగా ఫాలో అవ్వాలట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Game Changer Second Single Promo : కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
కిరాక్ మాస్ బీట్ తో వచ్చేసిన 'రా మచ్చా మచ్చా' సాంగ్ ప్రోమో...  నెవర్ బిఫోర్ ఇంట్రో   
UK : అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
అమెరికాలో ఉద్యోగాల్లేవ్ - యూకే కూడా గేట్లు మూసేస్తోంది - యూత్ ఫారిన్ ఆశలు తీరవా ?
Telangana News: అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
అంబేద్కర్ వర్సిటీ భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ, డిమాండ్ ఏంటంటే
Pushpa 2: షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
షెకావత్‌ సార్ సెట్‌లోకి వచ్చేశాడు... నాన్‌ స్టాప్‌గా ‘పుష్ప 2’ షూటింగ్
Embed widget