Ayurveda Tips : ఉదయాన్నే ఈ ఆకు తింటే కొలెస్ట్రాల్, మధుమేహాం దూరమవుతాయట.. బరువుకూడా తగ్గొచ్చట
Health Routine : కొలెస్ట్రాల్, మధుమేహం తగ్గించే ఇంటి చిట్కా గురించి ఆయుర్వేదం నొక్కి చెప్తుంది. పరగడుపునే ఓ ఆకు తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయట. ఇంతకీ ఆ ఆకు ఏంటి, దానివల్ల కలిగే లాభాలు చూసేద్దాం.

Ayurveda Morning Rituals : ఉదయాన్నే బ్రష్ చేయకముందు లేదా పరగడుపుతో (Healthy Foods on Empty Stomach) మీరు శరీరానికి కొన్ని సహజమైనవి అందిస్తే అవి మన ఆరోగ్యాన్ని జీవితాంతం సురక్షితంగా ఉంచేలా చేస్తాయంటోంది ఆయుర్వేదం. అందుకే డైలీ రొటీన్లో కొన్ని ప్రత్యేకమైన మూలికలు తీసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. వాటిని తీసుకోవడం వల్ల వ్యాధులు నయం కావడమే కాకుండా.. శరీరం లోపలి నుంచి బలంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ ఉపాసనా బోరా చెప్తున్నారు. అలాంటివాటిలో మన ఇంటికి దగ్గర్లో.. ఎక్కువగా వినియోగించే ఓ ఆకును కచ్చితంగా తీసుకోవాలంటున్నారు. ఆ ఆకు ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? తెలుసుకుందాం.
డాక్టర్ ఉపాసనా బోరా ప్రకారం.. ప్రతిరోజూ పరగడుపున ఒకటి లేదా రెండు కరివేపాకులు (Curry Leaves Empty Stomach)తింటే ఆరోగ్యానికి మంచిదట. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు, షుగర్, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తున్నారు. మరి ఉదయం పరగడుపున కరివేపాకు తినడం వల్ల కలిగే లాభాలు(Health Benefits of Curry Leaves).. కొలెస్ట్రాల్, మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు చూసేద్దాం.
కొలెస్ట్రాల్ నియంత్రణలో (Curry Leaves for Cholesterol)
అధిక కొలెస్ట్రాల్ (Cholesterol) అనేది ఈ మధ్య చాలామందిని ఇబ్బందులకు గురి చేస్తోన్న సమస్య. ఇది చాలా వేగంగా పెరుగుతోంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే.. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఉదయం రోజూ పరగడుపున కరివేపాకులను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయి పెరుగుతుంది. ఇది గుండె ధమనులను శుభ్రంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
మధుమేహాం నియంత్రణకై (Curry Leaves for Diabetes)
మధుమేహం (Diabetes) రోగులకు కరివేపాకు ఒక ఔషధం కంటే తక్కువ కాదు. ఇందులో ఉండే యాంటీ-డయాబెటిక్ లక్షణాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రోజూ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది. షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. అందుకే మధుమేహం రోగులు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవాలంటారు.
మెరుగైన జీర్ణవ్యవస్థకై (Curry Leaves for Digestion)
పరగడుపున కరివేపాకులను నమలడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ పేగులను శుభ్రపరుస్తుంది. శరీరాన్ని తేలికగా జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది.
బరువు తగ్గడానికై (Curry Leaves for Weight Loss)
బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు ఒక దివ్య ఔషదంగా చెప్తోంది ఆయుర్వేదం. అయితే ఉదయం నిద్ర లేచాక పరగడుపున 5 కరివేపాకులు తినాలట. దీని తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. కావాలంటే కరివేపాకును నిమ్మ రసంతో లేదా స్మూతీలో కూడా కలిపి తీసుకోవచ్చు.
ప్రకృతి మనకు చాలా మూలికలను ఇచ్చింది.. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే వాటి వల్ల అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షిస్తాయని ఉపాసన తెలిపారు. అలాంటి వాటిలో కరివేపాకు ఒకటని అందుకే దానిని రెగ్యులర్గా తీసుకోవాలని అంటున్నారు.






















