అన్వేషించండి

Health Benefits of Ginger : చలికాలంలో అల్లాన్ని పచ్చిగా తింటే కలిగే ప్రయోజనాలివే .. ఈ మోతాదులో తీసుకుంటే బరువు కూడా తగ్గుతారట

Winter Food : అల్లంతో ఛాయ్ చేసుకుని తాగుతారు. వంటల్లో వినియోగిస్తారు. అయితే దీనిని నేరుగా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయట. ముఖ్యంగా చలికాలంలో తింటే ఇంకా మంచిదట. ఎందుకంటే..

Raw Ginger Benefits : అల్లంలేని వంటిల్లు ఉండదు. దీనిని వంటల్లో రుచికోసం వినియోగిస్తారు. ఇది మంచి రుచిని ఇవ్వడమే కాకుండా.. ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. అయితే దీనిని పచ్చిగా తింటే కూడా హెల్త్​కి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయట. ముఖ్యంగా చలికాలంలో తింటే దీని ప్రభావం మరింత ఎఫెక్టివ్​గా ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు వింటర్​లో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయంటున్నారు. ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటి? ఎంత మోతాదులో అల్లాన్ని పచ్చిగా తింటే ప్రయోజనాలున్నాయో ఇప్పుడు చూసేద్దాం. 

జీర్ణ సమస్యలు

చలికాలంలో చాలామంది జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. పైగా వింటర్​ ఎఫెక్ట్​ వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం.. బ్లోటింగ్ వంటి సమస్యలను ఇస్తుంది. ఈ ఇబ్బందులను దూరం చేసే శక్తి అల్లానికి ఉంది. దీనిలోని ఎంజైమ్స్ గట్​ను హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. 

రోగ నిరోధక శక్తి

చలికాలంలో పెద్దల నుంచి పిల్లలవరకు ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు అల్లాన్నీ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు తగ్గుతాయి. 

నొప్పులు దూరం

అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు చలికాలంలో వచ్చే కీళ్లనొప్పులను దూరం చేస్తాయి. ఆర్థ్రరైటిస్ వంటి సమస్యలున్నవారికి ఇది మంచి ప్రయోజనాలు అందిస్తుంది. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం అందిస్తుంది అల్లం. 

గుండె ఆరోగ్యానికి

అల్లం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా బీపీని అదుపులో ఉంచి.. హార్ట్ ఎటాక్స్ వంటివి రాకుండా కాపాడుతుంది. 

రక్తప్రసరణ

చలికాలంలో బద్ధకంగా ఉండడం వల్ల శరీరంలో రక్తప్రసరణ ఉండదు. ఇది లేకుంటే మీరు యాక్టివ్​గా ఉండలేరు. పైగా నీరసం వస్తుంది. స్కిన్​ టోన్ మారిపోతుంది. జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. అయితే అల్లం శరీరంలో రక్తప్రసరణను మెరుగు చేసి.. మీరు యాక్టివ్​గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. 

ఒత్తిడి దూరం 

వింటర్​లో డే టైమ్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల వర్క్​ చేయడంలో ఇబ్బందులు పెరిగి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు కాస్త అల్లాన్ని చప్పరిస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం ఉంటుంది. 

యాంటీబాక్టిరియల్

అల్లంలోని యాంటీబాక్టిరియల్, యాంటీ వైరల్ లక్షణాలు చలికాలంలో వచ్చే ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి. అంతేకాకుండా వీటిలోని యాంటీ క్యాన్సర్​ లక్షణాలు వివిధ రకాల క్యాన్సర్లను దూరం చేస్తాయి. 

బరువు తగ్గడంలో

బరువు తగ్గాలనుకునేవారు అల్లాన్ని తమ డైట్​లో తీసుకోవచ్చు. ఇది మెటబాలీజంను పెంచి.. శరీరంలో కేలరీలు కరిగేలా చేస్తూ ఉండి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. చలికాలంలో బరువు తగ్గడం కష్టమనుకునేవారు తమ రెగ్యూలర్ వ్యాయమాలు డైట్​లతో పాటు దీనిని కూడా కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. 

రోజుకు ఎంత తినొచ్చంటే.. 

ఆరోగ్య సమస్యలు లేనివారు హెల్తీగా ఉండేందుకు 1 నుంచి రెండు అంగుళాల అల్లాన్ని తినొచ్చు. ఒకవేళ మీరు జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం కోసం తినాలకుంటే.. 2 నుంచి 3 అంగుళాలు తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గించుకునేందుకు అర అంగుళం తింటే సరిపోతుంది. అయితే అల్లం ఫ్రెష్​గా ఉండాలి. పైన తొక్క తీసేసి.. చిన్నగా కట్ చేసుకుని.. తేనెతో కలిపి రోజూ తినొచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మీరు అల్లాన్ని తినాలనుకుంటే ఒకేసారిగా కాకుండా.. తక్కువ మోతాదులో తినడం ప్రారంభిస్తే మంచిది. అలవాటు పడే కొద్ది మోతాదు పెంచుకోవచ్చు. ఒకేసారి కాకుండా.. చిన్న చిన్న ముక్కలుగా తింటే మంచిది. అలాగే మీరు అల్లం తిన్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే దానిని తినడం ఆపేయాలి. అలాగే అల్లం ఎప్పుడు ఫ్రెష్​గా ఉండేదే పచ్చిగా తినేందుకు చూడాలి. అతి ముఖ్యంగా వైద్యుల సలహా తీసుకుని దీనిని తింటే మంచి ఫలితాలు పొందొచ్చు. 

Also Read : ఆరోగ్యానికి మంచిదని పచ్చివెల్లుల్లి తింటున్నారా? సైడ్ ఎఫెక్ట్స్, రోజుకు ఎన్ని తినాలో తెలుసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP DesamAttack on Saif Ali khan | సైఫ్ అలీఖాన్ పై కత్తిదాడి..తీవ్రగాయాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల  వద్ద భారీగా పోలీసులు
కేటీఆర్ ఈడీ విచారణ - కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు
Anantapuram News: సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
సామాన్యుడు వర్సెస్ పోలీస్ అధికారి - ఫోన్ కాల్‌లోనే బూతుల పంచాయతీ, విచారణకు ఆదేశించిన ఎస్పీ
Saif Ali Khan: పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
పటౌడీ వారసుడు, వేల కోట్ల ఆస్తులకు అధిపతి... నవాబ్ సైఫ్ జీవితంలో ఆసక్తికర విషయాలు తెలుసా?
Hindenburg Research : హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
హిండెన్ బర్గ్ మూసివేత - ఫౌండర్ సంచలన ప్రకటన, సవాళ్లలోనూ ఉత్సాహంగా పని చేశామని లేఖ
SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
Nimmala Ramanaidu : సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి - సామాన్య రైతులా పొలం పనులు, వ్యవసాయం చేయడంలోనే నిజమైన సంతృప్తి అని వెల్లడి
Smartphone Tips: స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయాల్సిందే - ఈ ఐదు పనులు అంత ముఖ్యం!
స్మార్ట్ ఫోన్లు ఎక్కువ రోజులు వాడాలంటే ఇలా చేయాల్సిందే - ఈ ఐదు పనులు అంత ముఖ్యం!
KTR: 'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
'కాంగ్రెస్ పెడుతున్న కేసులు మా ఘనతను తుడిచేయలేవు' - ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్
Embed widget