Viral Food: కుండ దోశెను చూశారా, ఎలా తినాలని మాత్రం అడగవద్దు
దోశెల్లో అనేక రకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త రకం దోశె వచ్చింది. అదే కుండ దోశె.
మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉప్మా దోశె, పనీర్ దోశె... ఇలా రకరకాల దోశలు అందుబాటులో ఉన్నాయి. సాంబార్ చట్నీతో కరకరలాడే దోశలు తింటే ఆ రుచి, ఆనందమే వేరు. అయితే ఇప్పుడు మరో దోశె కూడా ఆ జాబితాలో చేరింది. అదే మట్కా దోశె. తెలుగులో చెప్పుకోవాలంటే కుండ దోశె. వైరల్ ఫుడ్‌లో ఇప్పుడు ఇది కూడా ఒకటి. ఈ విచిత్రమైన మట్కా దోశెను చూసి చాలామంది దీన్ని ఎలా తినాలి? అని ప్రశ్నిస్తున్నారు.
వింత వింత ఆహారాలను తయారు చేయడంలో వాటిని వైరల్ చేయడంలో ఇప్పుడు ఎంతోమంది బిజీగా ఉన్నారు. ఫ్రూట్ టీ (పండ్లతో చేసే టీ) నుండి మోమో ఐస్ క్రీములు వరకు, ఆమ్లెట్ నుండి ఇప్పుడు మట్కా దోశె వరకు ఫుడ్ ఫ్యూషన్లు అవుతున్నాయి. క్లాసిక్ ఫుడ్స్‌ను ఫ్యాన్సీగా మార్చడంలో కొంతమంది ఆహార ప్రియులు బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ వైరల్ మట్కా దోశె వీడియో వైరల్ అవుతూ వస్తోంది. దీని తయారీలో కూడా కాస్త కొత్తదనాన్ని చూపించారు.
దోశె ఎలా తయారు చేస్తారు?
దోశె వేయడానికి సాధారణ దోశలాగా చేస్తారు, కానీ ఇందులో బెల్ పెప్పర్స్, క్యాప్సికం, పనీర్, టమోటా సాస్, సోయా సాస్, మసాలాలు అన్ని వేసి ఒకసారి వేయించి ప్లేట్లో వేస్తారు. తర్వాత దోశను వేసి దోశెపై కూడా కూరగాయలు సాస్‌లు, మయోన్నెస్‌లు వంటివన్నీ వేస్తారు. తర్వాత ఉడికించిన సగ్గుబియ్యాన్ని ఒక చిన్న కుండలో వేస్తారు. చీజ్ తురిమి ప్లేట్ నిండా చల్లుతారు. ఆ కుండపై దోశను కోన్ లాగా పెట్టి, ఆ కుండను ప్లేటుపై పెట్టి ఈ దోశెను సర్వ్ చేస్తారు. సోయాసాస్, టమోటా కెచప్, మయోన్నెస్ వంటివన్నీ కలిపి ఇవ్వడం ఒక విచిత్రమైన మిశ్రమంగా చెప్పుకోవచ్చు. చాలామంది రుచికరమైన దక్షిణ భారత వంటకాన్ని ఇలా నాశనం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో ఫుడ్ వెరైటీలు...
వెగటు పుట్టించే ఫుడ్ కాంబినేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మ్యాగీ మిల్క్ షేక్, గుడ్డుతో పాప్ కార్న్, ఒరియో బిస్కెట్ తో పకోడీ, బంగాళాదుంప కూరలో జిలేబి ముంచుకుని తినడం వంటి ఫుడ్ వెగటు పుట్టించేలా ఉన్నా కూడా వైరల్ అయ్యాయి. గతంలో కూడా ఐస్ క్రీమ్ దోశె వైరల్ అయింది. దాన్ని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడలేదు. అలాగే స్పైసీ ఛాట్‌ను రసగుల్లాతో కలిసి అందిస్తున్న స్ట్రీట్ ఫుడ్ కూడా వైరల్ అయింది.
#MatkaDosa. pic.twitter.com/Jg5K03uFzT
— Deepak Prabhu/दीपक प्रभु (@ragiing_bull) March 14, 2023
Also read: మధుమేహం ఉన్నవాళ్లు తియ్యగా ఉండే పైనాపిల్ తినవచ్చా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.