Happy Dussehra 2024 : దసరా శుభాకాంక్షలు సోషల్ మీడియాలో ఇలా చెప్పేయండి.. ఫేస్బుక్, వాట్సాప్‌లలో ఇవి షేర్ చేసేయండి
Happy Vijaya Dashami 2024 : అమ్మవారి దయ అందరీ మీద ఉండాలని కోరుకుంటూ ప్రతిసంవత్సరం నవరాత్రి వేడుకలు జరుపుకుంటారు. ఆ సమయంలో ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి ఏ విధంగా విష్ చేయాలో తెలుసా?
Dussehra 2024 wishes : దేవి నవరాత్రులు ప్రారంభమైపోయాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 3న మొదలైన ఈ నవరాత్రులు అక్టోబర్ 12వ తేదీవరకు కొనసాగనున్నాయి. ఈ తొమ్మిదిరోజులు అమ్మవారిని తొమ్మిది రకాలుగా ముస్తాబు చేసి.. రోజుకొక నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సమయంలో మీ బంధువులకు, ఫ్రెండ్స్‌కు దూరంగా ఉంటే వారికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా విషెష్ చెప్పేయొచ్చు. వారికి, వారి కుటుంబ సభ్యులకు దసరా 2024 శుభాకాంక్షలు ఎలా చెప్పాలో ఇప్పుడు చూసేద్దాం.
- మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దీవెనలు మీ ఫ్యామిలీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.
- మీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలిగే శక్తి, ధైర్యాన్ని ఆ అమ్మవారు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ.. హ్యాపీ నవరాత్రి.
- ఈ నవరాత్రులు మీ జీవితంలో పూర్తి ఆనందాన్ని, శ్రేయస్సును, సక్సెస్‌ను అందించాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.
- ఆ అమ్మవారు మీకు మంచి జీవితాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని అందించి.. మీరు సంతోషంగా ఉంచేలా చేస్తుందని నమ్ముతూ.. నవరాత్రి శుభాకాంక్షలు.
- హ్యాపీ దసరా. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని విష్ చేస్తున్నాను.
- ఆ దుర్గామాత మీ జీవితంలో సంతోషాన్ని, మీ కుటుంబంలో ప్రేమ, అనురాగ ఆప్యాయతల్ని పెంపొందించాలని కోరుకుంటూ హ్యాపీ నవరాత్రి.
- చెడుపై మంచి విజయాన్ని సాధించడంలో అమ్మవారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని.. మీ కష్టాలను అధిగమించాలని కోరుకుంటూ హ్యాపీ దసరా.
- మీరు చేయబోయే పనిలో ఆ అమ్మవారు మీకు బలాన్ని, శక్తిని ప్రసాదించి.. సక్సెస్ అయ్యేలా మిమ్మల్ని ముందుకు నడిపించాలని విష్ చేస్తున్నాను.
- ఈ నవరాత్రి మిమ్మల్ని మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్, మీ గోల్స్ రీచ్ అయ్యేలా ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ హ్యాపీ విజయ దశమి.
- ఆ దుర్గామాత మీ బాధల్ని దూరం చేసి.. మీకు మనశ్శాంతి, ఓదార్పును అందించాలని కోరుకుంటూ హ్యాపీ నవరాత్రి.
- మీరు వెళ్లే ప్రతి మార్గంలో, మీరు చేసే ప్రతి పనిలో ఆ అమ్మవారు మీకు అన్నిరూపాల్లో సహకరించాలని ఆ దుర్గామాతను కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు.
- అమ్మవారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబసభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని.. ఆమె శక్తి మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
- అమ్మవారు మీ ఇంటిల్లీపాదికి మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును అందించాలని కోరుకుంటూ హ్యపీ నవరాత్రి.
- దుర్గమ్మ కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ.. హ్యపీ దసరా.
- ఈ నవరాత్రులు మన జీవితాల్లో కొత్త ప్రారంభాలను, అంతులేని ఆశీర్వాదాలను అందించాలి కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
- మిత్రులు, శ్రేయోభిలాషూలు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మీ అందరిపై ఆ అమ్మవారి దయ, కరుణ ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ దసరా విషెష్‌ను మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి మధ్యామాల్లో పోస్ట్ చేసి దసరా శుభాకాంక్షలు చెప్పి.. ఆ అమ్మవారి దయతో అందరూ హ్యాపీగా దసరాను జరుపుకోవాలని కోరుకుంటూ.. హ్యాపి దసరా.
Also Read : అమ్మవారికి రెండో రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. దసరా స్పెషల్ కొబ్బరి అన్నం రెసిపీ