అన్వేషించండి

Golden Modaks : గణేష్ చతుర్థి స్పెషల్ గోల్డెన్ మోదకాలు.. వినాయకుడికి ఇలా ఈజీగా, టేస్టీగా చేసి నైవేద్యంగా పెట్టేయండి

Golden Modak Recipe : వినాయకుడికి మోదకాలు అంటే చాలా ప్రీతి అని చెప్తారు. అందుకే వినాయక చవితి సమయంలో వివిధ రకాల మోదకాలు చేసి పెడతారు. కాబట్టి ఈసారి గోల్డెన్ మోదకాలు చేసి పెట్టేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వినాయక చవితికి గోల్డెన్ మోదక్​లు ఖోవాతో సులువుగా చేయవచ్చు.
  • వేయించిన ఖోవాకు చక్కెర, పాలపొడి, యాలకులు కలిపి ముద్ద చేయాలి.
  • మోదక్ అచ్చులో పెట్టి, బంగారు ధూళితో అలంకరిస్తే సిద్ధం.

Golden Modak Recipe for Ganesh Chaturthi : చవితి సమయంలో వినాయకుడికి ఇష్టమైన మోదకాలను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. నిజం చెప్పాలంటే ఆవిరి మోదకాలు, కొబ్బరి బెల్లంతో మోదకాలు, చాక్లెట్తో  మోదకాలు చేస్తుంటారు. అయితే ఈసారి కాస్త కొత్తగా, చూడటానికి ఆకర్షణీయంగా మోదకాలు చేయాలనుకుంటున్నారా.. అయితే మీరు గోల్డెన్ మోదక్​లు ట్రై చేయవచ్చు. కోవా, పాలపొడి, పంచదారతో ఈ స్వీట్ మోదకాలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఇవి గోల్డెన్ రంగులోకి ఎలా వస్తాయో.. గోల్డెన్ మోదక్‌లు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

కోవా - 250 గ్రాములు

పంచదార పొడి - అర కప్పు

పాలపొడి - 2 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి - అర టీస్పూన్

జీడిపప్పు, బాదం, పిస్తా - 2 టేబుల్ స్పూన్లు

నెయ్యి - 1 టీస్పూన్

ఎడిబుల్ గోల్డ్ డస్ట్ - అవసరమైనంత

Also Read : కుక్కర్ పరమాన్నం రెసిపీ.. వినాయక చవితికి ఇలా చేయండి, రుచి అదిరిపోతుంది

గోల్డెన్ మోదక్ తయారీ విధానం

ముందుగా కోవాను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె స్టవ్‌పై పెట్టి అందులో కోవా వేసి తక్కువ మంటపై వేయించాలి. కోవా కొద్దిగా మెత్తగా మారి మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఖోవా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

ఇప్పుడు దానిలో పంచదార పొడి, పాలపొడి, యాలకుల పొడి, సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో ముద్దలా చేసుకోవాలి. మిశ్రమం పూర్తిగా చల్లారిపోయి గట్టిగా మారితే మోదక్ అచ్చులో పెట్టడం కష్టమవుతుంది. కాబట్టి చేతులకు వేడి తగలని స్థాయిలో వెచ్చగా ఉన్నప్పుడే మోదకాలు చేసుకోవడం మంచిది. 

Also Read : ఆంధ్రా స్పెషల్ బెల్లం తాళికలు.. పండుగ రోజుల్లో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది, వినాయకచవితికి చేసేయండి

చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని.. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మోదక్ అచ్చులో పెట్టాలి. అచ్చును మెల్లగా నొక్కి మోదక్ ఆకారంలోకి తీసుకురావాలి. అచ్చు లేకపోతే చేతులతోనే మోదక్ ఆకారాన్ని ఇవ్వవచ్చు. అన్ని మోదకాలను ఇలా తయారు చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్‌లో అమర్చాలి. ఇప్పుడు ఎడిబుల్ గోల్డ్ డస్ట్ తక్కువ మోతాదులో మోదకాలపై వేయాలి. ఇలా చేస్తే మోదకాలు బంగారు రంగులో మెరిసిపోతాయి. 

అంతే వినాయక చవితి స్పెషల్ గోల్డెన్ మోదక్ రెడీ. కావాలనుకుంటే పైన సన్నగా తరిగిన పిస్తా లేదా బాదం ముక్కలతో అలంకరించుకోవచ్చు. వీటిని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచితే ఆకారం మరింత బాగా సెట్ అవుతుంది. తర్వాత వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి.. ఇంటికి వచ్చిన అతిథులకు కూడా వడ్డించవచ్చు.

Also Read : టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ.. ఇలా చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
Mens Day 2026 : అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2026.. మెన్స్ డే నవంబర్ 19నే ఎందుకు జరుపుతారు? చరిత్ర, థీమ్, ప్రాముఖ్యతలు ఇవే
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2026.. మెన్స్ డే నవంబర్ 19నే ఎందుకు జరుపుతారు? చరిత్ర, థీమ్, ప్రాముఖ్యతలు ఇవే
Type 2 Diabetes : ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
ఇంటి భోజనం తిన్నా కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుందా? మధుమేహానికి ఈ అలవాట్లే కారణం
Body Pains In Winter : చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
చలికాలంలో ఒళ్లు నొప్పులు పెరగడానికి కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Nara Lokesh: తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
తిరుపతిలో 5 వేల ఎకరాల్లో సెమీకండక్టర్ పార్క్- మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
YS Jagan Assests Case: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో ఛార్జిషీట్.. రూ.150 కోట్ల మనీలాండరింగ్ అభియోగాలు!
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
Embed widget