వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఇండియాలో బెస్ట్ ప్లేస్​లు ఇవే

Published by: Geddam Vijaya Madhuri

హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి ప్రధాన ఆకర్షణ. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం, భారీ నిమజ్జన వేడుకలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి.

ముంబైలోని లాల్‌బాగ్చా రాజా, గణేశ్ గల్లి, దాదర్ ప్రాంతాల్లో జరిగే భారీ గణేష్ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

పూణేలోని దగ్డూశేత్ హల్వాయి గణపతి, కస్బా గణపతి వంటి ప్రసిద్ధ మండపాలను చూడొచ్చు. నగరం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది.

విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలు పండుగ సందడిని పెంచుతాయి.

బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించి సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలను నిర్వహిస్తారు.

మహారాష్ట్రలోని గణపతిపులే ప్రసిద్ధ గణపతి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు సముద్రతీర అందాలను ఆస్వాదించేందుకు ఇది మంచి ప్రదేశం.

గోవాలో గణేష్ చవితిని స్థానిక సంప్రదాయాలు, కుటుంబ వేడుకలు, ప్రత్యేక పూజలతో జరుపుకుంటారు. పండుగ సమయంలో గోవా సంస్కృతిని దగ్గరగా చూడొచ్చు.

చెన్నైలో వినాయక చవితి సందర్భంగా నగరంలోని ఆలయాలు, వీధుల్లో ప్రత్యేక పూజలు, అలంకరణలు కనిపిస్తాయి.

అహ్మదాబాద్లోని గణేష్ ఉత్సవాల సమయంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ మండపాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దుర్గాపూజకు ప్రసిద్ధి చెందిన కలకత్తా నగరంలో కూడా గణేష్ చవితిని ఉత్సాహంగా జరుపుకుంటారు. నగరంలోని గణేష్ మండపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.