(Source: ECI/ABP News/ABP Majha)
Lizards: ఇంట్లో నుంచి బల్లులను తరిమేయాలా? ఈ చిట్కాలు పాటించండి
చాలామందికి బల్లులు అంటే ఎంతో భయం. ఇళ్లల్లో సాధారణంగా బల్లులు నివాసం ఉంటాయి.
ఇంట్లో మనతోపాటు బల్లులు కూడా నివసిస్తాయి. అవి ఎప్పుడు, ఎలా మన ఇంట్లో చేరుతాయో తెలియదు. కానీ గోడల మీద తిరుగుతూనే ఉంటాయి అవి. చాలామందికి వాటిని చూస్తే ఫోబియా. వాటిని చూసి అసహ్యించుకుంటారు. చాలామంది భయపడిపోతారు కూడా. ఇంట్లో బల్లులు ఉంటే అవి ఒక్కోసారి కింద పడడం, వంట పాత్రలపై పడడం, వంట పాత్రల మీద పాకడం వంటివి చేస్తూ ఉంటాయి. కాబట్టి బల్లులను ఇంట్లో నుంచి తరమడానికి ఎక్కువమంది ప్రయత్నిస్తారు. కానీ వాటిని తరమడం కాస్త కష్టమైన పని. బల్లులను తరిమే స్ప్రేలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో రసాయనాలు నిండి ఉంటాయి. ఇలా రసాయనాలతో నిండిన స్ప్రేలను ఇంట్లో చల్లడం అంత మంచిది కాదు. కాబట్టి సహజమైన పద్ధతుల్లోనే బల్లులను ఇంట్లో నుంచి తరమడానికి ప్రయత్నించాలి.
చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే బల్లులు త్వరగా ఇంట్లోంచి వెళ్లిపోతాయి. దానికి గాను ముందుగా వెల్లుల్లి రెబ్బలను కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, మిరియాలు కూడా తీసుకోవాలి. ఒక మిక్సీ జార్‌లో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, మిరియాలు, రెండు గ్లాసుల నీళ్లు వేసి జ్యూస్‌లా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని వడకట్టి ఆ నీటిని స్ప్రే బాటిల్ లో వేయాలి. దీన్ని బల్లులపై స్ప్రే చేస్తూ ఉండడం లేదా బల్లులు తిరిగే ప్రదేశాల్లో ఎక్కువగా స్ప్రే చేస్తూ ఉంటే అవి బయటికి వెళ్లిపోయే అవకాశం ఉంది.
అలాగే ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టాలి. అవి వేడెక్కాక ముద్ద కర్పూరాన్ని పొడిలా మార్చి వేయాలి. కర్పూరం నీటిలో బాగా కరిగిపోవాలి. ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో వేసుకొని ఇల్లంతా స్ప్రే చేసుకోవడం వల్ల బల్లులు బయటకు పోయే అవకాశం ఉంది. ఇలా రోజు స్ప్రే చేస్తేనే బల్లులు బయటకు వెళ్లిపోతాయి. అలాగే ఒక గిన్నెలో నిమ్మరసం పిండుకోవాలి. ఆ నిమ్మరసంలో అర స్పూన్ డెటాల్, అర స్పూన్ లైజాల్ కూడా వేయాలి. ఈ మిశ్రమంలో కాస్త నీళ్లు వేసి స్ప్రే బాటిల్ లో వేయాలి. దీన్ని బల్లులపై స్ప్రే చేస్తూ ఉంటే అవి త్వరగా బయటికి వెళ్లే అవకాశం ఉంది. గోడలకు బూజు పట్టడం, గాలి, వెలుతురు లేకపోవడం వల్లే ఇంట్లో బల్లులు అధికంగా చేరుతాయి. కాబట్టి ఇంట్లో బూజు లేకుండా గాలి, వెలుతురు బాగా వచ్చేలా కిటికీలు తీసి పెట్టడం వంటివి చేయాలి. చీకటి ఇళ్లలోనే ఎక్కువగా బల్లులు నివసించేందుకు ఇష్టపడతాయి. కాబట్టి ఇంటిని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి.
Also read: మొక్కజొన్న పీచును పడేస్తున్నారా? ఇలా టీ చేసుకోండి, ఎంతో ఆరోగ్యం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.