అన్వేషించండి

Bloating After Eating : తిన్న వెంటనే మీకు గ్యాస్ వస్తుందా? అయితే మీరు ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి

Getting Gas After Every Meal : భోజనం చేసిన వెంటనే మీకు గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా బరువుగా అనిపిస్తే.. అది మీరు ఫాలో అయ్యే చెడు అలవాట్ల వల్లే కావచ్చు. అవేంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసేద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సరిగ్గా నమలకపోవడం, భోజన సమయంలో నీళ్లు తాగడం అజీర్తికి కారణం.
  • తిన్నవెంటనే పడుకోవడం, డీప్‌ఫ్రై ఆహారాలు కడుపు ఉబ్బరం పెంచుతాయి.
  • భోజనం చేస్తూ మాట్లాడటం వలన గ్యాస్, అసౌకర్యం వస్తాయి.

Gas and Bloating After Meals : ఈ మధ్యకాలంలో చాలామందికి జీర్ణ సమస్యలు పెరిగిపోయాయి. భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యం అనేవి చాలా కామన్ సమస్యలుగా మారిపోయాయి. దీని అర్థం మీరు తినే విధానంలోనే కొన్ని తప్పులే కావచ్చు. వేగంగా తినడం నుంచి తిన్న వెంటనే పడుకోవడం వరకు.. తెలియకుండా చేసే కొన్ని అలవాట్లు గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యను పెంచుతాయి. ఆ తప్పులు ఏంటో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం.

సరిగ్గా నమలకపోతే..

చాలామంది ఆహారాన్ని వేగంగా తింటారు. ఆహారాన్ని ఫాస్ట్​గా మింగడం అంటే సరిగ్గా నమలకపోవడమే. ఆహారాన్ని పూర్తిగా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి, అత్యంత ముఖ్యమైన దశ. ఎందుకంటే నోటిలోని లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా నమలకుండా కడుపులోకి వెళ్తే దానిని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్, బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. 

Also Read : తిన్న వెంటనే కడుపు మంట, ఉబ్బరం వస్తుందా? అయితే ఈ ఫుడ్స్ తినకపోవడమే మంచిది

నీళ్లు తాగడం..

అలాగే చాలా మందికి భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులోని జీర్ణరసాలు పలుచబడి.. సరైన జీర్ణక్రియ జరగదు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం కలుగుతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే భోజనానికి సుమారు అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. 

తిన్నవెంటనే పడుకోవడం

తిన్న వెంటనే మంచం మీద పడుకోవడం లేదా నిద్రపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణమే కావచ్చు. పడుకోవడం వల్ల కడుపులోని ఆహారం, ఎసిడిటీ పైకి వచ్చి.. కడుపు ఉబ్బరం, గ్యాస్, గుండెల్లో మంటకు కారణమవుతాయి. తిన్న తర్వాత కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా కాస్త నడవడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

Also Read : జీర్ణ సమస్యలను దూరం చేసే 9 హెల్తీ ఫుడ్స్.. కడుపు ఉబ్బరం నుంచి మలబద్ధకం వరకు

డీప్ ఫ్రై చేసిన ఫుడ్

అతిగా వేయించిన, మసాలా లేదా నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కడుపుపై ​​ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఆహారాలను అధిక పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా.. కిడ్నీ బీన్స్, శనగలు, క్యాబేజీ వంటి కొన్ని కూరగాయలు, పప్పుధాన్యాలు కూడా సహజంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి వాటిని సరైన పరిమాణంలో, సరిగ్గా వండిన తర్వాత తింటే మంచిది. 

తింటూ మాట్లాడటం..

తింటూ ఎక్కువగా మాట్లాడితే.. శ్వాసను వేగంగా తీసుకోవాల్సి వస్తుంది. స్ట్రాతో తాగడం వంటివి కూడా కడుపులోకి గాలి చేరడానికి కారణమవుతాయి. ఈ విధంగా మింగిన గాలి కడుపు ఉబ్బరానికి, గ్యాస్‌కు కూడా కారణం కావచ్చు. అందుకే సైలెంట్​గా, తక్కువ సంభాషణతో తినడం మంచిది. 

ఈ అలవాట్లు మార్చుకుంటే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటే లేదా మరింత తీవ్రంగా మారితే.. దానిని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లక్షణాలు ఇంకేదైనా అంతర్లీన సమస్యకు సంకేతం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 

Also Read : కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య ఉంటే.. ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే

 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Saddula Bathukamma Naivedyam : సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
సద్దుల బతుకమ్మ స్పెషల్ సత్తు పిండి.. వాయినంగా ఇచ్చేందుకు ఇంట్లోనే ఇలా తయారు చేయండి
Fenugreek Water 21 Days : 21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
21 రోజులు మెంతుల నీరు తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget