Christmas Cake : క్రిస్మస్ కేక్ వెనుక కథ ఇదే.. దీనిలో రమ్ కలుపుతారని తెలుసా?
Christmas Cake Tradition : క్రిస్మస్ సమయంలో ప్లమ్ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. క్రిస్మస్ ట్రీతో పాటు.. కేక్ కూడా బాగా ఫేమస్ అయింది. ఇంతకీ కేక్, క్రిస్మస్ మధ్య సంబంధం ఏంటంటే..

Christmas 2025 : డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ డే. ఈ సమయంలో కేక్ డిమాండ్ బాగా పెరుగుతుంది. నిజానికి క్రిస్మస్ ట్రీతో పాటు కేక్‌కు కూడా ఈ పండుగతో ప్రత్యేక అనుబంధం ఉంది. కేక్ ఈ పండుగకు అసలైన స్వీట్. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే క్రిస్మస్‌కు కేక్‌తో సంబంధం ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? మొదటి క్రిస్మస్ కేక్ ఎలా చేసేవారు? దానిలో రమ్ కలుపుతారా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
క్రిస్మస్ కేక్ స్టోరి
రమ్, దాల్చినచెక్క, జాజికాయ, చెర్రీస్, కిస్‌మిస్, బాదం రుచులతో ఆస్వాదించే రిచ్ ఫ్రూట్ కేక్ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుంకటే పాత రోజుల్లో క్రిస్మస్‌ను ఒక నెల పాటు.. డిసెంబర్ 6 నుంచి జనవరి 6 వరకు జరుపుకునేవారు. శీతాకాలంలో ప్రజలు పండుగను ఎక్కువ కాలం ఆనందించేవారు.
ఆ సమయంలో అడ్వెంట్ (క్రిస్మస్‌కు ముందు ఉపవాసం) సమయంలో తేలికపాటి, సాధారణ ఆహారం తీసుకునేవారు. ఉపవాసం ముగిసిన తర్వాత.. ప్లం పోరిడ్జ్ తయారుచేసేవారు. ఇందులో ఓట్స్, మసాలాలు, తేనె, ఎండిన ప్లమ్స్ కలిపేవారు. ఇది కేవలం పోషకమైనది మాత్రమే కాదు.. రుచికరమైనది కూడా.
ప్లమ్ పోరిడ్జ్ ఎలా మారిందంటే..
16వ శతాబ్దంలో ప్లం పోరిడ్జ్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. కేక్ మిక్స్లో గుడ్డు, పిండి, మసాలాలు, వెన్న కూడా కలపడం ప్రారంభించారు. ఆ తర్వాత ఈ వంటకం కేక్ లాగా తయారవడం మొదలైంది. ధనిక కుటుంబాల వారు ఇందులో డ్రై ఫ్రూట్స్, షుగర్ కోటెడ్ మిశ్రమాలను కూడా కలిపి అలంకరించేవారు. క్రమంగా ఇది క్రిస్మస్ కేక్‌గా ప్రసిద్ధి చెందింది. 18వ-19వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ తర్వాత ఎవరి పనులలో వాకు బిజీగా మారారు. నెలల తరబడి జరిగే క్రిస్మస్ కేవలం ఒక రోజు.. డిసెంబర్ 25న జరుపుకోవడం ప్రారంభించారు.






















