బీచ్ వైబ్, గ్రేట్ గోతిక్ నిర్మాణాన్ని మిళితం చేసే ప్రదేశం ఇది. ఈ అందమైన కేంద్రపాలిత ప్రాంతంలో ప్రశాంతమైన, ఉల్లాసవంతమైన బీచ్‌లు ఉంటాయి. ఇక్కడ చర్చ్‌లు క్రిస్మస్ సమయంలో బాగా అలంకరిస్తారు.
కోల్‌కతా క్రిస్మస్ సమయంలో అద్భుతంగా మారుతుంది. లైట్లు, అలంకరణలతో పార్క్ స్ట్రీట్స్ డైమండ్‌లా మెరుస్తాయి. క్రిస్మస్ సాంగ్స్‌తో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వలసరాజ్యాల మైలురాళ్లకు పేరుగాంచిన ఈ నగరం విక్టోరియా మెమోరియల్‌కు ప్రసిద్ధి చెందింది.
భారతదేశంలో క్రిస్మస్ వేడుకలకు పర్యాయపదంగా నిలిచే ప్రదేశం ఏదైనా ఉందంటే అది గోవానే. మెరిసే లైట్లు, అద్భుతమైన సంగీత ఉత్సవాలు, గోవాతో ముడిపడి ఉన్న అద్భుతమైన పార్టీలు భారతదేశంలో మరెక్కడా లేని విధంగా వేడుకల స్ఫూర్తిని పెంచుతాయి.
కర్ణాటకలోని కూర్గ్‌ని భారతదేశపు స్కాట్లాండ్ అని పిలుస్తారు. పొగమంచుతో కూడిన కొండలు, పెద్ద కాఫీ తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం క్రిస్మస్ సమయంలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ముంబై క్రిస్మస్ను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. పండుగ వాతావరణం హిల్ రోడ్ బాంద్రా, చర్చ్ గేట్ వంటి తరచుగా సందర్శించే ప్రదేశాలు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.
డిసెంబర్ నెలలో ఊటీ తన మనోహరమైన రూపాన్ని ఏమాత్రం కోల్పోకుండా క్రిస్మస్ మాయాజాలం జరిగే ప్రదేశంగా మారుతుంది. కొండలు, చల్లని వాతావరణంతో ఇది మరింత అందంగా కనిపిస్తుంది.
ఇక్కడ ఉన్న పెద్ద క్రైస్తవ సమాజం క్రిస్మస్ను అచంచలమైన ఉత్సాహంతో జరుపుకుంటుంది. దీంతో నగరం అనేక పండుగ కార్యక్రమాలకు కేంద్రంగా మారింది. ఇది క్రిస్మస్ కోసం అందమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు.
సిమ్లా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు అనువైన గమ్యం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక కొండ ప్రాంతం. దీనిని కొండల రాణి అని పిలుస్తారు. క్రిస్మస్ సమయంలో మంచు కురుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది పట్టణాన్ని అద్భుతంగా అందంగా మారుస్తుంది.
మంచు వాలులకు, హిమాలయాల అద్భుతమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం శాంతిని తెస్తుంది. మంటల ముందు కూర్చోవడం, సుందరమైన హైకింగ్లకు వెళ్ళడం వంటివి క్రిస్మస్ హాలీడేలో చేయవచ్చు.