By: ABP Desam | Updated at : 03 May 2022 07:09 PM (IST)
Elon Musk
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్.. ‘ఫ్రీ స్పీచ్’ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీన్ని వ్యతిరేకించేవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే, ఆ అభ్యంతరాలేవీ పట్టించుకోకుండా మస్క్.. ఊర మాస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఓ మాజీ పోర్న్ స్టార్ నుంచి మస్క్‌కు ఊహించని రిక్వెస్ట్ వచ్చింది. అయితే, ఆమె చేసిన రిక్వెస్ట్ గురించి తెలిస్తే మీరు కూడా మెచ్చుకుంటారు. అసలే, పోర్న్ స్టార్.. ఆమె అతడిని ఏమడిందో ఏమిటో అని.. మరోలా ఆలోచించకండి. ఆమెకు ఇప్పుడు మనలో ఒకరు. ఆ అశ్లీల ప్రపంచాన్ని వదిలి జనజీవనంలో కలిసింది. పోర్న్ వల్ల కలిగే నష్టాలను తెలుసుకుంది. సామాజిక మాధ్యమాల్లో ‘పోర్న్’కు చోటివ్వకూడదని ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా ఆమె.. ఎలాన్ మస్క్‌కు కూడా ఓ రిక్వెస్ట్ చేసింది.
ఆ మాజీ పోర్న్ స్టార్ పేరు.. లిసా ఆన్. 2014 తర్వాత ఆమె అశ్లీల చిత్రాల్లో నటించడం మానేశారు. అప్పటి నుంచి ఆమె ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థకు, ఓన్లీఫ్యాన్స్‌లో పనిచేస్తోంది. సోషల్ మీడియాలో ‘పోర్న్’ గురించి మాట్లాడుతూ.. ఎలాంటి వయస్సు పరిమితులు లేని సామాజిక మీడియాల్లో అశ్లీలతకు అవకాశం ఇవ్వకూడదని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వాటిని నియంత్రిస్తున్నా.. ట్విట్టర్‌లో మాత్రం ఆ వ్యవస్థ లేదని తెలిపారు. ‘‘ఇన్‌స్టాగ్రామ్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దల కంటెంట్‌ను ఎటువంటి పరిమితులు లేకుండా అప్‌లోడ్ చేయడానికి ట్విట్టర్ అనుమతి ఇస్తుంది’’ అని తెలిపారు.
Also Read: అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
Only party with people who celebrate life. pic.twitter.com/rtaVLWC3UD
— Lisa Ann (@thereallisaann) May 2, 2022
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏప్రిల్ 25న ట్విట్టర్ కొనుగోలు కోసం 44 బిలియన్ డాలర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకొనేందుకు ట్విట్టర్ వేదిక కావాలని, అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థకు నిదర్శనంగా ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ను గతంలో కంటే మెరుగ్గా చేస్తానన్నారు. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడే స్వేచ్ఛకు కళ్లెం వేయకపోతే.. విద్వేషపు జ్వాలలు రగిలించేవారికి అవకాశం ఏర్పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి సవాళ్లను మస్క్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?
Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి
Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు
Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!
Keema Recipe: దాబా స్టైల్లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం
Clay Pot: ఫ్రిజ్‌లో నీళ్ల కన్నా కుండలో నీళ్లు తాగడం వల్ల ఎంత ఆరోగ్యమో తెలుసా?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!