Migraine Triggering Points : మైగ్రేన్‌ను ట్రిగర్ చేసే కారకాలు, ఫుడ్స్ ఇవే.. జాగ్రత్త
Migraine Triggers : మైగ్రేన్ రావడానికి పలు కారణాలు ఉంటాయి. కొన్ని ఫుడ్స్ వల్ల అయితే మరికొన్ని ఆహారేతర కారణాల వల్ల మైగ్రేన్ వస్తుంది. అందుకే ఆ కారణాలు గుర్తించి వాటికి దూరంగా ఉండాలి అంటున్నారు.
Migraine Causes : మైగ్రేన్‌తో ఇబ్బందిపడేవారి బాధ వర్ణించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సమస్య బాధితులను అతలాకుతలం చేస్తుంది. మైగ్రేన్ సమయంలో రక్తనాళాలు ఉబ్బి, మెదడులోని నొప్పి మార్గాలను సక్రియం చేయడానికి కారణమవుతుంది. అయితే ఈ మైగ్రేన్ ట్రిగ్గర్లు ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయి. కాబట్టి పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కొన్ని లక్షణాలను సెట్ చేసుకోవాలి. ఎందుకంటే జన్యుపరమైన కారకాలు, వయసు, సెక్స్, హార్మోన్ల మార్పులు, శారీరక, మానసిక ఒత్తిడి ప్రతి చర్యలు, నిద్ర విధానాలు ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటాయి. అయితే మైగ్రేన్‌కు కారణమయ్యే పలు రకాల ఫుడ్స్, కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆకలి
మీరు వివిధ కారణాలతో అల్పాహారం, భోజనాన్ని స్కిప్ చేస్తున్నారా? అయితే మీకు మైగ్రేన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. భోజనం చేయకపోవడం, కేలరీలు తగ్గించడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది. ఇది తలనొప్పి లేదా మైగ్రేన్‌ను తీవ్రం చేస్తుందని ఓ అధ్యయనం తెలిపింది.
ఒత్తిడి, ఆందోళన
ఒత్తిడి అనేది వివిధ కారణాల వల్ల వస్తుంది. అయితే ఇది మీలో మైగ్రేన్‌ను బాగా ప్రేరేపిస్తుంది. ఒత్తిడికి గురవుతున్న దాదాపు 70 శాతం మంది వ్యక్తులలో మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఆందోళన, భయాందోళన ప్రభావం మైగ్రేన్‌ను బాగా పెంచుతుందని డిప్రెషన్ అసోసియేషన్ ఆఫ్ అమెరికా తెలిపింది.
డీహైడ్రేషన్
డీహైడ్రేషన్ అనేది ఆరోగ్యంపై వివిధ స్థాయిల్లో ప్రభావం చూపిస్తుంది. ఇది తలనొప్పిని ప్రేరేపించే మరో మార్గం. మైగ్రేన్ సమస్య ఉన్నవాతరిని డీహైడ్రేషన్ చాలా ట్రిగ్గర్ చేస్తుంది. అందుకే రెగ్యూలర్‌గా వాటర్ తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ వాటిని కాకుండా నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.
వాతావరణంలో మార్పులు
వాతావరణంలోని మార్పులు కూడా మైగ్రేన్‌ను తీవ్రతరం చేస్తాయి. తీవ్రమైన చలి, ఎండ, తేమగా ఉన్నప్పుడు కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. దీనిగురించి పరిశోధనలు తక్కువగా జరిగినప్పటికీ.. మారుతున్న వాతావరణంతో పాటు మైగ్రేన్‌ను మీరు గుర్తించవచ్చు.
వ్యాయామం
వ్యాయామం మైగ్రేన్లను ప్రేరేపిస్తుందని అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ తెలిపింది. రెగ్యూలర్ వ్యాయామం దీని ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. ఎందుకంటే వ్యాయామం వల్ల మెదడులోని ఎండార్ఫిన్ అనే సహజమైన నొప్పి తగ్గుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే కొన్నిసార్లు వ్యాయామం మైగ్రేన్‌కు ట్రిగ్గర్ పాయింట్.
ఇవే కాకుండా అలెర్జీలు, కాంతి, ధ్వని, వాసన కూడా మైగ్రేన్‌ను ట్రిగ్గర్ చేస్తాయి. కొన్ని మందులు కూడా ఈ సమస్యను తీవ్రతరం చేస్తాయి. పళ్లు బిగించడం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. ఇది తల, మెడ కండరాలపై ఒత్తిడి కలిగిస్తుంది. స్క్రీన్ ఎక్కువగా చూడడం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది. ఎక్కువగా పడుకున్నా, తక్కువగా పడుకున్న కూడా మైగ్రేన్ వస్తుంది. స్త్రీలలో హార్మోన్ల స్థాయిలు పెరిగినా తగ్గినా.. కూడా మైగ్రేన్ వస్తుంది. కెఫిన్, రెడ్ వైన్ వంటి ఇతర మద్య పానీయాలు కూడా మైగ్రేన్‌ను ట్రిగర్ చేస్తాయి. చీజ్, హాట్ డాగ్‌లు, మీట్ వంటి ప్రాసెస్ చేసిన ఫుడ్ మైగ్రేన్‌ను తీవ్రతరం చేస్తాయి.
Also Read : ఈ టిప్స్ ఫాలో అయితే కేవలం 5 నిమిషాల్లోనే మీ ఒత్తిడి తగ్గించుకోవచ్చు