Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కొరియన్ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని ఫాలో అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ముఖ్యమే.
కొరియన్ అందం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చూడచక్కని ప్రకాశవంతమైన ముఖాలు వేసుకుని మెరిసిపోతూ కనిపిస్తారు. సంప్రదాయమైన పద్ధతులు పాటిస్తూ తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటారు. కొరియన్ సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగించేది కోజిక్ యాసిడ్. ప్రకాశవంతమైన టోన్ లక్షణాలకు ఇది ప్రసిద్ధి చెందింది. వివిధ శిలీంధ్రాల నుంచి తీసుకున్నారు. నల్ల మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్, చర్మం రంగు మెరుగుపరిచేందుకు సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. కోజిక్ యాసిడ్ మీరు కూడా ఉపయోగించుకుని అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అయితే అది వినియోగించే ముందు తప్పని సరిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. చర్మ సంరక్షణ దినచర్యలో ఏదైనా కొత్త పదార్థాన్ని చేర్చే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. మోచేయి మీద కొద్దిగా యాసిడ్ రాసుకుని టెస్ట్ చేసుకోవాలి. ఏదైనా ప్రతికూల చర్య కనిపించాలంటే 24-48 గంటలు వేచి చూడాలి.
సరైన ఉత్పత్తులు ఎంచుకోవాలి
కోజిక్ యాసిడ్ ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వీటిలో క్లెన్సర్, సీరమ్, క్రీమ్, సబ్బులు కూడా ఉంటాయి. కోజిక్ యాసిడ్ తో పాటు ఇతర ప్రయోజనకరమైన పదార్థాలు కలిగి ఉండేది ఎంచుకుంటే మంచిది.
సన్ స్క్రీన్ ఉపయోగించాలి
కోజిక్ యాసిడ్ రాసుకుంటే చర్మం సున్నితంగా మారుతుంది. అందుకే ప్రతిరోజూ ఎస్పీఎఫ్ ఉన్న 30 ఉన్న సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా కీలకం. ఇది చర్మాన్ని యూవీ డ్యామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ ని నివారిస్తుంది.
నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి
కోజిక్ యాసిడ్ వినియోగించడం మొదటరీ సారి అది అది చర్మానికి అలవాటు అయ్యేంత వరకు ప్రతిరోజూ లేదా వారానికి కొన్ని సార్లు ఉపయోగించాలి. చర్మం దానికి ఎలా స్పందిస్తుందో పర్యవేక్షించాలి. ప్రతికూల ప్రభావాలు కనిపించకపోతే దాన్ని ఫ్రీక్వెన్సీగా ఉపయోగించుకోవచ్చు.
చర్మం శుభ్రంగా ఉండాలి
కోజిక్ యాసిడ్ ఉత్పత్తులు చర్మం మీద రాసుకునేటప్పుడు స్కిన్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పొడి చర్మం మీద వర్తింపజేయాలి. అప్పుడే అది స్కిన్ కి బాగా పడుతుంది.
డార్క్ స్పాట్స్ తొలగిస్తుంది
హైపర్ పిగ్మెంటేషన్ లేదా డార్క్ స్పాట్ పోగొట్టుకునేందుకు కోజిక్ యాసిడ్ వినియోగిస్తున్నట్టు అయితే చర్మం ముందుగా శుభ్రం చేసుకోవాలి. మాయిశ్చరైజింగ్ చేసే ముందు మచ్చలు ఉన్న ప్రాంతాలపై పలుచని పొర మాదిరిగా దీన్ని అప్లై చేసుకోవాలి.
కంటి మీద వద్దు
కళ్ళు లేదా నోటి చుట్టూ ఉన్న సున్నితమైన ప్రాంతాలకు కోజిక్ యాసిడ్ అసలు అప్లై చేసుకోకూడదు. ఆ ప్రాంతాలకు తగలకుండా దీన్ని రాసుకోవాలి.
చికాకు పెడితే వద్దు
కోజిక్ యాసిడ్ రాసుకున్న తర్వాత ఎర్రగా మారిపోవడం, దురద, చిరాకు వంటి పరిస్థితులు కనిపిస్తే వాటిని ఉపయోగించడం తగ్గించడం మంచిది. ఇబ్బంది ఎక్కువ అయితే పూర్తిగా నివారించడం ఉత్తమం.
మాయిశ్చరైజ్
కోజిక్ యాసిడ్ పొడిగా ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడం కోసం మంచి మాయిశ్చరైజర్ ఎంచుకోవడం ముఖ్యం. హైపర్ పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు పోవడానికి సమయం పడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పచ్చి అరటి పండు తినడం వల్ల ఈ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చా?