అన్వేషించండి

Joint Health: ఎముకలు, కీళ్లు ఉక్కులా బలంగా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Joint Health: మోకాళ్ల నొప్పులు, కీళ్లు అరిగిపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పుల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అవేంటో చూద్దాం.

Joint Health: మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగాల్లో జాయింట్స్ చాలా ప్రముఖమైనవి. మనం నిలబడాలన్నా, కదలిక ఉండాలన్నా జాయింట్స్ ముఖ్యమైనవి. . వీటిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది తప్పనిసరి. వయసు పెరిగే కొద్దీ కూడా మన శరీరానికి అందాల్సిన పోషకాలు తగ్గిపోయి జాయింట్స్ అరిగిపోవడం, మోకాళ్లు వంటి ముఖ్యమైన జాయింట్స్ లో గుజ్జు అనేది తగ్గిపోతుంది. ఫలితంగా మోకాళ్ళలో నొప్పులు, కీళ్లు అరిగిపోవడం, మోకాలి చిప్పలో లోపాలు తలెత్తడం వంటి సమస్యలతో జాయింట్స్ ప్రాబ్లమ్స్ ప్రారంభం అవుతాయి. అయితే ఈ సమస్యల నుంచి బయట పడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం, సరైన చికిత్స వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మోకాళ్లు అనేవి మూడు భాగాలుగా ఉంటాయి అందులో ఒకటి ఫైబ్రస్, రెండోది కార్టీలోజనియస్, మూడోది సైనోవియల్ పేర్లతో పిలుస్తారు. మోకాళ్ల నొప్పులకు ముఖ్యంగా ఈ ఎముకలు అరుగుదల ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఇందులో సైనోవియల్ జాయింట్స్ లో గుజ్జు ఉంటుంది. ఈ గుజ్జు తగ్గినప్పుడల్లా జాయింట్లు అరగడం ప్రారంభిస్తాయి. తద్వారా జాయింట్లు అరిగిపోయి నొప్పులు విపరీతంగా మారుతాయి. అయితే ఈ సైనోవియల్ జాయింట్స్ లో గుజ్జు అరగకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు చేపట్టాలో తెలుసుకుందాం. 

చాలామందిలో ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల మోకాళ్ల నొప్పులు, జాయింట్స్ నొప్పులు వస్తాయి. ఆర్థరైటిస్ అనేది తీవ్రమైన కాల్షియం లోపం వల్ల వస్తుంది ముఖ్యంగా ఎముకలు గుల్లగా మారిపోయి బలం లేకుండా తయారవుతాయి. అప్పుడు జాయింట్స్ వద్ద వాపు కనిపిస్తుంది. అలాగే జాయింట్స్ నొప్పులు పెరుగుతాయి. ఫలితంగా నడకలోను కదలికలోను నొప్పులు ప్రారంభం అవుతాయి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

బరువు కంట్రోల్ చేసుకోవాలి:

మన శరీర ఎత్తుకు తగ్గట్టుగా బరువును మెయింటైన్ చేయాలి. లేకపోతే మీ శరీర బరువు అంత మోకాళ్లపై పడుతుంది. ఫలితంగా జాయింట్స్ దెబ్బ తినే ప్రమాదం ఉంది ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్యకు కారణం అవుతుంది. అందుకే మీరు ఎప్పటికప్పుడు బరువును చెక్ చేయించుకొని. అదుపులో ఉంచుకుంటే మంచిది తద్వారా జాయింట్ డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. 

నిత్యం యాక్టివ్ గా ఉండాలి:

ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండడం వల్ల ఎముకలు కదలిక ఉండి మోకాళ్ల నొప్పులు జాయింట్ పెయిన్స్ వంటివి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడం ద్వారా జాయింట్ నొప్పుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఫిజికల్గా యాక్టివ్గా మన శరీరాన్ని ఉంచుకోవాలి . అప్పుడే కండరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి నొప్పులు రాకుండా ఉంటాయి. 

సరిగ్గా కూర్చోవాలి:

మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ కు సరిగా కూర్చోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు కూర్చునే కుర్చీ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీ వెన్నుపూసకు రెస్ట్ ఇస్తూనే కాళ్లకు భారం కాకుండా కూర్చి ఉండాలి లేకపోతే మోకాళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఈ ఫుడ్స్ తింటే మంచిది:

మీరు తీసుకునే ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసం చేపలు, ఫ్లాక్స్ సీడ్స్, అక్రూట్ పండ్లు ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు విటమిన్ డి అందేలా ఆకుకూరలు, సోయా ఉత్పత్తులు, పాల ఉత్పత్తులను మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్ సి, ఈ పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలను తీసుకోవాలి. 

మంచినీరు పుష్కలంగా తాగాలి:

మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం శరీరంలో జరిగే డిహైడ్రేషన్ కూడా ఒకటని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఎప్పటికప్పుడు మంచినీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. 

స్ట్రెస్ తగ్గించుకోవాలి:

శరీరంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఒత్తిడి గా ఉండే పనులకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితానికి అలవాటు చేసుకోవాలి.

Also Read : ప్రపంచ హృదయ దినోత్సవం 2024 థీమ్ ఇదే.. హార్ట్ హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్ ఇదే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
టి20 ప్రపంచ కప్ అడే భారత్ జట్టు ఇదేనా? సూర్యకుమార్ సారథ్యంలో తుది జట్టుపై బిగ్ అప్డేట్!
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Embed widget