Best One-Year FD Rates : లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి FDలో జమ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడిని ఇస్తుంది?
Small Finance Banks vs Government Banks : మీరు ఒక ఏడాది FD చేయాలనుకుంటే.. ఎంత రాబడి వస్తుందో తెలుసా? వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారతాయి. మరి లక్ష డిపాజిట్ చేస్తే ఏ బ్యాంకు ఎంత రాబడి ఇస్తుందో తెలుసా?

- చిన్న ఫైనాన్స్ బ్యాంకులు లక్ష FDపై ఎక్కువ వడ్డీనిస్తాయి.
- సూర్యోదయ, ఉజ్జీవన్ బ్యాంకులు 7.25% వడ్డీని అందిస్తాయి.
- ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తున్నాయి.
- పన్ను, నిబంధనలు తెలుసుకుని FDలో పెట్టుబడి పెట్టాలి.
Fixed Deposit Interest Rates : ఎలాంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి చాలామంది తమ దగ్గర ఉండే డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) చేస్తారు. దీనిపై వడ్డీ వస్తుందని.. పెద్ద మొత్తాన్ని FDగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రతి బ్యాంకు తన వినియోగదారులకు వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తుంది. కాబట్టి మీరు ఒక సంవత్సరానికి లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) చేయాలనుకుంటే.. ఏయే బ్యాంకులు ఎలా వడ్డీ రేట్లను అందిస్తాయో చూసేద్దాం.
ది ఎకనామిక్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం.. కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఒక సంవత్సరం FDలపై 7.25% వరకు వడ్డీ రేట్లను అందిస్తుండగా.. SBI, HDFC, ICICI వంటి పెద్ద బ్యాంకులు తక్కువ రేట్లను అందిస్తున్నాయి.
Also Read : సేవింగ్స్ చేయడానికి PPF మంచిదా? FD బెటరా? ఎక్కువకాలం పొదుపు చేస్తే ట్యాక్స్, వడ్డీ ఎలా ఉంటాయి?
ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోందంటే..
మీరు లక్ష FD చేయడం గురించి ఆలోచిస్తున్నట్లయితే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఏ బ్యాంకులు అత్యధిక వడ్డీని అందిస్తున్నాయో తెలుసుకుందాం.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
| బ్యాంకు | సంవత్సరం వడ్డీ రేటు | మెచ్యూరిటీపై మొత్తం |
| సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7.25% | 1,07,450 |
| ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7.25% | 1,07,450 |
| ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7.10% | 1,07,291 |
| జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ | 7.00% | 1,07,186 |
Also Read : పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ చేయడానికి ఈ 3 పథకాలు బెస్ట్.. FD కంటే ఎక్కువ వడ్డీ పొందవచ్చు
ప్రైవేట్ బ్యాంక్
| బ్యాంకు | సంవత్సరం వడ్డీ రేటు | మెచ్యూరిటీపై మొత్తం |
| SBM బ్యాంక్ ఇండియా | 7.10% | 1,07,291 |
| బంధన్ బ్యాంక్ | 7.00% | 1,07,186 |
| DCB బ్యాంక్ | 6.90% | 1,07,081 |
| RBL బ్యాంక్ | 6.90% | 1,07,081 |
| HDFC బ్యాంక్ | 6.25% | 1,06,398 |
| ICICI బ్యాంక్ | 6.25% | 1,06,398 |
| యాక్సిస్ బ్యాంక్ | 6.25% | 1,06,398 |
Also Read : జీతం పెరిగినా డబ్బులు మిగలట్లేదా? అయితే కారణాలు ఇవే, ఇలా సేవింగ్స్ చేసుకోండి
ప్రభుత్వ బ్యాంకులు
| బ్యాంకు | సంవత్సరం వడ్డీ రేటు | మెచ్యూరిటీపై మొత్తం |
| బ్యాంక్ ఆఫ్ ఇండియా | 6.50% | 1,06,660 |
| ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 6.50% | 1,06,660 |
| బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 6.40% | 1,06,555 |
| స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) | 6.25% | 1,06,398 |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) | 6.25% | 1,06,398 |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 6.25% | 1,06,398 |
| కెనరా బ్యాంక్ | 6.25% | 1,06,398 |
FD పెట్టే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలివే..
సేవింగ్స్‌లో భాగంగా FD చేసే ముందు.. కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం అధిక వడ్డీ రేట్ల ఆధారంగా బ్యాంకును ఎంచుకోకూడదు. ఎందుకంటే FDపై వచ్చే వడ్డీ మీ ట్యాక్స్ బాధ్యతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి పన్ను సంబంధిత విషయాలను గుర్తుంచుకోండి. గడువుకు ముందే డబ్బు ఉపసంహరించుకోవడానికి సంబంధించిన నియమాలతో సహా.. అన్ని నియమాలను జాగ్రత్తగా చదివి తర్వాత అప్లై చేయడం మంచిది.
Also Read : శాలరీని 50-30-20 రూల్‌తో ఎలా బ్రేక్ చేయాలి.. సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























