Happy Fathers Day 2025 : హ్యాపీ ఫాదర్స్ డే అంటూ నాన్నకు విష్ చేప్పేయండి.. ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో ఇలా విష్ చేసేయండి
Fathers Day 2025 Wishes in Telugu : మీ నాన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫాదర్స్ డే రోజు స్పెషల్ విషెష్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా హ్యాపీ ఫాదర్స్ డే అంటూ కోట్ చెప్తూ విష్ చేసేయండి.

Fathers Day 2025 Wishes : తండ్రి కుటుంబం కోసం చేసే త్యాగాలను గుర్తిస్తూ.. ప్రతి ఏడాది జూన్ మూడోవ ఆదివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుతున్నారు. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 15వ తారీఖున వచ్చింది. నిస్వార్థంగా తండ్రులు చేసే త్యాగాలను గుర్తించి వారికి మన ప్రేమను వ్యక్తం చేస్తూ నచ్చిన గిఫ్ట్ లేదా విషెష్ చెప్తూ ఈ ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇండియాలో కూడా దీనిని చాలామంది జరుపుకుంటారు.
తల్లిదండ్రులను గౌరవించడానికి, ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఓ తేదీ అవసరం లేదు. కానీ ఇలాంటి ఓ స్పెషల్ డే.. వారి రోజును మరింత స్పెషల్‌గా ట్రీట్ అయ్యేలా చేయడానికి అవసరం. కాబట్టి మీ నాన్న దగ్గరికి వెళ్లి మీ ప్రేమను వ్యక్తం చేయండి. ఆయనతో ఉన్న మీ జ్ఞాపకాలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెష్ చెప్పేయండి. ఇక్కడ కొన్ని విషెష్ ఉన్నాయి. వాటిని పోస్ట్ చేసి మీ ప్రేమను వ్యక్తం చేసేయండి.
ఫాదర్స్ డే విషెష్
మీరు మీ నాన్నకు ఫాదర్స్ డే విషెష్ చెప్పాలనుకుంటే ముందుగా మీ ఇద్దరి మధ్య ఉండే బంధాన్ని, స్నేహ్నన్ని, ప్రేమను వ్యక్తం చేస్తూ చెప్తే వాటి ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎలాంటి విషెష్ చెప్తే బాగుంటుందో ఇప్పుడు చూసేద్దాం.
- నాన్న నువ్వే నా హీరో. నాకున్న అతిపెద్ద సపోర్ట్ నీదే. హ్యూపీ ఫాదర్స్ డే 2025.
- అడగకుండా నాకోసం అన్ని సమకూర్చి.. సైలెంట్‌గా ఏమి చేయనట్టు కనిపించే నీ ప్రేమ వెలకట్టలేనిది నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే.
- నీ ప్రేమే నాకు బలం. కాబట్టి నువ్వు ఎప్పుడు సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
- ఎన్ని కష్టాలు వచ్చినా.. గివ్ అప్ చేయకుండా ముందుకు వెళ్లాలి అనేదానికి నువ్వే నా నిదర్శనం నాన్న. లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే.
- నువ్వే నా సూపర్ హీరోవి నాన్న. నేను కష్టాల్లో ఉన్నా, జీవితంలో ఏదైనా కోల్పోయినా లేదా ఏదైనా సమస్యల్లో కూరుకుపోయి ఉన్నా.. నువ్వే నన్ను బయటకి తీసుకెళ్లే స్నేహితుడివి అవుతావు. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. థాంక్యూ నాన్న.
- తెలిసో, తెలియకో నువ్వు నా అనే ఉద్దేశంతోనో నిన్ను చాలాసార్లు హర్ట్ చేశాను. కానీ నువ్వంటూ లేకుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు నాన్న. నిన్ను బాధ పెట్టినందుకు సారీ. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
- నాన్నగా నువ్వు ఉన్నప్పుడు నాకు ఆ విలువ తెలియలేదు నాన్న. నువ్వు దూరమయ్యాకే ఆ విలువ నాకు తెలుస్తుంది. నాకోసం నువ్వు చేసిన అన్నింటికీ థ్యాంక్యూ నాన్న. మిస్ యూ.
- నేను తండ్రిగా మారాక తెలిస్తోంది. నాకోసం నువ్వు ఎన్ని త్యాగాలు చేశావో అని. ఇకపై నీకు కూడా నేను నాన్న అవుతానని ప్రామిస్ చేస్తూ.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.
మీరు వీటిని సోషల్ మీడియాలో స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. అయితే మీరు వీటిని ఓ చిన్న నోట్‌గా రాసి కూడా మీ నాన్నకు ఇవ్వొచ్చు. మీరు ఇప్పటికే ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేస్తే.. దానితో పాటు వీటిని రాసి ఇవ్వండి. ఆ విష్ మరింత స్పెషల్ అవుతుంది.






















