దాదాపు కూతుళ్లకు తండ్రే మొదటి హీరో. ఆమెకు అతనే బలం. అతనే రక్షణ. అతనే మొదటి ప్రేమ.

తండ్రితో ఎక్కువ మాట్లాడకపోయినా.. ఆయన ఉన్నాడనే ఫీలింగ్​ ధైర్యాన్ని ఇస్తుంది.

కూతురిలో తండ్రి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. ఆమెకు నచ్చిన, మెచ్చిన లైఫ్ ఇవ్వాలనుకుంటాడు.

తండ్రి, కూతురి మధ్య ప్రేమ స్వచ్ఛమైనది. నిస్వార్థమైనది. అదే ఇద్దరికి మధ్య మధురమైన బాండ్​కి కారణం.

ఎలాంటి సమస్య వచ్చిన తండ్రి ఓ కవచంలా, కూతురికి రక్షణగా నిలబడతాడు.

సైకిల్ తొక్కడం నేర్పించడం నుంచి.. మనసులోని నొప్పిని అధిగమించడంలో తండ్రి నేర్పే పాఠాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

వయసు ఎంత పెరిగినా.. కూతురు ఎప్పుడూ తండ్రికి చిన్న పిల్లనే. కూతురు తండ్రికి ఫ్యాన్​నే.

తండ్రి తన బాధ బయటకు చెప్పకపోయినా కూతురు అర్థం చేసుకుంటుంది.

వయసు పెరిగే కొద్ది ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో మన్సర్థలు వచ్చినా లోపల ప్రేమ అలాగే ఉంటుంది.

కూతురు తండ్రికి ఎప్పుడూ ప్రిన్సెస్​నే. తండ్రి కూతురుకి హీరోనే.