(Source: ECI | ABP NEWS)
Cyber Crime News : ఫేస్బుక్లో 1.5 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి.. ఆన్లైన్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Facebook Scam India : ఫేస్బుక్లో ఓ వ్యక్తి పాప్ అప్ క్లిక్ చేసి కోటి రూపాయాలకు పైగా పోగొట్టుకున్నాడు. మీరు అలాంటి స్కామ్ బారిన పడకూడదంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.

Facebook Scam : ఫేస్బుక్లో జరిగిన ఆన్లైన్ మోసానికి ఓ వ్యక్తి 1.5 కోట్లు కోల్పోయాడు. 64 ఏళ్ల రాజ్‌దీప్ సింగ్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఇన్వెస్ట్ పాప్-అప్ ద్వారా ఆన్‌లైన్ మోసానికి గురయ్యాడు. దాని ద్వారా 1.5 కోట్లు కోల్పోయాడు. హెచ్‌డీఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్(HDFC Securities fraud), అప్‌స్టాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Upstox scam) వంటి ప్రసిద్ధ సంస్థల ద్వారా అధిక రాబడిని అందిస్తామని.. తెలిపిన యాడ్పై సింగ్ క్లిక్ చేశాడు. ఈ ప్రకటన ద్వారా అతన్ని సైబర్ మోసగాళ్లు "బి-7 హెచ్‌డీఎఫ్‌సి మార్కెట్ నేవిగేషన్" అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ వాట్సాప్ గ్రూప్ను వృత్తిపరంగా ఉపయోగించే సెటప్గా క్రియేట్ చేశారు.
10,000 పెట్టుబడితో మొదలై..
మోసగాళ్లు నకిలీ సెబి సర్టిఫికెట్లు(Fake SEBI certificates), ఫోర్జరీ చేసిన గుర్తింపు కార్డులు ఈ స్కామ్కోసం ఉపయోగించారు. రాజ్‌దీప్ సింగ్ నమ్మకాన్ని పొందేందుకు కంపెనీ సీఈఓలుగా నటించారు. ముందుగా చిన్న మొత్తంతో స్కామ్ చేయడం ప్రారంభించారు. బాధితుడి నుంచి 10,000 పెట్టుబడి పెట్టించి అది రెట్టింపు అయినట్లు చూపించారు. దీంతో సింగ్కి నమ్మకం కుదిరింది. దీంతో ఇతర ఖాతాల్లో ఉన్న 71.34 లక్షలు ఓసారి.. 34.35 లక్షలు కలిపి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. ఎక్కువ అమోంట్ ఇన్వెస్ట్ చేసేసరికి డబ్బును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. అనంతరం అన్ని ఖాతాలను తీసేసి పరారయ్యారు. దీంతో ఆందోళన చెందిన సింగ్ పోలీసులను ఆశ్రయించాడు.
"వారు మొదట నాకు 10,000 పై రెట్టింపు రాబడిని చూపించారు. అందుకే నేను మరింత పెట్టుబడి పెట్టాను. కానీ చివరికి వారు నా డబ్బంతా తీసుకుని అదృశ్యమయ్యారు" అని సింగ్ వాపోయాడు.
సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా మోసాలు బాగా ఎక్కువ అవుతున్నాయని.. వీలైనంతవరకు మనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మీరు ఎంత తెలివైన వారు అయినా సరే.. ఆన్లైన్లో చేసే ఓ చిన్న జిమ్మిక్ మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలని పలు సూచనలు ఇచ్చారు.
ఆన్లైన్ మోసాలు నివారణ చిట్కాలు (Online Scam Prevention Tips)
సింగ్లా మోసపోకుండా ఉండాలంటే కొన్ని పాప్ అప్లను నమ్మకూడదు. కంపెనీ పేరు చూసి నమ్మడం.. వారు చూపించిన సర్టిఫికెట్స్ చూసి ఓకే చెప్పడం చేయకూడదన్నారు. తెలియని వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వకూడదని సూచిస్తున్నారు. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు అధికారిక వెబ్‌సైట్‌లు లేదా సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుల సూచనలు తీసుకోవాలి. అలాగే సోషల్ మీడియా ఖాతాలపై కాస్త క్లారిటీ ఉండాలి. బ్యాంకులు లేదా బ్రోకర్ల నుంచి డబ్బు, వస్తువులు వస్తున్నట్లుగా నమ్మించే మెసేజ్, కాల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు డౌట్ ఉంటే వెంటనే వాటిని కట్ చేసి.. బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే లింక్స్ లేదా తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ క్లిక్ చేయకూడదని చెప్తున్నారు.






















