అన్వేషించండి

Escalator Side Brushes : ఎస్కలేటర్ బ్రష్‌లు షూ క్లీనర్లు కాదు.. మీ ప్రాణాలు కాపాడేవే, తప్పుగా వాడితే మాత్రం ప్రమాదమే

Escalator Mistakes : ఎస్కలేటర్​పై ఉండే పసుపు బ్రష్‌లు షూ క్లీనర్స్ కాదు. మిమ్మల్ని ప్రమాదాలనుంచి కాపాడే రక్షకులు. కానీ వాటిని తప్పుగా వాడితే అవే ప్రమాదకరంగా మారతాయి. ఎందుకంటే.. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఎస్కలేటర్ బ్రష్‌లు: దుస్తులు, షూ లేసులు ఇరుక్కోకుండా నిరోధిస్తాయి.
  • షూ క్లీనర్లుగా వాడటం: ప్రమాదకరం, తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది.
  • ప్రమాద నివారణ: జాగ్రత్తగా ఉండండి, పిల్లలను దగ్గరగా పట్టుకోండి.
  • అదనపు జాగ్రత్తలు: హ్యాండ్‌రెయిల్ పట్టుకోండి, ఫోన్ వాడకం తగ్గించండి.

Escalator Safety Alert : మాల్స్, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు ఇలా ఎక్కడ చూసినా ఎస్కలేటర్లు కనిపిస్తాయి. రోజూ వేలాది మంది వాటిపై ప్రయాణిస్తారు. కానీ ఎస్కలేటర్ అంచున అడుగు భాగంలో ఉండే బ్రష్‌ లైన్ చూశారా? కచ్చితంగా చూసే ఉంటారు. ఎందుకంటే చాలా మంది వాటిని షూ క్లీనర్లుగా వాడేసుకుంటారు. కానీ అవి షూ క్లీనర్స్ కాదు. వాటికి దూరంగా ఉంటే ప్రాణాలు కాపాడుతాయి.. లేదు షూ క్లీన్ చేసుకుంటామంటూ ఆటలు ఆడితే.. ప్రాణాల మీదకి ప్రమాదం తెచ్చిపెడతాయి.

అసలు ఆ బ్రష్‌లు ఏంటి?

ఎస్కలేటర్ అడుగుభాగంలో ఉండే బ్రష్‌లను స్కర్ట్ డిఫ్లెక్టర్స్ (Skirt Deflectors) అంటారు. ఇవి ఎస్కలేటర్ సైడ్ ప్యానెల్​కు అమర్చి ఉంటాయి. 

వీటి పని ఏంటంటే.. 

బట్టలు, షూ లేసులు, స్కార్ఫ్‌లు లేదా బ్యాగ్ స్ట్రాప్‌లు ఎస్కలేటర్ సైడ్ ప్యానెల్, మూవింగ్ స్టెప్ మధ్యలో చిక్కుకోకుండా నిరోధించేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. అయితే మీరు ఆ బ్రష్‌లకు దగ్గరగా వెళ్లినప్పుడు లేదా తగిలినప్పుడు వెంటనే మీరు అలెర్ట్ అవ్వాలి. లేదంటే.. మీ డ్రెస్, షూ లేస్ ఒక్కసారి లోపలికి వెళ్తే అది చాలా వేగంగా లాగుతుంది. ఇలా జరిగితే మీ వేళ్లు, కాళ్లు, చేతులు తీవ్రంగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. 

షూ క్లీనర్లు 

చాలా మంది పిల్లలు, పెద్దలు వీటిని షూ క్లీనర్లుగా ఉపయోగిస్తారు. పైకి వెళ్లేప్పుడు, కిందకి వెళ్లేప్పుడు ఈ బ్రష్‌లపై షూ రుద్దుతారు. అలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. షూ లేస్ లేదా చెప్పు అంచు బ్రష్‌ల్లో చిక్కుకుంటుంది. అలా జరిగితే ఎస్కలేటర్ మూవింగ్ పార్ట్స్ వెంటనే దాన్ని లోపలికి లాగుతాయి. పిల్లల చిన్న వేళ్లు లేదా కాళ్లు కూడా సులభంగా ఆ గ్యాప్‌లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలెర్ట్​గా లేకుంటే ఒక్క సెకండ్‌లో తీవ్రమైన గాయాలు, ఎముకలు విరగడం, కొన్నిసార్లు వేళ్లు తెగిపోవడం జరుగుతుంది. 

ఎస్కలేటర్ ప్రమాదాలు జరగకుండా.. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది ఎస్కలేటర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు ఈ బ్రష్‌ల గురించి తెలియకపోవడం వల్లే జరుగుతున్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందుకే ఎస్కలేటర్‌పై వెళ్లేప్పుడు సురక్షితంగా ఉండటానికి కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎస్కలేటర్​ మీద వెళ్లేప్పుడు హ్యాండ్‌రెయిల్ గట్టిగా పట్టుకోండి. మధ్యలో ఉంటే మంచిది. మరీ సైడ్లకు వెళ్లకండి. పిల్లలను మీకు దగ్గరగా పట్టుకోండి. ఎస్కలేటర్ దిగే ముందే సిద్ధంగా ఉండండి. లేదంటే ఎండింగ్లో మీ షూ లేదా చెప్పు ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అలాగే బ్రష్‌లపై షూతో రుద్దకండి. షూ లేసులు సరిగా కట్టుకోకుండా ఎక్కకండి. స్కర్ట్‌లు, లూజ్ బట్టలు, లాంగ్ స్కార్ఫ్‌లు ఉంటే మరింత జాగ్రత్తగా ఎక్కాలి. ఫోన్ చూస్తూ ఎక్కకపోతే మంచిది. పిల్లలను ఒంటరిగా ఎస్కలేటర్ ఎక్కించకండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget