Palak Vada Recipe : చలికాలంలో పాలక్ వడలు.. క్రంచీగా, టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ
Palak Vada Making: మీకు వడలు అంటే ఇష్టమా? అయితే అది ఆయిల్ ఫుడ్‌ని ఆలోచిస్తున్నారా? దీనిలో కొంచెం పాలకూర వేస్తే.. టేస్ట్‌తో పాటు.. హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.
Healthy and Tasty Breakfast Recipe : ఇంట్లో వడ చేస్తే తినను అనేవారు అస్సలు ఉండరనే చెప్పాలి. నూనెతో తయారు చేసేదే అయినా దాని టేస్ట్, క్రంచీనెస్కి ఫిదా అవ్వాల్సిందే. నూనె తక్కువ పీల్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వడ వడ కరకరలాడేందుకు కూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటారు. అయితే ఈ వడల్లో హెల్త్ బెనిఫిట్స్ యాడ్ చేసేందుకు మీరు ప్రయత్నించారా? అయితే ఇప్పుడే మీరు వడల్లో పాలకూర వేసి కుక్ చేయండి. టేస్ట్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
చిన్న పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే పాలకూర వడల్లో మనం అల్లం, జీలకర్ర వంటి వాటిని కూడా వేస్తాము. ఇవి రుచిని అందించడమే కాకుండా.. చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. టేస్ట్‌తో పాటు.. హెల్త్ బెనిఫిట్స్ కోసం వీటిని వడల్లో కలిపి తీసుకుంటాము. ఈ పాలక్ వడలను ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ వడలకు కావాల్సిన పదార్థాలు
శెనగపప్పు - ఒకటిన్నర కప్పు (4 గంటల ముందు నానబెట్టుకోవాలి)
పాలకూర - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
మ్యాంగో పౌడర్ - అర టీస్పూన్ (వేసుకుంటే వడలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది)
ఉప్పు - తగినంత
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - డీప్ ఫ్రైకి తగినంత
తయారీ విధానం
ముందుగా ఓ గ్రైండర్ తీసుకుని దానిలో నానబెట్టిన శనగపప్పు వేసి.. చిక్కగా పేస్ట్ అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. నీరు ఎక్కువగా పోయకూడదు. పిండి కాస్త గట్టిగా ఉంటేనే వడలు బాగా వస్తాయి. అలా అని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వడలకు కరకరలాడే స్వభావాన్ని ఇస్తుంది. ఇప్పుడు దీనిని ఓ గిన్నెలో వేసి.. ముందుగా కడిగిపెట్టుకుని.. చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూర వేయాలి. అనంతరం జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కారం, మ్యాంగో పౌడర్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. పిండి కాస్త గట్టిగా ఉంటే కొంచెం నీటిని జల్లుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఓ ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి.
ఇప్పుడు ఫ్రై పాన్ తీసుకుని.. దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. అది వేడిగా అయిన తర్వాత దానిలో పిండిని వడలరూపంలో వేయండి. అవి ముదురు గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి. మిగిలిన మిశ్రమంతో కూడా సేమ్ ఇలాగే వడలు వేయించుకోండి. ఈ వేడి వేడి వడలను పుదీనా చట్నీతో, కొబ్బరి చట్నీతో కలిపి తీసుకోవచ్చు. ఏ చట్నీ లేకపోయినా.. మామాలుగానే తినేయొచ్చు. కొందరు టీ తాగుతూ ఈ వడలను లాగించేస్తారు.
చలికాలంలో ఉదయాన్నే ఏమైనా వేడిగా, కారంగా, క్రంచీగా తినాలనిపిస్తున్నప్పుడు మీరు వీటిని తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గానే కాకుండా.. సాయంత్ర స్నాక్స్‌గా కోసం కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. కొందరు అందరూ తిన్నాక మిగిలిపోయిన వడలతో కర్రీ కూడా చేసుకుంటారు. కాబట్టి పిండి ఎక్కువ ఉన్నా.. వడలు మిగిలినా కూడా పెద్ద సమస్య ఉండదు. కాబట్టి ఇంకేందుకు ఆలస్యం.. ఈ టేస్టీ, హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి.
Also Read : బరువును తగ్గించే ఈజీ రెసిపీ.. దీనికి ఆయిల్ అవసరమే లేదు