రోజుకు ఒక గుప్పెడు పిస్తా పప్పు తింటే మీ గుండె పదిలం
పిస్తా పప్పు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు పొందవచ్చు.
నట్స్ లో పిస్తా కూడా ఒకటి. ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా వీటిని తింటారు. ఈ చిన్న గింజలు రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతర గింజలతో పోల్చినప్పుడు ఆకుపచ్చ రంగులోని ఈ సూపర్ ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కార్నెల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉనే ఈ గింజలు తినడం వల్ల మంచి ఆరోగ్యం, బలమైన గుండె, ఆరోగ్యకరమైన రక్తనాళాలు, చురుకైన జీవనశైలికి మద్దతు ఇవ్వడంతో పాటు పోషకాహార సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
పోషకాలు మెండు
మెలటోనిన్, ఫైబర్, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేసే ఫైటో కెమికల్స్ వంటి పోషకాలు ఇందులో సమృద్దిగా ఉంటాయి. ప్రతి రోజు వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
పిస్తా వల్ల ప్రయోజనాలు
పిస్తా తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలో యాంటీఆక్సిడెంట్లను పెంచి ఆక్సిడైజ్డ్ LDL తగ్గిస్తుంది. రక్తంలో ఫైటోస్టెరాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ సమయంలో పేగుల్లోని కొలెస్ట్రాల్ శోషణ చేయడం ద్వారా శరీరం ఉత్పత్తి చేసే కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. రక్తపోటు, హృదయ స్పందన రేటు, పరిధీయ వాస్కులర్ ప్రతిస్పందనలను తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది.
BMCమెడిసన్ అధ్యయనం ప్రకారం పిస్తా తినడం వల్ల హృదయ ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుందని తేలింది. పిస్తాతో సహా ఇతర నట్స్ తినే వారికి గుండె మరణాల ప్రమాదాన్ని 39 శాతం తగ్గించుకోవచ్చు. సంతృప్త కొవ్వు, కొలెస్టరాల్ తక్కువగా ఉన్న ఆహారంలో భాగంగా పిస్తా పప్పులని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. వారానికి రెండు గుప్పిళ్ళ పిస్తా పప్పు తీసుకోవచ్చు.
మధుమేహులకి మంచిదే
రక్తంలో కొలెస్ట్రాల్ తో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. అందువల్ల మధుమేహులు వీటిని తినొచ్చు. జీవక్రియని మెరుగుపరుస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలని బలపరుస్తుంది. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది.
రోజుకి ఎన్ని తినాలి?
రోజుకి నాలుగు లేదా ఐదు పప్పుల వరకి తినవచ్చు. జ్ఞాపకశక్తిని మెరగుపరుస్తుంది. అలసటగా ఉన్నప్పుడు వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. జంక్ ఫుడ్ తినే డానికి బదులుగా సాయంత్రం వేళ ఈ పిస్తా పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. కొవ్వు తక్కువగా ఉండే పదార్థం. నట్స్ అనగానే జీడిపప్పు, వాల్ నట్స్, బాదం ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ పిస్తా చాలా తక్కువగా తింటారు. కానీ దీని వల్ల ఉన్న ప్రయోజనాలు గురించి తెలిసిన తర్వాత మాత్రం అసలు వదిలిపెట్టరు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: చలికాలంలో కూడా రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల్సిందేనా?