అన్వేషించండి

Iodine: అయోడిన్ సరిపడా తింటున్నారా? అది లోపిస్తే ఈ జబ్బు రావడం ఖాయం

అయోడిన్ మన శరీరానికి అత్యవసరమైన పోషకం.

మన శరీరానికి అత్యవసరమైన పోషకాలలో అయోడిన్ కూడా ఒకటి. మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్న స్థితి నుంచి జీవించి ఉన్నంతకాలం అయోడిన్ మన శరీరానికి అవసరపడుతూనే ఉంటుంది. మన ప్రతి దశలోనూ దానిది కీలక పాత్ర అనే చెప్పాలి. అయోడిన్ లోపిస్తే మాత్రం కొన్ని రకాల జబ్బులు రావడం ఖాయం. అందుకే ఉప్పుకు అదనంగా అయోడిన్‌ను కలిపి అయోడైజ్డ్ ఉప్పుగా బయట అమ్ముతున్నారు. అయోడిన్ మట్టిలోనూ, సముద్రాల్లోనూ సహజంగా లభిస్తుంది. దీన్ని ఉప్పులో కలిపి అమ్ముతుంటారు. ప్రపంచంలో ఎక్కువ భాగం అయోడిన్ మహాసముద్రాల్లోనే ఉందని చెబుతారు. 

ఇది మన శరీరానికి అత్యవసరమైనదని ముందే చెప్పుకున్నాం. మన మెదడు ఎదుగుదలకు, శ్వాస తీసుకోవడానికి, గుండె వేగం సమతుల్యంగా ఉండడానికి, జీర్ణక్రియ సవ్యంగా జరగడానికి, జీవక్రియలు మెరుగుపడడానికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండడానికి, మనం చురుగ్గా పనిచేయడానికి అయోడిన్ అవసరం పడుతుంది. ఈ పనులన్నీ చేసేది థైరాయిడ్ హార్మోన్. ఈ థైరాయిడ్ హార్మోన్ కి అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ లేకపోతే థైరాయిడ్ హార్మోన్లు తయారు కావు. థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి థైరాయిడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. అయోడిన్ లోపిస్తే మాత్రం థైరాయిడ్ గ్రంధి ఉబ్బిపోతుంది. దీన్నే గాయిటర్ అంటారు. మెడ కింద వాపులా కనిపిస్తుంది. అలా మెడి కింద వాపు ఉందంటే వారికి అయోడిన్ లోపించిందని అర్థం. కాబట్టి అయోడిన్ లోపించకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది.  మన శరీరంలో సెలీనియం, జింక్, రాగి, ఇనుము, విటమిన్ ఎ వంటివి లోపించినా కూడా అయోడిన్ పనితీరు శరీరంలో దెబ్బతింటుంది.

పిల్లల్లో కూడా అయోడిన్ లోపం కనిపిస్తూ ఉంటుంది. అలా అని వారికి ఉప్పును అధికంగా వేసి ఆహారం పెట్టకూడదు. అది మరింత ప్రమాదకరం. అయోడిన్ ఉన్న ఆహార పదార్థాలను తినిపించడం వల్ల వారు ఆ లోపం నుంచి బయటపడతారు. దీర్ఘకాలంగా శరీరంలో అయోడిన్ లోపిస్తే పిల్లల మెదడు ఎదుగుదల క్షీణిస్తుంది. అలాగే మహిళల్లో రొమ్ముల్లో గడ్డలు లాంటివి ఏర్పడతాయి. అవి నొప్పి కూడా పెడుతుంటాయి. అందుకే సమతుల ఆహారం తీసుకుంటూ అయోడిన్ అందేలా చూడాలి. ఉప్పును అయోడిన్ కోసం అధికంగా తినడం మంచి పద్ధతి కాదు. ఇతర ఆహారాల్లో కూడా అయోడిన్ లభిస్తుంది. వాటిని తింటూ ఉంటే అయోడిన్ లోపాన్ని త్వరగా అధిగమించవచ్చు.  ప్రతి రోజూ అయోడిన్ ఉన్న ఆహారాలను కనీసం రెండయినా తినాలి. దీని వల్ల తగినంత అయోడిన్ శరీరానికి అందుతుంంది.

Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం తినాలో చెబుతున్న హార్వర్డ్ అధ్యయనం

Also read: ఎర్ర బెండకాయలు కనిపిస్తే కచ్చితంగా కొనండి, వీటిలో ఎన్నో పోషక విలువలు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

టాప్ హెడ్ లైన్స్

Doppelgangers : మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా? పరిశోధనలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇవే
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Mbappe Vs Messi Golden Boot War: మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
మెస్సితో ఎంబాప్పే మైండ్ బ్లోయింగ్ ఈక్వల్ ఫైట్.. పరాగ్వేపై పగ తీర్చుకుంటూ క్వార్టర్స్ లోకి ఫ్రాన్స్, రొనాల్డో ఫ్లాప్ షో!
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Face Packs for Glowing Skin : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి
Embed widget