అన్వేషించండి

Raw Garlic: చలి చంపేస్తోంది కదూ, పచ్చి వెల్లులి తినాల్సిందే - ఎందుకంటే?

Raw Garlic: చలికాలంలో వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడుతుంది. చలికాలంలో రోజూ పచ్చి వెల్లుల్లి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Raw Garlic health benefits: చలికాలం ఎన్నో వ్యాధులు మోసుకువస్తుంది. అందుకే ఈ కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతాకాలంలో వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో పోరాడటంతోపాటు వాటిని నివారించడానికి వెల్లులి ఎంతో సహాయపడుతుంది.

⦿ చలికాలంలో రోజుకో పచ్చి వెల్లుల్లి రెబ్బను తిన్నట్లయితే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందట. అంతేకాదు అనేక వ్యాధులకు ఇది చెక్ పెడుతుంది.

⦿ వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

⦿ వెల్లుల్లిని తినడం వల్ల శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. అవి కణాలు దెబ్బతినుకుండా రక్షిస్తాయి.

⦿ రక్తాన్ని పలుచగా చేసి ధమనులను ఆరోగ్యంగా ఉంచేందుకు వెల్లులి సహకరిస్తుంది.

⦿ వెల్లుల్లిలో అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో సహాయపడతాయి.

⦿ వెల్లుల్లిలోని విటమిన్లు బి6, విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

⦿ వ్యాధుల బారినపడినప్పుడు వేగంగా రికవరీ చేయడానికి వెల్లులి సహకరిస్తుంది.

⦿ వెల్లుల్లిలో అల్లైల్ సల్ఫైడ్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంతోపాటు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

⦿ వెల్లుల్లి బెల్లీ ప్యాట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

⦿ వెల్లుల్లి మన శరీరానికి అవసరం లేని కేలరీలను బర్న్ చేస్తుంది.

⦿ వెల్లుల్లిలోని ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. ఇది మన ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువగా తినలేరు.

⦿ బరువు తగ్గాలని అనుకొనేవారు పచ్చి వెల్లుల్లిని ఉదయం పరగడుపు తినాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

⦿ వెల్లుల్లిలోని అల్లిసిన్ ఉంటుంది. ఇది బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. చలికాలంలో వేధించే ముక్కు దిబ్బడ‌ను తగ్గిస్తుంది.

⦿ దగ్గు, జలుబుకు కారణమయ్యే కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది.

⦿ రోజువారీ భోజనంలో కొద్ది మొత్తంలో పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం వల్ల వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు.

అతిగా వద్దు

మోతాదుకు మించి వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకున్నట్లయితే.. గుండెల్లో మంట, నోటి చికాకు, ఉబ్బరం, వికారం, అతిసారం లేదా తేలికపాటి వాంతులు వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లిని రోజూ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరం నుంచి  దుర్వాసన వస్తుంది.

కొంతమందిలో గొంతులో మంట, చికాకు, సెన్సిటివ్ చర్మం ఉన్నవారిలో చర్మం దద్దుర్లు వంటి దుష్ప్రబావాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ మందులు వాడేవారు వెల్లుల్లిని తీసుకునేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మందులు వాడుతున్నవారు ప్రతిరోజూ పచ్చి వెల్లుల్లి తింటే అవాంఛనీయ ప్రభావాలకు దారి తీస్తుంది. కాబట్టి వెల్లుల్లిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read : చలికాలంలో సన్​షైన్​ విటమిన్ చాలా అవసరమట.. ఎందుకంటే..

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP :  నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
నిద్రావస్థలోనే తెలంగాణ బీజేపీ - సభ్యత్వాలూ అంతంతమాత్రమే - నేతల్ని నడ్డా దారికి తేగలరా ? '
Leopard In Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
తిరుమలలో మరోసారి చిరుత కలకలం, మెట్టు మార్గంలో చూసినట్లు చెబుతున్న భక్తులు
KTR: కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
కాళేశ్వరానికి 80వేల కోట్లంటే గగ్గోలు పెట్టారు, మూసీకి రూ.1.50లక్షల కోట్లా ?: కేటీఆర్‌
Rakul Preet Singh : సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
సమంత డ్రెస్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకుందా? IIFA అవార్డ్స్​లో ఆమెని చూశారా?
Second Moon: భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
భూమికి నేటి నుంచి రెండో చంద్రోదయం, 56 రోజుల పాటు అతిథిగా ఉండనున్న మరో చందమామ
Ashu Reddy : కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
కాఫీ కలర్ డ్రెస్​లో కలర్​ఫుల్​గా ముస్తాబైన అషూ రెడ్డి.. Just You and I అంటోన్న హాట్ బ్యూటీ
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు
Embed widget