Ants Weight in Earth: ఈ భూమ్మీద ఎన్ని చీమలు ఉన్నాయి? వాటి మొత్తం బరువు ఎంతో మీకు తెలుసా !
భూమ్మీద జీవించే చిన్న జీవులు చీమలు. వాటి గురించి తాజాగా సరికొత్త విషయం తెలిసింది. వాటి సంఖ్య, బరువు సహా పలు విషయాలను ఓ నివేదిక వెల్లడించింది.
మనం నిత్యం చీమలను చూస్తూ ఉంటాం. ఇంటి లోపల, బయట, ఇక్కడ, అక్కడ అని కాదు.. ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. విచిత్రం ఏంటంటే, ఈ చీమల గురించి మనం పెద్దగా పట్టించుకోం. మన ఇంట్లో ఆహార పదార్థాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. వాటిని రాకుండా చేసేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అంతే. కష్టపడే తత్వాన్ని చీమల నుంచి నేర్చుకోవాలని సైతం పెద్దలు చెబుతుంటారు. చీమలపై సైతం నిత్యం ఏదో ఓ చోట పరిశోధనలు జరుగుతుంటాయి. తాజాగా జరిపిన రీసెర్చ్ లో చీమల సంఖ్య, వాటి బరువు లాంటి వివరాలు తెలుకునేందుకు ఆసక్తి పెరుగుతోంది.
చీమలపై పరిశోధనలో ఆశ్చర్యకర విషయాలు
కొన్ని సార్లు ఓ ప్రశ్న చాలా మంది మదిలోకి వస్తుంది. ఈ భూమ్మీద మొత్తం ఎన్ని చీమలు ఉంటాయి? అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. తాజాగా సమాధానం లభించింది. తొలిసారిగా ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS)’ అనే వెబ్ సైట్ చీమల మీద సమగ్ర పరిశోధన చేసింది. ఈ భూగ్రహం మీద ఎన్ని చీమలు ఉన్నాయి? వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? అనే అంశాలన్నింటిపైనా లోతైన అధ్యయనం నిర్వహించింది. ఈ పరిశోధనలో ఎన్నో ఆశ్చర్యకర విషయాలు వెల్లడి అయ్యాయి.
భూమ్మీద ఎన్ని చీమలు ఉన్నాయి? వాటి బరువు ఎంత?
మనం నివసించే భూగ్రహం మీద సుమారు 20 క్వాడ్రిలియన్ చీమలను కలిగి ఉన్నట్లు వెల్లడించింది తాజా పరిశోధన నివేదిక. దాన్ని సంఖ్యగా రాస్తే ఇలా ఉంటుందని వెల్లడించింది(20,000,000,000,000,000). 20 క్వాడ్రిలియన్ అంటే 20 వేల మిలియన్లు అని అర్థం. ఇక చీమల పుట్టక ఎప్పుడు జరిగిందో కూడా ఈ నివేదిక తెలిపింది. చీమలు క్రెటేషియస్ కాలంలో వెస్పాయిడ్ కందిరీగ పూర్వీకుల నుంచి ఉద్భవించిన యూసోషియల్ కీటకాలుగా వెల్లడించింది ఈ ప్రపంచంలో మొత్తం 15,000 జాతులు ఉన్నట్లు తెలిపింది. వీటిలో 13, 800 వర్గాలు ఉన్నట్లు వెల్లడించింది. వీటిలో చాలా వరకు శాస్త్రవేత్తలు పేరు పెట్టనివే ఉన్నాయి.
భూమ్మీద ఉన్న అన్ని చీమలను పొడి చేస్తే సుమారు 12 మిలియన్ టన్నుల బరువు ఉంటుందని వెల్లడించింది. చీమల మొత్తం బరువు ప్రపంచంలోని అన్ని క్షీరదాలు, పక్షుల ద్రవ్యరాశిని మించి ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఇది మానవుల మొత్తం బరువులో ఐదవ వంతుకు సమానంగా వెల్లడించింది.
ప్రపంచాని నడిపించే చిన్న జీవులు చీమలు- ఎడ్వర్డ్ ఓ విల్సన్
“చీమలు ప్రపంచాన్ని నడిపించే చిన్న జీవులు” అని అని ప్రముఖ జీవశాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఓ విల్సన్ తెలిపారు. చీమలు పెద్ద సంఖ్యలో ఉండటం వల్ల సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషస్తున్నట్లు తెలిపారు. అందుకే, ఇవి ఆహార గొలుసులో అత్యంత కీలకంగా ఉన్నాయి. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) యొక్క ప్రొసీడింగ్స్ ప్రచురించిన పరిశోధనలో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిర్వహించిన చీమల జనాభాపై 489 అధ్యయనాల విశ్లేషణ ఉంది.