By: ABP Desam | Updated at : 16 Jan 2023 03:17 PM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
చలికాలంలో చెవులు మూసుకుపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. జలుబు, దగ్గు, ముక్కు గొంతు నొప్పి వల్ల ఇలా జరుగుతుంది. చెవులు మూసుకుపోవడంతో పాటు ఒళ్ళు నొప్పులు, జ్వరంగా కూడా అనిపిస్తుంది. చెవి నొప్పి అసలు తట్టుకోలేరు. దంతాలు పుచ్చిపోయినప్పుడు కూడా చెవి నొప్పిగా అనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల చెవి దాని చుట్టు పక్కల ప్రదేశం అంతా నొప్పిగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
చెవుల్లోని యూస్టాచియన్ ట్యూబ్ గొంతు, ముక్కు వెనుకకు కలుపుతుంది. జలుబు చేసినప్పుడు ముక్కులోని శ్లేష్మం ఈ ట్యూబ్ లో ఏర్పడటం మొదలవుతుంది. దాని వల్ల నొప్పి, అసౌకర్యంగా అనిపిస్తుంది. చలికాలంలో నొప్పి సాధారణ సమస్యగా ఉంటుంది. కాసేపటికి తగ్గిపోతుంది. కానీ దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదించాలి. అది అంటువ్యాధులని కలిగిస్తుంది.
చెవి మధ్యలో వచ్చే ఇన్ఫెక్షన్ ని ఇన్ఫెక్షియస్ ఓటిటిస్ మీడియా అని అంటారు. జలుబు, ఫ్లూ కారణంగా వచ్చే మరొక సమస్య. ముక్కు, గొంతులోని వైరస్ యూస్టాచియన్ ట్యూబ్ ద్వారా చెవిలోకి వెళ్తుంది. వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది వాపు, చెవి ఎర్రగా మారడం, చెవులు మూసుకుపోవడం, వినికిడి తగ్గిస్తుంది. ఒక్కోసారి జ్వరం కూడా వస్తుంది.
సైనస్ లు తల, నుదురు, ముక్కు, బుగ్గలు, కళ్ళు వెనుక ఉంటాయి. ఆరోగ్యకరమైన సైనస్ లో ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు. జలుబు లేదా ఫ్లూ వచ్చినప్పుడు సైనస్ బ్లాక్ అయిపోతాయి. దాని వల్ల వినికిడి సమస్యలు కలుగుతాయి. సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల చెవిలో చాలా ఒత్తిడిగా అనిపిస్తుంది. నొప్పి కలుగుతుంది. తలనొప్పి, పంటి నొప్పు, దగ్గు, వాసన కోల్పోవడం, నోటి దుర్వాసన, జ్వరం వంటి వాటికి కూడా దారితీస్తుంది.
ముక్కు స్ప్రే
ముక్కులో స్ప్రే చేసుకోవడం వల్ల రిలీఫ్ పొందవచ్చు. ఇవి మార్కెట్ లో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇవి మరింత ప్రభావవంతంగా ఉంటాయి.
ఆవిరి పట్టడం
బ్లాక్ అయిన చెవులని తెరిచేందుకు అత్యంత సౌకర్యవంతమైన మార్గాలలో ఇది ఒకటి. చెవి మీద వెచ్చని కంప్రెస్ ని ఉంచుకోవచ్చు. వేడి నీళ్ళతో స్నానం చేయడం మంచిది. చెవి లోపలికి వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
లవంగాల నూనె
లవంగాల నూనె చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి బయటపడొచ్చు. ఒక టీ స్పూన్ నువ్వుల నూనెలో ఒక లవంగం వేసి కాసేపు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత నూనె ఫిల్టర్ చేసి చెవిలో ఒకటి లేదా రెండు చుక్కలు వేసుకోవాలి. యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పీల్చుకోవచ్చు. ఇవి చెవి, సైనస్ భాగాలని క్లియర్ చేస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మానిక్యూర్ వల్ల గోరు క్యాన్సర్- యూఎస్ మహిళకి వింత అనుభవం!
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Tips for Good Sleep: మీకు మంచిగా నిద్రపట్టాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి చాలు!
Water for Hydration: శరీరం డీహైడ్రేట్కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి
Prediabetes: ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఏం తినాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?