అన్వేషించండి

Skin Cancer: మానిక్యూర్ వల్ల గోరు క్యాన్సర్- యూఎస్ మహిళకి వింత అనుభవం!

చర్మ క్యాన్సర్ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ మహిళకి మాత్రం చాలా అరుదుగా చేతి గోరులో వచ్చింది.

అందం విషయంలో ఆడవాళ్ళు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మొహం దగ్గర నుంచి కాలి వేళ్ళ వరకు అందంగా ఉండేందుకు బ్యూటీపార్లర్ కి వెళ్ళి ఫేషియల్స్, పెడిక్యూర్, మానిక్యూర్ అని తీసుకుంటారు. ఇక్కడ కూడా ఒక మహిళ అదే విధంగా చేసింది. కానీ అదే తనని క్యాన్సర్ బారిన పడేలా చేసింది. అసలేం జరిగిందంటే..

యూఎస్ కి చెందిన గ్రేస్ గార్సియా తన చేతులకి మానిక్యూర్ చేయించుకునేందుకు పార్లర్ కి వెళ్ళింది. గోర్లు శుభ్రంగా చేసేందుకు నిర్వహించిన క్లీనింగ్ సెషన్ కాస్త నొప్పిగా అనిపించింది. కానీ సెషన్ పూర్తి చేసిన తర్వాత తన క్యూటికల్స్ లో కొద్దిగా నొప్పి మంటగా అనిపించింది. కొన్ని రోజులకి గోర్లు దగ్గర చిన్న పుండు రావడం గమనించింది. కుడి వేలుకి అయిన తన గాయం మూడు నెలలు అయినా కూడా నయం కాలేదు. దీంతో అనుమానం వచ్చిన గ్రేస్ చర్మవ్యాధి నిపుణులని కలిసింది. గాయపడిన వేలిని బయాప్సీ చేశారు. పరీక్షల్లో ఆమెకు పొలుసుల కణ క్యాన్సర్ ఉన్నట్లు నిర్దారణ అయ్యింది. ఇది చర్మ క్యాన్సర్ నాన్ మెలనోమా రూపం.

హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందని వైద్యులు ఆమెకి చెప్పారు. చేతుల అందం కోసం తను చేయించుకున్న మానిక్యూర్ కారణంగా క్యాన్సర్ అభివృద్ధి చెందిందని డాక్టర్ వెల్లడించారు. హెచ్ పివి వల్ల వచ్చే గోరు క్యాన్సర్ చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చర్మ క్యాన్సర్ లక్షణాలు ఏంటి?

ప్రపంచంలోని అత్యంత సాధారణ క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ ఒకటి. నాన్ మెలనోమా రకం క్యాన్సర్ చర్మం పై పొరల్లో నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. దీని లక్షణాలు

చర్మంపై రంగు మారిన పాచ్ లు ఏర్పడటం

పుండ్లు ఏర్పడి కొన్ని నెలల పాటు ఉంటాయి, కాలక్రమేణా ఎక్కువ అవుతాయి

చర్మం మీద ఎరుపు, గట్టిగా ఉండే ముద్దలు లేదా పొక్కులు ఏర్పడటం  

చర్మం పొలుసులుగా ఉండటం

చర్మ క్యాన్సర్ ఎక్కడైనా ఏర్పడుతుంది. గోర్ల మీద వచ్చే క్యాన్సర్ చాలా అరుదు. మెలనోమాలు గోళ్ళ కింద నల్లటి మచ్చలు లేదా గీతలుగా కనిపిస్తాయి. గోరుపై గోధుమ రంగు గీతలు ఉంటాయి. గోరు చుట్టు ఉన్న చర్మం కూడా ముదురు రంగులోకి మారిపోతుంది. పుట్టుమచ్చల్లో మార్పులు రావడం, చర్మం పదే పదే దురద పెట్టడం, పొలుసులుగా చర్మం ఉండటం కూడా చర్మ క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే వీటికి కూడా చికిత్స ఉంటుంది. క్యాన్సర్ రకాన్ని బట్టి చికిత్స చేయడం జరుగుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: తొక్కే కదా అని పడేస్తున్నారా? నిమ్మతొక్క వల్ల లాభాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget