News
News
వీడియోలు ఆటలు
X

Blood Cancer: భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఇవే, ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు

భయంకరమైన రోగాల్లో బ్లడ్ క్యాన్సర్ ఒకటి. ఇది వచ్చిందంటే వైద్య ఖర్చుకి వెనుకాడి చాలా మంది చికిత్స తీసుకోవడం ఆలస్యం చేయడం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

FOLLOW US: 
Share:

లుకేమియా దీన్నే బ్లడ్ క్యాన్సర్ అని పిలుస్తారు. ఎముక మజ్జ, శోషరస వ్యవస్థతో సహా శరీరంలోని రక్తంలో ఏర్పడే కణజాలాల క్యాన్సర్. దీనికి వివిధ రూపాలు ఉన్నాయి. ఇందులో అత్యంత సాధారణ రకం తీవ్రమైన లింఫోసైటిక్ లుకేమియా. బ్లడ్ క్యాన్సర్ కేసులు నెమ్మదిగా పెరిగిపోతూ ఉన్నాయి. లుకేమియా సాధారణంగా తెల్ల రక్త కణాళ్ళు పని చేయకపోవడాన్ని కలిగి ఉంటుంది.

బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణమేంటి?

తెల్ల రక్తకణాలు శక్తివంతమైన ఇన్ఫెక్షన్ ఫైటర్స్. అవి సాధారణంగా పెరుగుతాయి. శరీరానికి అవసరమైన విధంగా మారతాయి. కానీ లుకేమియా ఉన్న రోగులలో ఎముక మజ్జలవ అధిక మొత్తంలో తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అవి సరిగ్గా పని చెయ్యవు. తక్కువ వ్యవధిలో అభివృద్ధి చెందే తీవ్రమైన లుకేమియా పిల్లల్లో కనిపించే అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ క్యాన్సర్ లక్షణాలు మారుతూ ఉంటాయి.

లుకేమియా లక్షణాలు

⦿ తరచుగా తీవ్రమైన ఇన్ఫెక్షన్, యాంటీ బయాటిక్స్ తీసుకున్నప్పటికీ ఆరోగ్యం బాగోలేకపోవడం జరుగుతుంది. తరచుగా జ్వరంగా అనిపించడం బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.

⦿ లుకేమియా మరొక సంకేతం ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండానే మైకం, బలహీనత, అలసటగా అనిపిస్తుంది.

⦿ శోషరస గ్రంథులు ఉబ్బినట్లయితే అది కూడా ఒక లక్షణంగా పరిగణించాలి.

⦿ ప్లీహం లేదా కాలేయం పెరగడం కూడా లుకేమియాకి ప్రమాద కారకంగా మారుతుంది.

⦿ ఆకస్మిక గాయాలు లేదా చర్మంలో చిన్న ఎర్రటి మచ్చలు కనిపించడం, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు రక్త క్యాన్సర్ ప్రారంభానికి సంకేతాలు.

⦿ అకస్మాత్తుగా అధిక బరువు కోల్పోవడం అనారోగ్యానికి సంకేతం. బరువులో మార్పు వస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పీడియాట్రిక్ అంకాలజిస్ట్ ద్వారా బ్లడ్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. దీన్ని చాలా వరకు నయం చేయగలదు. చికిత్సకు 95 శాతానికి పైగా చికిత్సకు స్పందిస్తారు.

బ్లడ్ క్యాన్సర్ వస్తే చాలా మంది ప్రాణాల మీద ఆశలు వదిలేసుకుంటారు. అందుకు కారణం దీనికి చికిత్స కాస్త ఖర్చుతో కూడుకున్నది. మన దేశంలో ఏటా దాదాపు 40 వేల నుంచి 50 వేల మంది బ్లడ్ క్యాన్సర్, లింఫోమా క్యాన్సర్  బారిన పడుతున్నారు. ప్రస్తుతం దీనికి చికిత్స విదేశాల్లో లభిస్తుంది. లుకేమియా రెండు రకాలు. అక్యూట్ లుకేమియా, క్రానిక్ లుకేమియా. అక్యూట్ ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. కీమోథెరపీ ద్వారా కొన్ని నెలల పాటు చికిత్స అందిస్తారు.

క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది. పొగాకు, ధూమపానం వంటి అలవాట్లు వల్ల అక్యూట్ లుకేమియా అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. ఎముక మజ్జ బయాప్సీ చేయడం, రక్త పరీక్ష ద్వారా లుకేమియా వ్యాధిని గుర్తించవచ్చు. క్యాన్సర్ దశను బట్టి వైద్య నిపుణులు చికిత్స చేస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: ఫ్యాటీ లివర్ డీసీజ్‌ని నయం చేసే ఆయుర్వేద టీ- ఎలా తయారు చేయాలంటే

Published at : 09 May 2023 06:00 AM (IST) Tags: Cancer blood cancer Blood Cancer Symptoms Blood Cancer Signs

సంబంధిత కథనాలు

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Weight Loss: డయాబెటిస్ బాధితులూ బరువు తగ్గాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించి చూడండి

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

Jamun Seeds: ఈ పండు విత్తనాలతో చేసిన పొడి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

ఈ మూడు చిట్కాలు పాటిస్తే మీ మెదడు ఎప్పటికీ యంగ్‌గానే ఉంటుందట!

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

Cracked Heels: పాదాలు పగిలి అసహ్యంగా ఉన్నాయా? ఈ చిట్కాలు మీకోసమే

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!