అన్వేషించండి

Saffron Water: ఉదయాన్నే కాఫీ, టీ కాకుండా ఇవి కలిపిన నీళ్లు తాగండి - అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చు

ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన, గొప్ప ఔషధ గుణాలు ఉన్న కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

ప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్స్, ట్రిక్స్ వస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని చాలా ప్రయోజనాలు అందిస్తే మరికొన్ని మాత్రం ప్రమాదకరంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ, టీకి బదులుగా కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మహిళలకి ఇది చాలా మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఆ ప్రయోజనాలేమిటో చూసేయండి మరి. 

మెరిసే చర్మం: గర్భిణీలు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలు తెల్లగా పుడతారని అంటుంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇక్కడ కుంకుమ పువ్వు నీళ్ళు తాగిన తర్వాత చర్మానికి ఆరోగ్యం లభించడంతోపాటు మంచి మెరుపు వస్తుందట. 

కెఫీన్ కంటే మెరుగే: ఉదయం టీ, కాఫీ తాగనిదే కొంతమందికి తెల్లారదు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్ళు కెఫీన్ కి బానిసలుగా మారారనే. కానీ కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల కెఫీన్ వల్ల పొందే ప్రయోజనాల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చట. ఒకటి లేదా రెండు కప్పులు కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జుట్టు బాగుంది: జుట్టు రాలడం అందరికీ పెద్ద సమస్యగా మారింది. ఈ నీళ్ళు తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గిందని, మెరుగ్గా, ఆకృతి కూడా బాగున్నట్టు వీడియోలో పేర్కొన్నారు.

పీరియడ్స్ నొప్పి నివారణ: కుంకుమ పువ్వు నీళ్ళు తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అడ్డుకుంటుంది.

కుంకుమ పువ్వు నీళ్ళు ఎలా తయారు చేయాలి?

  • కుంకుమపువ్వు- 5,6 రేకులు
  • దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క  
  • యాలకులు- రెండు
  • బాదం- 4 లేదా 5
  • తేనె

తయారీ విధానం

దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, యాలకులు నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు తక్కువ మంట మీద మరిగించాలి. వేడి నీటిలో తేనె కలపడం వల్ల విషపూరితం అవుతుంది. అందుకే కొద్దిగా చల్లబడిన తర్వాత వాటిని వడకట్టి అందులో తేనె కలుపుకోవచ్చు. చివరగా బాదం పప్పు పొడి వేసుకుని తాగాలి.

కుంకుమపువ్వు నీళ్ళు తాగడం వల్ల చర్మం మెరిసిపోతుందని పోషకాహార నిపుణులు కూడా చెప్పుకొచ్చారు. మొటిమలు లేని మెరిసే చర్మాన్ని ఇచ్చే అద్భుతమైన రెమిడీ ఇది. శరీరంలో కొవ్వు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. పీసీఓఎస్ సమస్య ఉన్న మహిళలు తరచూ ఈ నీళ్ళు తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రమంగా వస్తాయి.

నెయ్యి లేదా పాలతో కలిపి తీసుకున్నప్పుడు రక్తపోటుని తగ్గిస్తుంది. మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. శక్తివంతమైన యాంటీ డిప్రెసెంట్‌ గా పని చేస్తుంది. 6-8 వారాల పాటు ఈ నీటిని తాగడం వల్ల మొత్తం ఆరోగ్యం మంచిగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: మాస్క్ పెట్టకపోతే మెదడు మటాష్ - ఆ ఒమిక్రాన్ వేరియెంట్‌తో ఆ ముప్పు తప్పదా? ఏది నిజం?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
Embed widget