అన్వేషించండి

Cancer: వెన్నునొప్పి వస్తే తేలికగా తీసుకోవద్దు, అది ఈ మూడు క్యాన్సర్ల లక్షణం కావచ్చు

Cancer: రకరకాల క్యాన్సర్లు మనిషిపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్నాయి.

Cancer: చాలా మందిని వెన్నునొప్పి వేధిస్తుంది, దీన్ని సాధారణ నడుము నొప్పిగా పరిగణించి పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ లక్షణంగా మారవచ్చు. ఏది ఏ నొప్పో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వెన్నునొప్పి దీర్ఘకాలంగా వేధిస్తుంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వెన్నునొప్పితో పాటూ కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు.  వెన్నునొప్పి మూడు రకాల క్యాన్సర్లకు సంకేతంగా భావించవచ్చు. ఈ మూడు క్యాన్సర్లకు నడుము నొప్పి కూడా ఒక ప్రధాన లక్షణమే. 

మూత్రాశయ క్యాన్సర్
మూత్రాశయం మీ  పొత్తికడుపులో మూత్రాన్ని నిల్వ చేసే అవయవం. నడుము నొప్పి మూత్రాశయ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. మూత్రాశయంలోని లోతైన కణజాలంపై కణితులు పెరిగి క్యాన్సర్ గా మారతాయి. ముఖ్యంగా వెనుకవైపు దిగువన వచ్చే వెన్నునొప్పి మూత్రాశయ క్యాన్సర్ కొత్త లక్షణంగా గుర్తించారు. 

వెన్నెముక క్యాన్సర్
 వెన్నెముక  క్యాన్సర్‌కు కూడా వెన్నునొప్పికి కారణం కావచ్చు. అయితే ఇది చాలా అరుదుగా వస్తుంవి. వెన్నెముకపై వచ్చిన కణితుల వల్ల నొప్పి నిరంతరంగా వస్తుంది. అయితే ఇది శరీరభాగాలకు వ్యాప్తి చెందదు.వెన్నునొప్పి అనేది వెన్నెముక క్యాన్సర్‌కు ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఈ నొప్పి తీవ్రంగా మారి కాళ్లు, చేతులు, ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి సందర్భంలో కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.  

ఊపిరితిత్తుల క్యాన్సర్
వెన్నునొప్పి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణం కూడా .మీరు వెన్నునొప్పితో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే జాగ్రత్త పడాలి. రెండు రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 

ఈ లక్షణాలు కూడా కనిపిస్తే
వెన్నునొప్పితో పాటూ ఈ లక్షణాలు కూడా కనిపిస్తే చాలా జాగ్రత్త పడాలి. 
- మూత్రాశయ క్యాన్సర్ వల్ల వెన్నునొప్పితో పాటూ తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం పడడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి ఉంటాయి.

-వెన్నెముక క్యాన్సర్ సంకేతాలలో వెన్నునొప్పితో పాటూ  తిమ్మిరి, బలహీనత, చేతులు,కాళ్ళలో సమన్వయ లోపం, పక్షవాతం కూడా కనిపిస్తాయి.

- ఇక ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో దగ్గినప్పుడు రక్తం పడడం, శ్వాస ఆడకపోవడం, దీర్ఘకాలంగా ఉండే దగ్గు కూడా కనిపిస్తాయి.

Also read: పెళ్లయిన తొలిరాత్రి భార్యాభర్తలు పాలు తాగడం వెనుక అసలు లాజిక్ ఇదే

Also read: మీ ముఖంలో ఈ మార్పులు వచ్చాయా? థైరాయిడ్ ఏమో చెక్ చేసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

House Cleaning Tips: ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
ఇల్లు తుడిచినా సువాసన రావడం లేదా నీళ్ల బకెట్‌లో ఇది కలిపి చూడండి, రోజంతా రీఫ్రెష్
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!
Indoor Pure Air Tips: ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!
ఇంట్లో గాలి ఫ్రెష్‌గా మార్చేసే మొక్కలు ఇవే! 5 ఇండోర్ ప్లాంట్స్‌తో అందం ఆక్సిజన్!

వీడియోలు

FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?
IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి
National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2
Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై ! పీర్జాదిగూడలో సంచలనం
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Embed widget