అన్వేషించండి

Methi: మెంతి ఆకులను తక్కువగా చూడొద్దు, శీతాకాలంలో తినాల్సిందే

Methi: మెంతాకు తినే వారి సంఖ్య తక్కువే. ఎప్పుడో గాని తినేందుకు ఇష్టపడరు.

Methi: చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరానికి ఉష్ణోగ్రత అందించే ఆహారాన్ని తింటూ ఉండాలి. అలా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే ఆహారాల్లో మెంతి ఆకు కూడా ఒకటి. ఎంతోమంది మెంతాకు తినడానికి ఇష్టపడరు. ఒకవేళ తిన్నా కూడా నెలకి ఒకటో రెండో సార్లు తింటారు. కానీ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచాలంటే  మెంతాకును వారానికి కనీసం మూడు నాలుగు సార్లు తినాలి. మెంతికూరతో ఎన్నో టేస్టీ వంటకాలు వండుకోవచ్చు. కాబట్టి మెంతి ఆకును తినేందుకు ప్రయత్నించండి.

చలికాలంలో ప్రతి ఒక్కరి రోగ నిరోధక శక్తి బలహీన పడుతుంది. శరీరంలో వెచ్చదనం తగ్గిపోవడం కూడా రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణంగా చెబుతారు. మెంతికూరను తినడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి కావాల్సిన ఉష్ణోగ్రతను మెంతి ఆకు అందిస్తుంది. ఈ ఆకులను తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి తరచూ దాడి చేయకుండా ఉంటాయి. ఈ మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్లు, వైరస్ బారిన పడకుండా కాపాడతాయి. 

చలికాలంలో జీర్ణవ్యవస్థ బలహీనంగా పనిచేస్తుంది. జీవక్రియ రేటు తక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు బలాన్ని అందించడంలో మెంతాకు మొదటి స్థానంలో ఉంటుంది. జీవ క్రియల రేటును పెంచుతుంది. అజీర్తి వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. మధుమేహం ఉన్నవారు మెంతికూరను కచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. మహిళలు కూడా మెంతాకు తినడం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్  పెట్టొచ్చు. మెంతులతో టీ చేసుకుని తాగితే హార్మోన్ల అసమతుల్యత రాకుండా ఉంటాయి. పురుషులు మెంతాకును తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఎలాంటి లైంగిక సమస్యలు రావు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మెంతికూరతో ఏం వండుకోవాలి అని ఆలోచించొద్దు. పప్పు మెంతాకు, ఆలు మెంతికూర, మెంతాకు రైస్ ఇవన్నీ కూడా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయి ఇవన్నీ.  మెంతాకులను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మెంతులను మట్టిలో వేస్తే చాలు మెంతి మొక్కలు మొలుస్తాయి. వాటిని తాజాగా వండుకుంటే రుచి కూడా అదిరిపోతుంది.. వీటిని పెంచడం కూడా చాలా సులువు.

Also read: ఎక్కువ స్క్రీన్ టైమ్ మీ పిల్లల ఆలోచనా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget