అన్వేషించండి

International Yoga Day 2024: యోగాకు ఆ పేరు ఎలా వచ్చింది? దీన్ని ప్రారంభించింది ఎవరు? ఈ రోజే Yoga Day ఎందుకు నిర్వహిస్తారు?

International Yoga Day 2024: యోగా అంటే శరీరాన్ని అటు ఇటు మెలిపెట్టే కార్యక్రమం కాదు. శరీరాన్ని ఇష్టమైన రీతిలో తప్పడం అస్సలే కాదు. తలక్రిందులుగా ఉండడం కానేకాదు. మరి యోగా అంటే ఏమిటి? తెలుసుకుందాం.

International Yoga Day 2024: ఏటా జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేను జరుపుకుంటారు. దీనికి కారణం ఈరోజు ఉత్తరార్థగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండటంతో ఈ రోజును యోగా డేగా జరుపుకోవడం 2015 జూన్ 21నుంచి షురూ అయ్యింది. ఇంద్రియాలను వశపరుచుకుని, చిత్తముని ఈశ్వరుడి మీదకు మళ్లించడమే యోగా. ఇలా ఏకాగ్రత సాధించి పరమార్థ తత్వమునకు వెళ్లడమే యోగ. యోగా అంటే సాధనా అని అర్థం. యోగాలో చాలా ఆసనాలు, సాధనాలు ఉన్నాయి. వీటన్నింటినీ చేసేటప్పుడు పాటించే ఏకైక సూత్రం శ్వాస క్రియపై ధ్యాస ఉంచడం. ఇలా చేస్తే శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరం అవుతాయి. శరీరంలో హార్మోన్స్ విడుదలై శరీరంతో పాటు మనస్సు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి. 

2024వ సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్.. మహిళా సాధికారత కోసం యోగా. ఇది మహిళల శారీరక, మానసిక శ్రేయస్సును పెంచాలనే లక్ష్యంతో ఈ థీమ్‌ను ఎంచుకున్నారు.

చరిత్ర:

యోగా పుట్టింది ఇండియాలోనే. సెప్టెంబర్ 2014లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రజారోగ్యానికి అత్యంత అవసరమైన యోగాను అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేయాలని ప్రతిపాదించారు. UNGA 69వ సెషన్లో ప్రధాని ప్రసంగిస్తూ.. యోగా మన ప్రాచీన సంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని చెప్పారు. మనస్సు, శరీరం, ఆలోచన, కార్యాచరణల ఐక్యతను యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అనేది ఒక సంపూర్ణ జీవన విధానం. మన ఆరోగ్యానికి, మన శ్రేయస్సుకు యోగా చాలా అవసరమని నొక్కి చెప్పారు. అప్పటి నుంచి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం ప్రతిపాదనను దాదాపు 175 సభ్య దేశాలను ఆమోదించాయి.

ప్రాముఖ్యత:

యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, దీన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చెప్పడమే ఈ అంతర్జీతయ యోగా దినోత్సవం ఉద్దేశం. యోగా శారీరక శక్తిని, మనసుకు ప్రశాంతతను రేకెత్తించే స్థానాలపై ఉంది. ఒకప్పుడు యోగాలో ఫిట్‌నెస్‌కు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. యోగాకు బదులుగా మానసిక స్పష్టతను పెంపొందించడం, ఆధ్యాత్మిక శక్తిని మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఉండేది. కానీ, దానివల్ల కలిగే సత్ఫలితాలను చూసి.. ఫిట్‌నెస్‌లో యోగాను భాగం చేశారు.

‘యోగా’ అంటే అర్థం ఏమిటీ? దీనికి మూలం ఎవరు?

యోగా అనే పదం సంస్కృత నుంచి పుట్టింది. వాస్తవానికి యోగాను అప్పట్లో ‘యుజ్’ అనేవారు. అది క్రమేనా యోగాగా మారింది. ‘యుజ్’ అంటే ఏకం చేయడం లేదా ఒక దగ్గరకు చేర్చడం అని అర్థం. అంటే మనసు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం. యోగాను ఆ సాక్షాత్తు ఆ ఆదియోగి (శివుడు) ప్రారంభించారని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. ఏది ఏమైనా యోగా ఒక మంచి వ్యాయామం. బరువులు ఎత్తక్కర్లేదు.. పరుగులు పెట్టక్కర్లేదు. వివిధ సులవైన ఆసనాలతో ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి, ఈ రోజే మీరూ ప్రయత్నంచండి.

ఇది కూడా చదవండి:  వ్యాయామం ఉదయాన్నే చెయ్యాలా ఏంటీ? కొత్త అధ్యయనంలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడి

టాప్ హెడ్ లైన్స్

Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
Bigger Thighs : తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు
తొడల సైజ్‌కు ఆయుష్షుకు సంబంధం ఉందా? లావుగా ఉంటే ఎక్కువకాలం బతుకుతారా? అధ్యయనంలో కీలక విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget