అన్వేషించండి

Health Tips : స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం ఇంత ప్రమాదకరమా? బరువు పెరగడానికి ఇదీ ఓ కారణమా?

Sleep After Bath : స్నానం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు మీకు ఉందా... వెంటనే మానేయండి లేకుంటే మీరు బరువు పెరగొచ్చు. లేదా మీ జుట్టు ఊడిపోవచ్చు.

Sleep After Bath:  రాత్రి వేళల్లో స్నానం చేయలేదంటే నిద్రపోని వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారందరికీ ఇదో హెచ్చరిక. అలా చేయడం వల్ల ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు. నిద్రకు ఉపక్రమించే ముందు స్నానం చేస్తే మెదడుపై దుష్ప్రభావం పడుతుందని ఆందోళన, డిప్రెషన్‌కు కారణమవుతాయని చెబుతున్నాయి. 

చాలా మంది స్నానం చేసిన వెంటనే నిద్రపోతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. కానీ సైన్స్‌ మాత్రం అది ఎంత మాత్రం మంచిది కాదను హెచ్చరిస్తోంది. ఇది మెదడుపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. మెదడుకు సంబంధించిన అనేక సమస్యలకు కారణం అవుతుందని అంటున్నారు. 

చాలా మందికి రాత్రిపూట స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇది అంత మంచి అలవాటు కాదని పరిశోధనలు చెబుతున్న సత్యం. వాస్తవానికి రాత్రి వేళ్లలో మన శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీన్ని మెదడు గ్రహించి బాడీకి రెస్ట్ కావాలనే సంకేతాలు ఇస్తుంది. నిద్ర పోవాలనే సూచన చేస్తుంది. 

ఇలా నిద్రపోవాలని మెదడు సిగ్నల్ ఇస్తున్న టైంలో మీరు స్నానం చేస్తే మాత్రం బాడీలోని టెంపరేచర్ ఒక్కసారిగా పెరుగుతుంది. దీంతో మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. ఒక వేళ నిజంగానే మీకు నిద్ర పట్టినా మెదడుకు మాత్రం రెస్ట్ దొరకదు. 

స్నానం చేసిన తర్వాత నిద్రపోవడం వల్ల శారీరకంగా చాలా అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కొందరు తలస్నానం చేసిన వెంటనే నిద్రపోతుంటారు. ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివి పూర్తిగా మానుకోవాలని సూచిస్తున్నారు. 

స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? 

1. జుట్టు సంబంధిత సమస్యలు

స్నానం చేసిన తర్వాత తడి వెంట్రుకలతో నిద్రించడం వల్ల దిండు లేదా మంచం మీద బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల స్కాల్ప్ దెబ్బతింటుంది, జుట్టు చిట్లడం సమస్య పెరుగుతుంది. జుట్టులో చుండ్రు వస్తుంది.

2. కళ్లలో దురద సమస్య 

వేడి నీళ్లతో నిరంతరం స్నానం చేయడం వల్ల కళ్లలో తేమ తగ్గుతుంది. దీని వల్ల కళ్లు ఎర్రగా మారుతాయి. దురద సమస్య మొదలవుతుంది. దీని కారణంగా అనేక ఇతర కంటి సంబంధిత సమస్యలు కూడా రావచ్చును. 

3. నిద్ర లేమి

రాత్రిపూట స్నానం చేయడం వల్ల మీ నిద్ర చెడి పోతుంది. దీని వల్ల పగటి అలసట పెరుగుతుంది. బాడీ రెస్ట్ కోరుకుంటుంది. నిద్ర సరిగా పట్టకపోవడంతో అనేక ఇతర సమస్యలు వస్తాయి. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ పెరగవచ్చు.

4. బరువు పెరగవచ్చు
రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల బరువు పెరగుతారు. ఇది ఫిట్‌నెస్‌ను పోగొడుతుంది. దీంతో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని అటాక్ చేస్తాయి. పెరుగుతున్న ఊబకాయంతో మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

5. కీళ్ల నొప్పులు, కండరాల తిమ్మిరి 
రాత్రిపూట స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, నడవడం కష్టమవుతుంది. రాత్రిపూట ఆలస్యంగా స్నానం చేయడం వల్ల కండరాలు తిమ్మిరి ఎక్కే ప్రమాదం ఉంటుంది. 

హెచ్చరిక: వార్తలలో ఇచ్చిన కొంత సమాచారం మీడియా నివేదికల ఆధారంగా ఉంటుంది. ఏదైనా సూచనను అమలు చేయడానికి ముందు, మీరు తప్పనిసరిగా సంబంధిత నిపుణులను సంప్రదించాలి.

Also Read: మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల పెరుగుతోన్న మరణాలు.. లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget