Summer Tips: వేసవిలో పదే పదే స్నానం చేస్తున్నారా? అయితే, డేంజర్‌లో పడినట్లే.. ఎందుకంటే?
Health Watch: వేసవిలో తరచుగా స్నానం చేస్తే అనారోగ్యం బారినపడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకసారి కంటే ఎక్కువ స్నానం చేస్తే మన శరీరం ఇన్ఫెక్షన్లకు గురవుతుందని చెబుతున్నారు.
Summer Bathing Tips: వేసవికాలం వచ్చిదంటే చాలు..చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లు.. ఏసీలను ఆశ్రయిస్తుంటారు. కొందరైతే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పదే పదే స్నానం చేస్తుంటారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు స్నానం చేయడం సహజం. కొంతమంది వేడిని తట్టుకోలేక రోజుకు నాలుగైదు సార్లు కూడా స్నానం చేస్తారు. కానీ రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు స్నానం చేయడం ఎంతవరకు సురక్షితం? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? స్నానం చేయడం అనేది వ్యక్తిగత పరిశ్రభ్రతలో చాలా ముఖ్యమైంది. క్రమం తప్పకుండా స్నానం చేయాలి. నిజానికి స్నానం అనేది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా కాపాడుతుంది. అయితే వేసవి కాలంలో వేడి గాలుల బారి నుంచి బయటపడేందుకు తరచుగా స్నానం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. తరచుగా స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం.
ఒకటి కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తే?
వేసవిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు స్నానం చేస్తే చర్మానికి సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. రోజుకు 1 లేదా 2 సార్లు స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రోజులో చాలా సార్లు స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్ తగ్గుముఖం పడుతుంది. దీంతో చర్మం పొడిబారడం, చికాకు, దద్దుర్లు, దురద వంటి ఇన్ఫెక్షన్లకు గురువుతుంది. అందుకే రోజుకు ఒకసారి మాత్రమే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మం గరకుగా లేదా పొడిబారటం:
ఒకసారి కంటే ఎక్కువసార్లు స్నానం చేసినట్లయితే చర్మం గరకుగా లేదా పొడిగా మారుతుంది. దీంతో బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాహ్య బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లి చర్మ వ్యాధులకు కారణం అవుతుంది. అందుకే స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజ్ చేయమని వైద్యులు చెబుతుంటారు.
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుంది:
మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి, మన ఇమ్యూనిటీ వ్యవస్థకు సరైన మొత్తంలో సాధారణ బ్యాక్టీరియ అవసరం అవుతుంది. అందుకే చిన్న పిల్లలకు రోజూ స్నానం చేయించకూడదని వైద్యులు చెబుతుంటారు. తరచుగా స్నానం చేయడం వల్ల మన ఇమ్యూనిటీ సక్రమంగా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
మంచి బ్యాక్టీరియాకు నష్టం:
తరచుగా స్నానం చేయడం వల్ల మంచి బ్యాక్టీరియా.. అంటే చర్మంపై ఉండాల్సిన బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. అందువల్ల, కొన్నిసార్లు ఎక్కువ స్నానం చేయడం హానికరంగా మారుతుంది. స్నానం చేసేటప్పుడు మీరు ఉపయోగించే సబ్బు లేదా షాంపు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను నాశనం చేస్తాయి. ఇది చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు.
చర్మ సమస్యలు ఉన్నవారు:
ముఖ్యంగా చర్మ సమస్యలు ఉన్నవారు 5 నిమిషాల్లో స్నానం పూర్తి చేయాలి. ముఖ్యంగా అలాంటి సమస్యలున్నవారు 1 నిమిషం కంటే ఎక్కువగా షవర్ కింద ఉండకూడదు. ఇలా చేయడం వల్ల మీ చర్మం, జుట్టు రెండింటికి హాని కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : ఈ పనులు రోజూ చేస్తున్నారా? అయితే మీ కిడ్నీలు హాంఫట్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.