Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని తమకి నచ్చినప్పుడు చాలా మంది పిల్లల్ని కంటున్నారు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తను తల్లి కావడం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన అండాలను భద్రపరుచుకుంది. తన తల్లి గైనకాలజిస్ట్ మధు చోప్రా సలహా మేరకు అలా చేశానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. నా కెరీర్ లో ఒక నిర్ధిష్ట స్థానానికి చేరుకోవాలని అనుకున్నా. అందుకే అమ్మ చెప్పినట్టుగా ముప్పై ఏళ్ల వయసులో అండాలు ఫ్రీజ్ చేయించాను. అలా చేయడం వల్ల చాలా స్వేచ్చగా అనిపించింది. ఆ స్వేచ్చతోనే కెరీర్ లో అనుకున్న లక్ష్యాలను సాధించగలిగాను” అని ప్రియాంక చెప్పుకొచ్చింది. 2022లో సరోగసీ ద్వారా మాల్తీ మేరీకి ప్రియాంక తల్లి అయ్యింది. సరోగసీ మదర్ ని తాను చూడలేదని చెప్పారు.
ఇప్పుడు ఎక్కువ మంది స్టార్స్ అనుసరిస్తున్న పద్ధతి సరోగసీ. ప్రియాంక చోప్రా తర్వాత లేడి సూపర్ స్టార్ నయనతార, విగ్నేష్ దంపతులు కూడా సరోగసీ ద్వారానే కవలలకు జన్మనిచ్చారు. ఎగ్ ఫ్రీజింగ్ చేయించి తమకు నచ్చినప్పుడు బిడ్డలను కనేలా ఇది సహాయపడుతుంది. ఇదొక శాస్త్రీయ ప్రక్రియ. అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అండాలను ఎన్ని సంవత్సరాలైనా ఎటువంటి నష్టం కలగకుండా భద్రపరుచుకోవచ్చు.
ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి?
అండాలను గుడ్డు అని కూడా అంటారు. ఇది పక క్రియోప్రెజర్వేషన్ అని పిలిచే శాస్త్రీయ ప్రక్రియ. ప్రతి ఆడపిల్ల పుట్టుకతోనే కొన్ని లక్షల అపరిపక్వ అండాలతో పుడుతుంది. పన్నెండేళ్ళు దాటిన తర్వాత గుడ్డు విడుదల అవుతుంది. దీన్నే అండోత్సర్గం అంటారు. 18-30 ఏళ్ల మధ్యలో విడుదలయ్యే అండాలు నాణ్యంగా ఉంటాయి. అటువంటి సమయంలో పిల్లలని కనొచ్చు. 30 తర్వాత విడుదలయ్యే అండాలు బలహీనంగా మారతాయి. అందుకో 30 ఏళ్ల లోపు పిల్లల్ని కనాలని పెద్దలు చెప్తారు.
ఈ ఫ్రీజింగ్ పద్ధతిలో భాగంగా అండాలను తీసి జాగ్రత్తగా నిల్వ చేస్తారు. మహిళల అండాలను భధ్రపరిచే విధంగా మగవారి స్పెర్మ్ కూడా ఫ్రీజింగ్ చేయవచ్చు. వీటిని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు కనడానికి ఉపయోగించుకుంటారు. స్త్రీ అండాలను బయటకి తీసి విట్రిఫికేషన్( ఫ్లాష్ ఫ్రీజింగ్) అనే ఆధునాటన ఫ్రీజింగ్ టెక్నిక్ ని ఉపయోగించి -196 సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద క్రియో ప్రెజర్డ్ చేస్తారు. అలా వాటిని ఫ్రీజింగ్ చేసి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు. అప్పటి వరకు వాటిని ద్రవ నైట్రోజన్ లో భద్రపరుస్తారు. ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న పద్ధతి. అయితే ఇలా పిల్లల్ని కనడం వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే