అన్వేషించండి

Vitamin A: విటమిన్ A లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

శరీరానికి అత్యవసరమైన విటమిన్ A. ఇది లోపిస్తే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.

శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో విటమిన్ A ఒకటి. ప్రధాన అవయవాలకు విటమిన్ A చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే శరీర ఆరోగ్యం కుంటుపడుతుంది. విటమిన్ A లోపిస్తే కంటి నుండి చర్మం వరకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం విటమిన్ A లోపం వల్ల బాల్యంలో అంటువ్యాధులు సోకి మరణాలు సంభవించే అవకాశం ఉంది. అందుకే విటమిన్ A లోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.  మన శరీరంలో కణాల పెరుగుదలకు, రోగ నిరోధక శక్తికి, చర్మం, ఊపిరితిత్తులు, పేగులు, మూత్రశయం వంటి వాటిపై ఉపరితల కణజాలాలను ఏర్పరచడానికి విటమిన్ A చాలా అవసరం. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, బాలింతలు విటమిన్ A లోపానికి గురయ్యే అవకాశం ఎక్కువ. దీనివల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.  కాబట్టి విటమిన్ A లోపం రాకుండా చూసుకోవాలి. ఈ లోపం ఏర్పడినప్పుడు కొన్ని రకాల లక్షణాలను మన శరీరం బయటపెడుతుంది. 

చర్మం పొడిబారడం 
చర్మ కణాలను రిపేర్ చేయడానికి విటమిన్ A చాలా ముఖ్యమైనది. ఇది ఇన్ఫ్లమేషన్ నుండి రక్షణ కల్పిస్తుంది. చర్మం పొడి బారడం, తామర, దురదలు, చర్మం ఎర్రబడడం వంటివన్నీ విటమిన్ A లోపాన్ని సూచిస్తాయి. 

కళ్ళు పొడిబారడం 
విటమిన్ A లోపానికి చికిత్స చేయడం ద్వారా అనేక కంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.  విటమిన్ A లోపిస్తే కళ్ళు కన్నీళ్లను ఉత్పత్తి చేయలేవు. దీని కారణంగా పొడిగా మారుతాయి.  రేచీకటి వచ్చే అవకాశం కూడా ఎక్కువ.

పునరుత్పత్తి వ్యవస్థ
విటమిన్ A లోపం వల్ల గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. లేదా గర్భం దాల్చిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిండం అభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుంది. పుట్టే బిడ్డలు లోపాలతో జన్మించే అవకాశం ఉంది. 

పిల్లల్లో ఎదుగుదల 
విటమిన్ A అనేది మన శరీర ఎదుగుదలకు అతి ముఖ్యమైనది. ఈ విటమిన్ లోపిస్తే ఎదుగుదల కుంటుపడుతుంది. పిల్లల్లో అనేక రకాల సమస్యలు వస్తాయి.

ఇన్ఫెక్షన్లు
విటమిన్ A లోపించడం వల్ల పిల్లల్లో గొంతు,  ఛాతి ఇన్ఫెక్షన్లు వస్తాయి. వారు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శిశువుల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది.

గాయాలకు...
శరీరానికి గాయం తగిలితే అది త్వరగా తగ్గాలంటే విటమిన్ A చాలా అవసరం. గాయాన్ని నయం చేసే దశల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ A వల్ల శరీరంలో ఎపిథిలియల్ ఉత్పత్తి అవుతుంది. ఇది గాయాన్ని నయం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే విటమిన్ A ఆరోగ్యకరమైన చర్మం విషయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొలాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడుతుంది. 

Also read: ఇన్ఫ్లూయేంజా వల్ల జలుబు, జ్వరంతో బాధపడుతున్నారా? ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ డైట్ లో చేర్చుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget