Health Tips : డయాబెటిస్‌కు, నిద్రకు లింకేమిటీ? మీ టైమింగ్ ఇలా ఉంటే డేంజరే!
తక్కువ నిద్రపోతున్నారా? మీకు త్వరలోనే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు తక్కువ సమయం నిద్రపోతే డయాబెటిస్ రోగులకు రక్తంలో షుగర్ లెవెల్ మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
మనిషి జీవిత చక్రంలో నిద్ర అనేది అత్యవసరమైన ప్రక్రియ. నిద్రలేమి డయాబెటిస్ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. తగినంత నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. మీ ఆరోగ్యానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యం.
నిద్రలేమి వల్ల మీ శరీరంపై ఒత్తిడిని పెరుగుతుంది. దీని కారణంగా, కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి అవడం ప్రారంభమవుతుంది. కార్టిసాల్ హార్మోన్ చాలా ప్రమాదకరమైంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఒక అధ్యయనం ప్రకారం, మధుమేహం ఉన్న వ్యక్తులు రోజుకు ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రకారం, టైప్ 2 డయాబెటిస్ ఉన్న 10 మంది రోగులలో 7 మంది అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో బాధపడుతున్నారు. మెడ భాగంలో కొవ్వు అధికంగా పెరగడం వల్ల ఇది జరుగుతుంది. దీని కారణంగా, నిద్రలో శ్వాస ఆడక పోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. నిద్రలో శ్వాస అందకపోవడంతో శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ సరఫరా సైతం ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మీరు నిద్ర నుంచి లేచే పరిస్థితి ఏర్పడుతుంది. స్లీప్ అప్నియా లక్షణాల్లో ముఖ్యంగా శ్వాస ఆడకపోవడము, చిరాకు, ఉదయం తలనొప్పి వంటి లక్షణాలు ఉన్నాయి.
రక్తంలో చక్కెర అదుపులో ఉంచుకోవాలి:
మీ బ్లడ్ షుగర్ ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు, మీరు రాత్రి నిద్రించడానికి ఇబ్బంది పడవచ్చు. మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మీరు తగినంత నిద్ర పోవచ్చు.
ఉదయం నిద్రపోవద్దు:
మధుమేహం ఉన్నవారిలో నిద్రలేమి, అధిక నిద్ర సమస్య రెండూ ఎక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు పగటిపూట నిద్రపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం , అయితే రాత్రి తగినంత నిద్ర పోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
నిద్ర షెడ్యూల్‌ను రూపొందించండి:
నాణ్యమైన నిద్ర కోసం స్థిరమైన నిద్రవేళల్లో మేల్కొనడం అవసరం. దీన్ని వారంలో ఏడు రోజులు పాటించాలి. స్థిరమైన నిద్ర షెడ్యూల్ మీ శరీరం స్థిరంగా పని చేయడానికి సహాయపడుతుంది.
మద్యం సేవించవద్దు:
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. మద్యం సేవించిన తర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నట్లు చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది జరగదు, మద్యం మీ మనస్సును గందరగోళానికి గురి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచడానికి కూడా పనిచేస్తుంది.
వ్యాయామం చేయండి:
వ్యాయామం చేస్తే రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది. కనీసం 10 నిమిషాల పాటు ఏరోబిక్ వ్యాయామం చేయడం ద్వారా మీరు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. వ్యాయామం మీ శరీరంలో అంతర్గత ఉష్ణోగ్రతను పెంచుతుంది, తద్వారా మీకు మంచి నిద్ర వస్తుంది. అదనంగా, వ్యాయామం చేయడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మీ ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
Also Read : చలికాలంలో కీరదోస కాయ తినాలట - ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.