Vertigo vs Blackouts : తల తిరుగుతోందా? కళ్లు చీకట్లు కమ్ముతున్నాయా? ఈ లక్షణాలతో జాగ్రత్త, స్ట్రోక్ కావచ్చు
Dizziness, Blackouts and Sudden Confusion : అకస్మాత్తుగా తలతిరగడం, కళ్లు మసకబారుతున్నట్లు కావడం జరుగుతుందా? అయితే వాటితో పాటు ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త.

- తల తిరగడం, చూపు మారడం నాడీ వ్యవస్థ సమస్యలకు సంకేతాలు.
- మాట తడబడి, ముఖం వాలి, నడవలేకపోతే వెంటనే వైద్యులను సంప్రదించండి.
- స్పృహ కోల్పోవడం, బలహీనత స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలకు చిహ్నం.
Warning Signs of Stroke : తల తిరగడం, కళ్లు చీకట్లు కమ్మినట్లు అనిపించడం, ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం వంటి లక్షణాలను చాలామంది అలసట లేదా బలహీనతగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇవి నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సంకేతాలు కావచ్చని చెప్తున్నారు వైద్యులు. ముఖ్యంగా ఈ లక్షణాలతో పాటు మాట తడబడటం, చూపు మారడం, నడవలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలంటున్నాపు.
తల తిరిగినప్పుడు ఏ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.. ఏ సంకేతాలు లైట్ తీసుకోకూడదో వివరించి తెలిపారు. డాక్టర్ మోహన్ కృష్ణ. హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్లో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా చేస్తోన్న డాక్టర్ మోహన్ కృష్ణ జొన్నలగడ్డ తల తిరగడం, బ్లాక్ అవుట్స్ గురించి అనేక విషయాలు తెలిపారు. అలాగే కొన్ని లక్షణాలు లైట్ తీసుకోవద్దని సూచించారు. అవేంటో చూసేద్దాం.
Also Read : శిశువుల్లో ఫిట్స్ గుర్తించడం ఎలా? ఈ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు
తల తిరగడం
తల తిరగడం అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా అనిపించవచ్చు. కొందరికి కళ్లు తిరుగుతున్నట్లు, మరికొందరికి చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరగిరా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంకొందరికి నిలబడినప్పుడు తూలుతున్నట్లు, బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు ఉంటుంది. అయితే ఈ లక్షణాలన్నింటికీ ఒకే కారణం ఉండకపోవచ్చని చెప్తున్నారు.
అకస్మాత్తుగా తల తిరగడంతో పాటు ఇతర నాడీ సంబంధిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదట. ఎందుకంటే ఈ లక్షణాలు స్ట్రోక్ వంటి ఎమెర్జెన్సీ పరిస్థితులకు కారణం కావచ్చు.
చేయి, కాలు బలహీనపడటం : శరీరంలో ఒకవైపు అకస్మాత్తుగా తిమ్మిరి రావడం, చేయి లేదా కాలు సరిగ్గా కదలకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
మాట్లాడటంలో ఇబ్బంది : మాట స్పష్టంగా రాకపోవడం, ఎదుటివారు చెప్పేది అర్థం చేసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
చూపులో మార్పులు : అకస్మాత్తుగా రెండుగా కనిపించడం, చూపు మసకబారడం లేదా చూపులో ఇతర మార్పులు రావడం హెచ్చరిక సంకేతాలు కావచ్చు.
నడవలేకపోవడం : నడుస్తున్నప్పుడు శరీరం ఒకవైపునకు ఒరిగిపోవడం, బ్యాలెన్స్ కోల్పోవడం లేదా సరిగ్గా నడవలేకపోవడం కనిపించవచ్చు.
ముఖం వాలిపోవడం : నవ్వినప్పుడు ముఖం ఒకవైపు వాలిపోవడం లేదా ముఖంలోని ఒక భాగాన్ని సరిగ్గా కదిలించలేకపోవడం గమనించవచ్చు.
తీవ్రమైన తలనొప్పి : ఇంతకుముందెన్నడూ లేనంత తీవ్రంగా, అకస్మాత్తుగా తలనొప్పి రావడం కూడా ప్రమాద సంకేతం కావచ్చు.
గందరగోళం : చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం, ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడం లేదా స్పందనలో మార్పులు కనిపించడం వంటివి ఉండవచ్చు.
ఈ లక్షణాలు స్ట్రోక్ లేదా ట్రాన్సియెంట్ ఇస్కీమిక్ అటాక్ (TIA) వంటి సమస్యలతో సంబంధం కలిగి ఉండవచ్చు. TIAను కొన్నిసార్లు మినీ స్ట్రోక్ అని కూడా అంటారు. లక్షణాలు కొద్దిసేపటికి తగ్గిపోయినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
Also Read : స్ట్రోక్ ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు? 5 ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఇవే
బ్లాక్‌అవుట్స్
కళ్లు చీకట్లు కమ్మినట్లు అనిపించడం, స్పృహ కోల్పోవడం లేదా కొద్దిసేపు పరిసరాలపై అవగాహన లేకుండా ఉండటాన్ని చాలామంది తల తిరగడంగానే భావిస్తారు. కానీ వెర్టిగోకు, బ్లాక్‌అవుట్‌కు మధ్య తేడా ఉంటుంది.
నిర్లక్ష్యం చేయకండి
అకస్మాత్తుగా అయోమయానికి గురవడం, తెలిసిన విషయాలను గుర్తించలేకపోవడం, ప్రశ్నలకు సరిగ్గా స్పందించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని సాధారణ అలసటగా భావించకూడదు. ముఖ్యంగా వీటితో పాటు తల తిరగడం, నడవడంలో ఇబ్బంది, మాట లేదా చూపులో మార్పులు కనిపిస్తే అత్యవసరంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
Also Read : బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఎవరికి ఎక్కువ? FAST టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే ప్రాణం కాపాడొచ్చు.. లేకుంటే అంతే
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలంటే..
తల తిరగడంతో పాటు శరీరంలో ఒకవైపు బలహీనత, మాట తడబడటం, ముఖం వాలిపోవడం, అకస్మాత్తుగా చూపు మారడం, తీవ్రమైన సమతుల్యత లోపం లేదా గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. లక్షణాలు తగ్గిపోయినా
వాయిదా వేయకండి..
వైద్యులు రోగి లక్షణాలు, వైద్య చరిత్ర ఆధారంగా న్యూరలాజికల్ పరీక్షలు నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి మెదడుకు సంబంధించిన ఇమేజింగ్ పరీక్షలు, గుండె పనితీరును పరిశీలించే పరీక్షలు చేయించమని సూచించవచ్చు. వీటి ద్వారా లక్షణాలకు అసలు కారణాన్ని గుర్తించి తగిన చికిత్స అందించవచ్చు.
Also Read : స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి సెకన్ విలువైనదే.. ఏమి చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























