Eye Health : కళ్లల్లో వచ్చే ఈ మార్పులు గుండె సమస్యలకు సంకేతాలు.. కంటి పరీక్షలతో స్ట్రోక్, మరెన్నో ప్రమాదాలు గుర్తించవచ్చట
Eyes Indicating Heart Problems : పక్షవాతం ప్రమాదాన్ని, గుండె సమస్యలను కళ్ల ద్వారా గుర్తించవచ్చట. ఛాతీ నొప్పి, అధిక రక్తపోటు వంటివి కూడా తెలిసిపోతాయట. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం.

Eyes Indicating Health Problems : గుండె సమస్యలు అంటే కేవలం ఛాతీ నొప్పి ద్వారా మాత్రమే తెలియవు. దానికి బదులుగా, గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులలో నొప్పి, అలసట వంటి వాటి ద్వారా హార్ట్ సమస్యలును ఇండికేట్ చేస్తాయి. అయితే మీకు తెలుసా? గుండె జబ్బుల ప్రారంభ లక్షణాలు కళ్లల్లో కూడా కనిపిస్తాయట. కంటి రెటీనా శరీరంలోని వాస్కులర్ వ్యవస్థ స్థితిని ప్రతిబింబిస్తుందని చెప్తున్నారు నిపుణులు. అందువల్ల కంటికి సంబంధించిన కొన్ని సమస్యలను చూసి.. నేత్ర వైద్యులు తరచుగా గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా అర్థం చేసుకోగలరట.
కళ్లు సున్నితంగా ఉంటాయి కాబట్టే
గుండె జబ్బులు తరచుగా ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా నెమ్మదిగా ప్రారంభమవుతాయి. కంటి రక్తనాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. కాబట్టి శరీరంలోని ఇతర భాగాల కంటే ముందుగా అవే దెబ్బతినవచ్చు. ఆ సమయంలో కంటి రక్తనాళాలు కుంచించుకుపోవడం, ముడుచుకోవడం, రెటీనా నిర్మాణంలో మార్పులు వంటివి గుర్తిస్తే మీరు మరిన్ని పరీక్షల కోసం ఐ చెకప్, వైద్యులను సంప్రదిస్తే మంచిది.
గుండెపోటు మాత్రమే కాదు
టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు వంటి సమస్యలు కనిపించే ముందే.. గుండె సమస్య ఉందని కళ్లు చెప్పగలవట. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీకి చెందిన రెటీనా నిపుణుడు డాక్టర్ జోసెఫ్ నెజ్గోడా మాట్లాడుతూ.. కంటి ఇమేజింగ్ పరీక్షలలో గుండె జబ్బుల లక్షణాలు ముందుగానే గుర్తించవచ్చు. ప్రారంభ దశలోనే గుండె జబ్బులను గుర్తిస్తే.. గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి తీవ్రమైన పరిస్థితులను నివారించవచ్చు. అయితే అధిక రక్తపోటు, స్ట్రోక్‌ను సూచించే కంటి సమస్యలు ఏంటో చూసేద్దాం.
- Hypertensive Retinopathy - అధిక రక్తపోటు వల్ల కళ్లల్లో వచ్చే సమస్య
- Retinal Vein Occlusion - రక్తప్రసరణ బ్లాక్ అవ్వడం(స్ట్రోక్)
- Presence of Hollenhorst Plaques - కొలెస్ట్రాల్ వల్ల వచ్చే క్లాట్స్ (గుండె సమస్యలు)
కొన్ని సాధారణ పరీక్షల ద్వారా ఈ సమస్యలన్నింటినీ గుర్తించవచ్చు. నేత్ర వైద్యులు మీ కంటి వెనుక భాగాన్ని, రెటీనాను పరిశీలించడం ద్వారా చాలా విషయాలను అంచనా వేయగలరట. PMCలో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. రెగ్యులర్ కంటి పరీక్షలు గుండె జబ్బులతో సహా శరీరంలోని అనేక పెద్ద వ్యాధులను కూడా గుర్తించగలవు. రక్త నాళాల అసాధారణతలు, అధిక రక్తపోటు లేదా ఇతర గుండె సంబంధిత ప్రమాదాల సూచనలు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలలో కనిపిస్తాయి.
కంటి స్ట్రోక్ : కంటిలోని కొన్ని భాగాలకు రక్త ప్రసరణ తాత్కాలికంగా నిలిచిపోతే.. కంటిలో కూడా స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల రెటీనాపై చిన్న చిన్న రక్తం గడ్డకట్టడం వంటి మచ్చలు ఏర్పడతాయి.
రెటీనాకు నష్టం : కొన్ని సందర్భాల్లో కంటి రక్తనాళాలకు స్వల్పంగా నష్టం జరిగినా.. గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఈ రకమైన సమస్యలను చూస్తే.. కంటి వైద్యులు తరచుగా శరీరంలోని ఇతర పరిస్థితులు గురించి తెలుసుకోమంటారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు లేదా గతంలో ధూమపానం చేసినవారు, గుండె జబ్బులు ఫ్యామిలీలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు 40 ఏళ్లు దాటితే రెగ్యులర్‌గా కంటి పరీక్షలు చేయించుకోవాలి. రెటీనా OCT స్కాన్ చూసి డాక్టర్ చాలా విషయాలు అర్థం చేసుకోగలరు కాబట్టి.. నేత్ర వైద్యుడు మరిన్ని పరీక్షలు చేయించుకోమని సూచిస్తే ఆలస్యం చేయకండి. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కళ్ళు, గుండెకు మేలు జరుగుతుంది.






















