అన్వేషించండి

‘కాంతార’లో రిషబ్ శెట్టి భుజాలు డిస్‌లొకేట్, ఆ బాధతోనే షూటింగ్ - ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి?

రెండు భుజాలు డిస్ లొకేట్ అయినప్పటికీ చాలా బాధ భరిస్తూ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచెసినట్టు రేషబ్ చెప్పారు.

సంవత్సరపు అతి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా ‘కాంతారా’. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి రెండు భుజాల కీళ్లు డిస్ లొకేట్ అయ్యాయట. అయినప్పటికీ ఆయన చాలా బాధ భరిస్తూ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచెసినట్టు రిషబ్ చెప్పారు. ‘‘రైన్ ఎఫెక్ట్స్‌తో 360 డిగ్రీ షాట్స్ చిత్రికరించడం చాలా కష్టమైన పని. అంతేకాదు, ఆ లోకేషన్ కు నీటిని తీసుకుపోవడం కూడా చాలా కష్టం. కాబట్టి అక్కడే ఉన్న బావి నుంచి నీళ్లు తీసుకోవచ్చా అని గ్రామస్తులను అనుమతి అడిగాం. దాదాపు 7 రోజుల పాటు షూట్ జరిగింది. అక్కడి నీటినే వాడుకున్నాం’’ అని రేషబ్ షెట్టి తెలిపారు. యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు రిషబ్ శెట్టి భుజంలో సమస్య వచ్చిందట. ఒక షాట్ షూట్ సమయంలో ఒక భుజం డిస్ లోకేట్ అయ్యింది. తర్వాత మరో షాట్ లో రెండో భుజం కూడా డిస్ లోకెట్ అయ్యందని తెలిపారు. అయినా షూట్ కొనసాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి.. ఆయన నొప్పితోనే ఆ పూర్తి యాక్షన్ సీక్వెన్స్ పూర్తిచేసిట్టు చెప్పారు.

‘డిస్ లోకేట్’ అంటే ఏమిటి?

కీలులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కప్పులాంటి సాకెట్ నిర్మాణం కాగా, రెండోది అందులో ఇమిడి ఉండే మరో ఎముక బంతి వంటి భాగం. రెండు కలిపి కీలు ఏర్పడుతుంది. ఇలా గిన్నె వంటి ఎముక భాగంలో బంతి వంటి మరో ఎముక భాగం ఇమిడి ఉంటుంది. భుజంలోని కీలు శరీరంలో అత్యంత సులభంగా కదిలే ఎముక. అంతేకాదు, ఇది డిస్ లోకేట్ అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఇలా జరిగిందంటే ఇక అది మళ్లీమళ్లీ జరగవచ్చు. కొన్నిసార్లు ఇలా డిస్ లోకేట్ అయినపుడు వైకల్యం బయటికి కనిపించే విధంగా కూడా ఉంటుంది. భుజంలో వాపు, కండరాలు బిగుసుకు పోవడం, భరించలేనంత నొప్పి, కీలు కదిలించడం దాదాపు అసాధ్యం. ఈ భాగంలో కొంత మేర స్పర్శ తెలియకుండా కూడా ఉండొచ్చు.

ఎందుకు జరుగుతుంది?

భుజం కీలు అన్ని దిశలలో కదిలించడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల ఇది కొంచెం సులభంగానే డిస్ లొకేట్ అవుతుంది. ఎముకలతో అనుసంధానం చేసి ఉన్న లిగమెంట్స్, కండరాలు వంటివన్నీ గాయపడతాయి. చాలా వేగంగా చేతిని భుజం దగ్గర నుంచి తిప్పినపుడు కీలులోని బంతి వంటి నిర్మాణం గిన్నెవంటి నిర్మాణం నుంచి బయటకు రావచ్చు. సమస్య పాక్షికంగా ఉన్నపుడు చేతి పైభాగపు ఎముక సాకెట్ నుంచి చేతి కింది భాగపు ఎముక కొద్దిగా పక్కకు తొలగుతుంది.

ఆటలు ఆడే సమయంలో క్రీడాకారులు చేతిని చాలా దూకుడుగా ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో కీలు గాయపడడం, కొన్ని సార్లు డిస్ లొకేట్ కావడం జరగవచ్చు. ప్రమాదాల్లో పడిపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా యువకులు బలమైన పనులు చేస్తుంటారు కనుక ఇలాంటి సందర్భాల్లో భుజం కీలు తొలగి పొయ్యే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఎవరికైనా ఇలా జరగవచ్చు. కానీ యువకులే ఎక్కువగా బలమైన పనులు చెయ్యడం, ఆటలు ఆడటం చేస్తుంటారు. కనుక వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు?

భుజం కీలుకు బలం చేకూర్చే కండరాలు, లిగమెంట్లు డిస్ లొకేట్ అయినపుడు శాశ్వతంగా గాయపడే ప్రమాదం ఉంటుంది. ఇలా పదేపదే జరిగితే సర్జరీ కూడా అవసరం కావచ్చు. భుజం కీలులో, పరిసరాల్లో ఉండే రక్తనాళాలు కూడ దెబ్బతినవచ్చు. ఇలా జరిగితే నొప్పి చాలా ఎక్కువగా ఉండి కీలును పూర్తిగా కదలకుండా చేస్తుంది. డిస్ లొకేట్ అయినపుడు అయిన గాయం తీవ్రమైనదైతే ఇది పదేపదే జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. గాయపడిన లిగమెంట్లు వాటికి పరిసరాల్లో ఉన్న నాడులు, రక్తనాళాలు దెబ్బతింటాయి. వీటిని సరిచెయ్యడానికి తప్పనిసరిగా సర్జరీ అవసరం అవుతుంది. ఇలా బలమైన పనులు చేసేవారు, అథ్లెట్లు తప్పనిసరిగా ప్రొటెక్టివ్ గేర్ ను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. చేతులు, భుజాలను బలంగా విదిలించడం, లాగడం కూడా చెయ్యకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Also Read: మీరు తందూరి చికెన్ ప్రియులా? జాగ్రత్త దాని వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువేనట

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
Embed widget