(Source: ECI/ABP News/ABP Majha)
Diabetic: మధుమేహులు ఈ ఆహారాలను రాత్రి తినకపోతే బెటర్, ఎక్కువ కాలం జీవించే ఛాన్స్
ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి? ఆహారం విషయంలో డయాబెటిక్ రోగులను ఈ మూడు ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి.
జీవనశైలిలో మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, వారసత్వం, తీవ్ర ఒత్తిడి, అధిక క్యాలరీలుండే ఆహారం... వీటి వల్లే డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అధిక మద్యపానం, ధూమపానం కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధి వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. ఇన్సులిన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం, రక్తంలో గ్లూకోజ్ పెరగడం వల్ల డయాబెటిస్ సమస్య మొదలవుతుంది. ప్రపంచంలో ప్రతి పదిమందిలో ఒకరికి డయాబెటిస్ ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంతగా ఈ మహమ్మారి పాకేస్తోంది. ప్రపంచ జనాభాలో యాభై కోట్లకు మందికి పైగ డయాబెటిక్ రోగులు ఉన్నారు. 2019లో ఉన్న రోగులతో పోలిస్తే 16 శాతం మంది ఇప్పుడు పెరిగారు. అంటే ప్రతి ఏటా మధుమేహుల సంఖ్య పెరిగిపోతోంది.మనదేశంలో ఏడుకోట్ల మందికి పైగా మధుమేహరోగులు ఉన్నారు. 40 ఏళ్లు దాటితే చాలు డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నట్టే. రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వచ్చిన వాళ్ళు కొన్ని అది ఇతర సమస్యలకు దారితీయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఈ ఆహారం వద్దు
కొత్తగా చేసిన ఒక అధ్యయనం ప్రకారం మధుమేహం ఉన్నవారు రాత్రిపూట అధిక మొత్తంలో ఆహారం తినకూడదు. ముఖ్యంగా అతిగా శుద్ధి చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల వారిలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఉదయం తేలికపాటి ఆహారం, మధ్యాహ్నం తృణధాన్యాలు, రాత్రి పూట ఆకుకూరలు, పాలు, ప్రాసెస్ చేయని మాంసం తినడం వల్ల డయాబెటిస్ రోగుల్లో దీర్ఘకాలిక ఆయుష్షు కలుగుతుంది. ఎలాంటి ఇతర రోగాలు దాడి చేయవు ని చెబుతున్నారు వైద్యులు. రాత్రిపూట అధిక ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల మధుమేహులు ఇతర రోగాల బారిన పడడం, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాదాపు 4642 మంది మధుమేహుల డేటాను పరిశోధకులు విశ్లేషించారు. దాన్ని బట్టి రాత్రిపూట వారు తినే ఆహారం ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించారు.
డయాబెటిస్ ఉన్న వారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. షుగర్, బెల్లం, చిప్స్, వెన్న తీయని పాలు, బటర్, చీజ్, మైదాపిండితో చేసిన వంటకాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్లు, జ్యూస్‌లు, అధిక కొవ్వు కలిగిన మాంసం తినకూడదు. అన్నిరకాల పండ్లు, కూరగాయలు, నువ్వుల నూనెతో వండిన వంటలు, పప్పు దినుసులు, నట్స్, సీడ్స్ వంటివి రోజూ తింటే చాలా మంచిది. ఏం తిన్నా రోజుకు కనీసం గంటసేపు వ్యాయామం చేస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
Also read: ఆ బీచ్‌లో గుసగుసలు వినిపిస్తాయి, మాట్లాడేదెవరో తెలియదు, అదో మిస్టరీ
Also read: అలాంటివారికి గుండెపోటు వస్తే బతికే ఛాన్స్ చాలా తక్కువ, కొత్త అధ్యయన ఫలితం